హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Food : కరకరలాడే ఉల్లి గారెలు... ఇలా తయారుచెయ్యండి

Food : కరకరలాడే ఉల్లి గారెలు... ఇలా తయారుచెయ్యండి

ఉల్లి గారెలు (credit - twitter - ed sum)

ఉల్లి గారెలు (credit - twitter - ed sum)

Food : ఎప్పుడూ తినే వంటలే తినాలంటే మనకూ బోరే. కొత్త వరైటీలు ట్రై చెయ్యాలని చాలా మందికి ఉంటుంది. తీరా ట్రై చేశాక అవి సరిగా ఉండకపోతే నిరాశ కలుగుతుంది. అలాంటి ఛాన్స్ లేకుండా చేస్తున్నాయి ఉల్లి గారెలు. వాటి తయారీ విధానం తెలుసుకుందాం.

  Food : ఉల్లిపాయలతో పకోడీ చేసుకోవడం అందరికీ తెలుసు. గారెల్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవడమూ చాలా మందికి తెలుసు. ఐతే... ఆ గారెలు కరకరలాడవు. అలాకాకుండా... కొన్ని మార్పులతో... పూర్తిగా కరకరలాడే ఉల్లి గారెలు తయారుచేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో... కార్పొరేట్ చెఫ్‌లు కొన్ని సూచనలు చేశారు. వాటి ప్రకారం చేస్తే... మనం కూడా కరకరలాడే ఉల్లిగారెల్ని టేస్ట్ చూడొచ్చు. ఎప్పుడూ తినే వంటలే తినాలంటే మనకూ బోరే. కొత్త వరైటీలు ట్రై చెయ్యాలని చాలా మందికి ఉంటుంది. తీరా ట్రై చేశాక అవి సరిగా ఉండకపోతే నిరాశ కలుగుతుంది. అలాంటి ఛాన్స్ లేకుండా చేస్తున్నాయి ఉల్లి గారెలు. వాటి తయారీ విధానం తెలుసుకుందాం.

  ఉల్లి గారెల తయారీకి కావాల్సినవి :

  12 ఉల్లిపాయల రింగులు

  50 గ్రాముల ప్రీ డస్ట్ (pre dust)

  100 గ్రాముల వెన్న (batter)

  100 గ్రాముల పాంకో క్రంబ్స్ (Panko crumbs)

  30 గ్రాముల చిపోట్లే చిల్లీ డిప్ (chipotle chilli dip)

  2 గ్రాముల కాజోన్ సీజనింగ్ (Cajon seasoning)

  ఉల్లి గారెల తయారీ :

  - తొక్క తీసిన ఉల్లిపాయలను 10 మిల్లీమీటర్ల మందంలో గుండ్రంగా (slices) కట్ చెయ్యాలి.

  - ఉల్లి రింగుల్లో ప్రతీ రెండు రింగులను ఒక సెట్టుగా వేరు చేసి పక్కన పెట్టుకోవాలి.

  - ఉల్లి రింగులకు ప్రీ డస్ట్ కలిపి... వెన్నలో ముంచి తియ్యాలి. వాటిపై పాంకో క్రంబ్స్ పొయ్యాలి.

  - అన్ని సెట్ల రింగులనూ పై విధంగా చేసి... ఓ షీట్ ట్రేలో పెట్టుకోవాలి.

  - ఇప్పుడు నూనెలో వాటిని వేయించాలి. గోల్డెన్, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించాలి.

  - ఇప్పుడు వాటిని నూనె లోంచీ తీసి... వాటిపై కాజోన్ సీజనింగ్‌ని చల్లాలి.

  - ఇప్పుడు వాటిని చిపోట్లే చిల్లీ డిప్‌తో వేడివేడిగా ఉన్నప్పుడే... సెర్వ్ చేస్తే... టేస్ట్ అదిరిపోతుంది.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Health benifits, HOME REMEDIES, Telugu news, Telugu varthalu, Tips For Women