HOME »NEWS »LIFESTYLE »how to make dry pepper chicken masala recipe easy way to learn how to cook dry pepper chicken masala curry nk

Dry Pepper Chicken Masala Recipe: మిరియాలతో చికెన్ మసాలా రెసిపీ... సూపర్ టేస్ట్

Dry Pepper Chicken Masala Recipe: మిరియాలతో చికెన్ మసాలా రెసిపీ... సూపర్ టేస్ట్
Dry Pepper Chicken Masala Recipe: మిరియాలతో చికెన్ మసాలా రెసిపీ... సూపర్ టేస్ట్

Dry Pepper Chicken Masala Recipe: వాతావరణం చల్లగా ఉన్నప్పుడు... ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తే... మిరియాల చికెన్ మసాలా వండుకోవడం సరైన నిర్ణయమే.

  • Share this:
    Dry Pepper Chicken Masala Recipe: చికెన్ కర్రీల్లో వందల రకాలున్నాయి. రోజూ కొత్త కొత్త వరైటీల కోసం అంతర్జాతీయ చెఫ్‌లు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. మనం వండిన ప్రతిసారీ చికెన్ కర్రీ ఒకేలా చేసుకుంటే రొటీన్ అయిపోతుంది. అందుకే ఇవాళ డ్రై మిరియాల చికెన్ మసాలా కర్రీ ఎలా వండుకోవాలో తెలుసుకుందాం. దీని తయారీలో భారతీయ మసాలా రుచులు కలుస్తాయి. అందువల్ల ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని రైస్ లేదా నాన్‌తో తీసుకుంటే రుచి మామూలుగా ఉండదు. దీనికి ఐటెమ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి 10 నిమిషాలు, వండటానికి 30 నిమిషాలు పడుతుంది. నలుగురి కోసం వండుకోవడానికి సరిపడా కర్రీ ఎలా చెయ్యాలో తెలుసుకుందాం.

    Dry Pepper Chicken Masala Recipe తయారీకి కావాల్సినవి:


    చికెన్ - 1 కేజీ
    నూనె - 3 టేబుల్ స్పూన్లు
    సోంపు - 1 టేబుల్ స్పూన్
    ఉల్లిపాయలు - 2 పెద్దవి. (సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి)
    పచ్చిమిర్చి - 3 (మధ్యలోకి కట్ చేసుకోవాలి)
    కరివేపాకులు - కొన్ని
    అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
    పసుపు - 1 టీస్పూన్
    ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు
    గరం మసాలా పొడి - 2 టీస్పూన్లు
    ఉప్పు - సరిపడా
    తాజా నల్ల ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు (పొడి చేసుకోండి)
    నిమ్మరసం - రుచికి సరిపడా
    కొత్తిమీర - సరిపడా

    Dry Pepper Chicken Masala Recipe తయారీ విధానం:
    - స్టవ్ ఆన్ చేసి... మీడియం ఫ్లేమ్ పెట్టి... కడాయి పెట్టి... అందులో నూనె వెయ్యండి. వేడి కాగానే... సోంపు గింజలు వేయండి. అవి చిటపట శబ్దం చేసేవరకూ ఆగండి.
    - ఇప్పుడు వెంటనే ఉల్లి ముక్కలు వెయ్యండి, కొన్ని క్షణాలకే కరివేపాకులు, వెంటనే పచ్చిమిర్చి వెయ్యండి. 5 నుంచి 10 నిమిషాలు వేపండి. అవి గోల్డెన్ కలర్ లోకి మారాలి.
    - ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వెయ్యడానికి సరైన సమయం. వేసి... ఓ నిమిషం అటూ ఇటూ కదుపుతూ ఉండండి. తద్వారా... అది అడుగున అతుక్కోకుండా ఉంటుంది.
    - ఇప్పుడు మిగతా పొడులన్నీ (మిరియాల పొడి కాకుండా) వేసి... అటూ ఇటూ కదుపుతూ ఉండండి.
    - కొన్ని క్షణాలకే చికెన్ ముక్కలు వేసి... వాటికి మసాలా పూర్తిగా అంటుకునేలా చెయ్యండి. ఇప్పుడు మూత పెట్టండి.
    - 30 నుంచి 40 నిమిషాలపాటూ... చికెన్ ఉడకనివ్వాలి. మధ్యమధ్యలో రెండు మూడు సార్లు ముక్కల్ని అటూ ఇటూ కదపడం మర్చిపోవద్దు.
    - ఇప్పుడు కడాయి మూత తియ్యండి. మంట పెంచి... మసాలా మొత్తం చికెన్ ముక్కలకు బాగా అంటుకొని... అంతా డ్రై అయ్యలా వండండి. అంటే ఫ్రై చికెన్ లాగా.
    - ఇప్పుడు కిందకు దించి... మిరియాల పొడి వేసి కలపండి.
    - కొన్ని క్షణాలకు నిమ్మరసం వేసి కలపండి. చివర్లో కొత్తిమీర చల్లండి. చివరిగా మరోసారి కలపండి.
    - ఇది వండేటప్పటికే... ఇల్లంతా ఘుమఘుమలు వచ్చేస్తాయి. ఇక ఆలస్యం చెయ్యకండి... వేడిగా ఉన్నప్పుడే ఇంటిల్లిపాదీ తినేయండి. అదిరిపోయే టేస్ట్ ఆస్వాదించండి.
    Published by:Krishna Kumar N
    First published:January 24, 2021, 03:20 IST