Chicken Mappas : చికెన్ మప్పాస్ కర్రీ... తయారీ చాలా ఈజీ... తింటే వదలరంతే...

ఇప్పటికే మనం చికెన్‌లో చాలా రకాల కొత్త వరైటీలను చెప్పుకున్నాం. ఇప్పుడు అత్యంత ఈజీగా, త్వరగా తయారుచేసుకునే చికెన్ మప్పాస్ కర్రీ ఎలా చెయ్యాలో తెలుసుకుందాం.

news18-telugu
Updated: July 12, 2020, 4:53 AM IST
Chicken Mappas : చికెన్ మప్పాస్ కర్రీ... తయారీ చాలా ఈజీ... తింటే వదలరంతే...
చికెన్ మప్పాస్ కర్రీ... తయారీ చాలా ఈజీ... (credit - twitter)
  • Share this:
కొత్త కొత్త వంటలు చేయాలనుకునేవారికి చికెన్ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రోజూ... గ్రాండ్ చెఫ్‌లు చికెన్‌తో కొత్త కొత్త వరైటీలు ట్రై చేస్తూనే ఉన్నారు. అలాంటి వాటిలోంచీ పుట్టిందే ఈ చికెన్ మప్పాస్ రెసిపీ. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి 10 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఆ తర్వాత... వండుకోవడానికి 20 నిమిషాలు మాత్రమే పడుతుంది. అంటే... పెద్దగా కష్టపడకుండా... అదిరిపోయే టేస్టుతో మప్పాస్ కర్రీ అయిపోతుంది. మీకు కొబ్బరిపాల వంటలు ఇష్టమైతే... ఇది మీకు బాగా నచ్చుతుంది. నేను చెప్పేది... ముగ్గురికి సరిపడా ఎలా చేసుకోవాలో చెబుతున్నాను. అంతకన్నా ఎక్కువమంది ఉంటే... ఐటెమ్స్... క్వాంటిటీ పెంచుకోవాల్సి ఉంటుంది. మరి చికెన్ మప్పాస్ కర్రీ తయారీ తెలుసుకుందాం.

Chicken Mappas Recipe : కావాల్సినవి :

చికెన్ - 500 గ్రాములు
కొబ్బరిపాలు (చిక్కగా ఉండాలి) - 2 కప్పులు
ధనియాల పొడి - 11/2 టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
తందూరీ చికెన్ మసాలా పొడి 1 టీస్పూన్3 పచ్చిమిర్చి - సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి.
ఎండుమిర్చి - 2
గరం మసాలా పొడి - 1 టీస్పూన్
ఉల్లి - 2 పెద్దవి.
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
నూనె 4 టీస్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
కొత్తిమీర, కరివేపాకు - సరిపడా
ఉప్పు - సరిపడా

Chicken Mappas Recipe : తయారీవిధానం :
- ఓ గిన్నెలోకి చికెన్ తీసుకొని... కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వాటిలో వెయ్యాలి. (చికెన్‌లో సగం ఉల్లిపాయ ముక్కలు ఉండాలి)
- అల్లంవెల్లుల్లి పేస్టులో సగం వెయ్యాలి. ఎండు మిర్చి ఓ రెండు వేయండి.
- సగం ధనియాల పొడి వెయ్యండి. పసుపు, చికెన్ మసాలా, కరివేపాకు వెయ్యండి.
- మొత్తం కలిపేయండి. ఓ పావుగంట పక్కన పెట్టండి.
- ఇప్పుడు ప్యాన్ (బాణలి)లో కొబ్బరిపాలుపోసి... కొద్దిగా నీరు కలపండి. (పాల చిక్కదనం తగ్గించండి)
- అందులో గిన్నెలో ఉంచిన చికెన్, ఇతరత్రా అన్నీ వేయండి. 15 నిమిషాలు ఉడికించండి.
- చికెన్ దాదాపు ఉడికినట్లే. దాన్ని మరో గిన్నెలోకి తీసుకోండి.
- ఇప్పుడు అదే కడాయిలో నూనె వేసి ఆవాలు, ఉల్లి, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి... బంగారు రంగులోకి వచ్చే వరకూ వేయించండి.
- ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు వేయండి. బాగా కలపండి.
- ఇప్పుడు ఇందులో చికెన్ వేసి కలపండి.

ఇప్పుడు దీన్ని కొబ్బరి పాల రైస్‌, లేదా రోటీ లేదా దోసెతో కలిపి తింటే... మంచి టేస్ట్ ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడే తింటే... ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది.
Published by: Krishna Kumar N
First published: July 12, 2020, 4:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading