Cornflakes Chicken : కరకరలాడే కార్న్‌ఫ్లేక్స్ చికెన్... తిని తీరాల్సిందే...

చికెన్‌తో వచ్చిన లక్కేంటంటే దాన్ని వందల రకాలుగా వండొచ్చు. ఎలా వండినా బాగుంటుంది. మరి కార్న్‌ఫ్లేక్స్ చికెన్ ఎలా చెయ్యాలో తెలుసుకుందాం.

news18-telugu
Updated: July 5, 2020, 3:36 AM IST
Cornflakes Chicken : కరకరలాడే కార్న్‌ఫ్లేక్స్ చికెన్... తిని తీరాల్సిందే...
Cornflakes Chicken : కరకరలాడే కార్న్‌ఫ్లేక్స్ చికెన్... తిని తీరాల్సిందే... (credit - twitter)
  • Share this:
సింపుల్‌గా, ఈజీగా, తేలిగ్గా, వెంటనే వండేసుకునేలా ఏదైనా చికెన్ వంట ఉంటే బాగుండు అనుకుంటున్నారా... డోంట్ వర్రీ... ఇదిగో ఈ కార్న్‌ఫ్లెక్స్ చికెన్ కర్రీ అలాంటిదే. ఎప్పుడూ ఈజీగా అయిపోయే చికెన్ ఫ్రై లాగే... ఇది కూడా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలకు ఈ కర్రీ బాగా నచ్చుతుంది. మీకు మిగల్చకుండా మొత్తం వాళ్లే తినేసినా ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకంటే... కార్న్‌ఫ్లేక్స్ పిల్లలకు చాలా ఇష్టం. ఇప్పుడు వాటికి చికెన్ తోడై... జంతికల్లాగా... కరకరలాడుతూ ఉంటే... నోట్లో పెట్టుకొని... పండ్ల మధ్య అలా అలా కొరుకుతూ... తింటూ... వావ్... వావ్... అనుకుంటూ లాగించేస్తారు. మరి ఇంకెందుకు లేటు... ఎలా చెయ్యాలో తెలుసుకుందాం.

కార్న్‌ఫ్లేక్స్ చికెన్ - కావాల్సినవి :

- చికెన్ బ్రెస్ట్ - 500 గ్రాములు. (మీడియం సైజు ముక్కలుగా చేసుకోవాలి)
- కార్న్ ఫ్లేక్స్ - 2 కప్పులు
- గుడ్డు - 1
- పెరుగు - అరకప్పు
- కారం - 1 టేబుల్ స్పూన్- నల్ల మిరియాల పొడి - అర టీ స్పూన్
- చాట్ మసాలా - పావు టీస్పూన్
- పసుపు - అర టీస్పూన్
- తందూరీ చికెన్ మసాలా - 1 టేబుల్ స్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1న్నర టేబుల్ స్పూన్
- కార్న్ ఫ్లోర్ / స్టార్చ్ - 2 టేబుల్ స్పూన్లు
- ఫ్రై కోసం సరిపడా ఆయిల్
- ఉప్పు - సరిపడా.

కార్న్‌ఫ్లేక్స్ చికెన్ - చేసే విధానం :
- చికెన్ ముక్కలకు పెరుగు, పసుపు, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్, తందూరి మసాలా, ఉప్పు వేసి... బాగా కలపాలి. ఓ 4 గంటలు ఫ్రిజ్‌లో పెట్టి ఉంచాలి.
- 4 గంటల తర్వాత ఫ్రిజ్ నుంచి బయటకు తీసి అలా ఉంచాలి.
- ఇప్పుడు కార్న్ ఫ్లేక్స్‌ని పొడిలా అయ్యేలా చితక్కొట్టాలి. ఆ తర్వాత వాటిని అలా పక్కన పెట్టాలి.
- ఇప్పుడు గుడ్డును పగలగొటటి... కొద్దిగా ఉప్పు వేసి పక్కన పెట్టాలి.
- ఈలోగా చికెన్ కూలింగ్ తగ్గి... మామూలుగా అవుతుంది. అప్పుడు కార్న్ ఫ్లోర్ స్టార్చ్‌ను చికెన్‌పై వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు చికెన్ ముక్కను ఎగ్‌ మిక్స్‌లో ముంచి తీసి... దానికి కార్న్ ఫ్లేక్స్ పొడిని అంటించాలి.
- ప్యాన్ లేదా బాణలిలో నూనె వేయించి... అందులో చికెన్ ముక్కలు వేసి.. అటూ ఇటూ మెల్లగా తిప్పుతూ ఫ్రై చెయ్యాలి.
- గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక... ముక్కల్ని తీసి పక్కన పెట్టాలి. వేడివేడిగా సెర్వ్ చెయ్యాలి. నిమిషాల్లో నోట్లోకి వెళ్లిపోతాయి.
Published by: Krishna Kumar N
First published: July 5, 2020, 3:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading