హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Teriyaki Chicken: బేకింగ్ తెరియాకీ చికెన్... వండుకుంటే టేస్ట్ అదుర్స్...

Teriyaki Chicken: బేకింగ్ తెరియాకీ చికెన్... వండుకుంటే టేస్ట్ అదుర్స్...

పాలతో పాటు స్పైసీగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోకూడదు. దీని వల్ల మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది గ్యాస్ ప్రాబ్లం‌కు దారి తీస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)

పాలతో పాటు స్పైసీగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోకూడదు. దీని వల్ల మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది గ్యాస్ ప్రాబ్లం‌కు దారి తీస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Baked Teriyaki Chicken: ప్రముఖ ఫైవ్ స్టార్ హోటళ్ల చెఫ్‌లు బేకింగ్ తెరియాకీ చికెన్ వండుకోమని సలహా ఇస్తుంటారు. ఎందుకు? అది ఎలా తయారుచెయ్యాలి? తెలుసుకుందాం.

  Baked Teriyaki Chicken : ఈ రోజుల్లో ఇండియన్స్ ఎక్కువగా తింటున్న మాంసం చికెన్. ఐతే... చికెన్‌ని దాదాపు 100 రకాలుగా వండుకోవచ్చు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త చికెన్ వంటకాల్ని కనిపెడుతూనే ఉన్నారు. అలాంటి వాటిలో బేక్ చేసిన తెరియాకీ చికెన్ ప్రత్యేకమైనది. చికెన్ మరీ ఎక్కువ డ్రై అవ్వకుండా... మెత్తగా, రుచికరంగా ఉండటం దీని స్పెషాలిటీ. ఇంట్లో ఎక్కువ మంది ఉంటే... ఇలాంటి రెసిపీ వండుకోవడం మేలు. ఎందుకంటే దీన్ని తయారుచేసుకోవడం చాలా తేలిక. ఎక్కువ మందికి ఈజీగా వండి పెట్టొచ్చు. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇది ఒకసారి తింటే 272 కేలరీల ఎనర్జీ, 9.8 గ్రాముల ఫ్యాట్, 85 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్, 1282 మిల్లీ గ్రాముల సోడియం, 19.9 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 24.7 గ్రాముల ప్రోటీన్ లభిస్తాయి. అందువల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంకెందుకాలస్యం తెరియాకీ చికెన్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

  కావాల్సినవి : (ఆరుగురికి సరిపడా వండుకోవాలంటే)

  12 స్కిన్ లెస్ చికెన్ తొడ ముక్కలు (chicken thighs)

  1 టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్ (cornstarch - కార్న్ స్టార్చ్ పొడి)

  1 టేబుల్ స్పూన్ చల్లటి నీరు

  అర కప్పు షుగర్

  అర కప్పు సోయా సాస్

  పావు కప్పు సైడెర్ వెనిగర్ (cider vinegar)

  1 వెల్లుల్లిపాయ (నూరి ఉంచుకోవాలి)

  అర టీ స్పూన్ నూరిన అల్లం

  పావు టీ స్పూన్ నల్ల మిరియాలు

  తయారీ విధానం :

  Step 1 - స్టవ్ పై పాన్ (బాణలి) పెట్టి... సిమ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు కార్న్ స్టార్చ్, చల్లటి నీరు, పంచదార, సోయా సాస్, వెనిగర్, వెల్లుల్లి, అల్లం, నల్ల మిరియాలు అన్నీ కలిపి పాన్‌లో వెయ్యాలి. కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండాలి. ఇలా... సాస్ కాస్త చిక్కగా, బుడగలు వచ్చే వరకూ కలుపుతూ ఉండాలి.

  Step 2 - ఇప్పుడు ఓవెన్‌ను వేడి చేసుకోవాలి.

  Step 3 - ఇప్పుడు చికెన్ ముక్కల్ని బేకింగ్ డిష్‌పై ఉంచాలి. రెడీ చేసుకున్న సాస్‌ను చికెన్ ముక్కలపై పూతలా రాయాలి. ముక్కల్ని తిరగేయాలి. అటు కూడా సాస్ రాయాలి.

  Step 4 - ముందే వేడి చేసుకున్న ఓవెన్‌లో చికెన్ ముక్కల్ని 30 నిమిషాలపాటూ బేకింగ్ చెయ్యాలి. తర్వాత ముక్కల్ని తిరగేసి... మరో 30 నిమిషాలపాటూ... బేక్ చెయ్యాలి. ప్రతీ 10 నిమిషాలకు ఓసారి ముక్కలపై సాస్ రాస్తూ ఉండాలి. చికెన్ ముక్కలు కలర్ మారుతున్నప్పుడు.. పైన ఉన్న సాస్.. జ్యూసెస్ మాయమవుతున్నప్పుడు... ముక్కల్ని తీసేయాలి. అంతే... రుచికరమైన తెరియాకీ చికెన్ రెడీ.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Health, HOME REMEDIES, Life Style, Recipe, Recipes, Telugu news, Tips For Women

  ఉత్తమ కథలు