news18-telugu
Updated: December 6, 2020, 3:24 AM IST
Gongura Chicken Recipe : గోంగూరతో చికెన్ కర్రీ... టేస్ట్ అంటే అదీ... (credit - twitter)
Gongura Chicken Recipe : మీరు రెగ్యులర్‌గా చికెన్ కర్రీ తినేవారైతే... మీకు... అదిరిపోయే టేస్టులో గోంగూర చికెన్ కర్రీ చేసుకోవాలనుకుంటే... అదెలాగో ఇప్పుడు తెలుసుకోవచ్చు. జనరల్‌గా బ్యాచిలర్లు... చికెన్ ఫ్రై వండుకొని... అందులో... గోంగూర చట్నీ వేసుకొని తింటారు. అది టేస్టీగానే ఉన్నా... డైరెక్టుగా గోంగూరతోనే చికెన్ కర్రీ చేసుకొని తింటే... ఆ రెండింటి కాంబినేషన్ మామూలుగా ఉండదన్నది నాన్ వెజ్ ప్రియుల మాట. ఐతే... గోంగూర అనగానే చాలా మంది అది వండేందుకు ఎక్కువ టైమ్ పడుతుందని అలా వండుకోవడానికి ఆసక్తి చూపరు. ఇప్పుడు మనం సింపుల్‌గా, వేగంగా ఈ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. తద్వారా ఈజీగా చెయ్యడమూ తెలుస్తుంది, అదిరే టేస్తూ సొంతమవుతుంది.
Gongura Chicken Recipe : కావాల్సినవి :చికెన్ - 500 గ్రాములు (కడిగి, ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి)
అర టేబుల్ స్పూన్ పసుపు
ఉప్పు సరిపడా
10 వెల్లుల్లి రెబ్బలు.
అర అంగుళం అల్లం
Gongura Chicken Recipe : అదనంగా కావాల్సినవి :
నూనె 3 టేబుల్ స్పూన్లు
నాలుగు లవంగాలు
నాలుగు యాలకులు
2 బే ఆకులు
1 పెద్ద దాల్చిన చెక్క
200 గ్రాముల గోంగూర ఆకులు
1 పెద్ద ఉల్లిపాయ (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
కరివేపాకులు - ఒక పొడవాటి రెబ్బ నుంచి తీసుకోండి.
పచ్చి మిర్చి - ఓ నాలుగు
Gongura Chicken Recipe : తయారీ విధానం :
- కుక్కర్లో చికెన్, అల్లం, వెల్లుల్లి వేసి... ఉప్పు వేసి ఉండికించండి.
- ఇప్పుడు అల్లం వెల్లుల్లి బయటకు తీసి... పేస్టులా చేసి... పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు ప్యాన్‌లో ఆయిల్ వేసి... పైన చెప్పుకున్న మసాలాలు అన్నీ వేసి వేపండి.
- అవి పేలుతున్నప్పుడు... అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి... కలపండి, తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపండి... తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కలపండి.
- కలర్ పింక్ అయ్యేవరకూ వాటిని వేపండి. ఇప్పుడు గోంగూర ఆకులు వేయండి. కలుపుతూ... మధ్యలో కరివేపాకులు వెయ్యండి. ఇప్పుడు ఉప్పు ఇతర మసాలాలు అన్నీ వేసేయండి.
- ఆయిల్ విడిపోతున్నట్లుగా అయ్యేంతవరకూ వేపండి.
- ఇప్పుడు చికెన్ ముక్కలు వెయ్యండి. ఐదు నిమిషాలు వేపండి. అన్ని ముక్కలకూ మసాలా, గోంగూర అంటుకుంటుంది.
- ఇప్పుడు నీరు పొయ్యండి. ఆ నీరు పూర్తిగా ఉడికేవరకూ... కర్రీ పేస్టులా అయ్యేవరకూ ఉడికించండి.
- చివర్లో కొత్తిమీర లేదా పుదీనా ఆకులు వేసి... కాస్త చల్లారగానే అన్నంలో కలుపుకొని తిన్నారంటే... ఇక ప్రతిసారీ ఇదే కర్రీ వండుకుంటారంతే.
Published by:
Krishna Kumar N
First published:
December 6, 2020, 3:19 AM IST