HOW TO MAKE EGG FRITTATA IN JUST FIVE MINUTES HERE IS THE NUTRITIONISTS ANSWER MS GH
Egg Frittata: ఐదు నిమిషాల్లోనే సిద్ధం చేసుకోగల కొత్త వంటకం ఎగ్ ఫ్రిట్టాట.. ఎలా తయారు చేసుకోవాలంటే...
ప్రతీకాత్మక చిత్రం
Egg Frittata: గుడ్లతో కొన్ని ప్రత్యేక వంటకాలు తయారు చేసుకోవచ్చు. రోజూ ఒకేలా కాకుండా, కొత్తగా ప్రయత్నించవచ్చు. ఉదయం దొరికే కొద్దిపాటి ఖాళీ సమయంలో సులభంగా, వేగంగా చేసుకోగలిగే మరో వంటకం ఎగ్ ఫ్రిట్టాట. దీన్ని కేవలం 5 నిమిషాల్లోనే సిద్ధం చేసుకోవచ్చు.
ప్రతిరోజూ ఒక గుడ్డు తింటే అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతుంటారు. గుడ్లు ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు, ఖనిజాలకు నిలయాలు. బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. శరీర జీవక్రియల్లో ముఖ్యమైన పాత్ర పోషించే ప్రోటీన్, కాల్షియం, ఐరన్, విటమిన్ డి వంటివి గుడ్ల నుంచి అందుతాయి. ఉడికించిన గుడ్లు, ఆమ్లెట్‌ను చాలామంది బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకుంటారు. వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. కానీ రోజూ ఒకే రకమై ఆహారాన్ని తీసుకోవడానికి చాలామంది ఇష్టపడరు. ఇవే కాకుండా గుడ్లతో కొన్ని ప్రత్యేక వంటకాలు తయారు చేసుకోవచ్చు.
రోజూ ఒకేలా కాకుండా, కొత్తగా ప్రయత్నించవచ్చు. ఉదయం దొరికే కొద్దిపాటి ఖాళీ సమయంలో సులభంగా, వేగంగా చేసుకోగలిగే మరో వంటకం ఎగ్ ఫ్రిట్టాట. దీన్ని కేవలం 5 నిమిషాల్లోనే సిద్ధం చేసుకోవచ్చు. దీన్ని తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం.
ఎలా తయారు చేయాలి..?
ఒక గిన్నెలో నాలుగు గుడ్లు గిలకొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఉప్పు, మిరియాలు, పాలకూర, ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. అవసరమైతే పుట్టగొడుగులు, క్యాప్సికం, టమాటా, రుచి కోసం ఇతర మసాలాలను కూడా వేసుకోవచ్చు. అనంతరం దీన్ని ఓవెన్లో 150 డిగ్రీల సెల్సియస్ వద్ద 20 నిమిషాలపాటు బేక్ చేయాలి. ఈ పద్ధతిలో ఐదు నిమిషాల్లోనే ఎగ్ ఫ్రిట్టాటా రెడీ అవుతుంది. ఇంట్లో ఓవెన్ లేనివారు నాన్ స్టిక్ పెనంపై నూనె లేదా బటర్ వేసుకొని.. ఆమ్లెట్ లాగా పది నుంచి 15 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండేవారు గుడ్లలో పచ్చ సొన తీసివేసి దీన్ని తయారు చేసుకోవచ్చు.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.