హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Mutton: మటన్ కొనడానికి వెళ్తున్నారా.. అయితే అది ముదురుదా.. లేతదా అనేది ఇలా గుర్తుపట్టండి..

Mutton: మటన్ కొనడానికి వెళ్తున్నారా.. అయితే అది ముదురుదా.. లేతదా అనేది ఇలా గుర్తుపట్టండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mutton: గత ఏడాదిన్నర నుంచి కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గినా ఎప్పుడు ఎవరికి ఏ సమయంలో విరుచుకుపడుతుందో తెలియదు. అయితే అంతకముందు ఎన్నడూ లేనంతగా మనుషుల్లో మాత్రం చాలా మార్పులు చోటు చుసుకున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటారు. వాటిని తీసుకునే సమయంలో మంచి మాంసం ఎలా గుర్తుపట్టాలి.. తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...

  గత ఏడాదిన్నర నుంచి కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గినా ఎప్పుడు ఎవరికి ఏ సమయంలో విరుచుకుపడుతుందో తెలియదు. అయితే అంతకముందు ఎన్నడూ లేనంతగా మనుషుల్లో మాత్రం చాలా మార్పులు చోటు చుసుకున్నాయి. ముఖ్యంగా వ్యాధి నుంచి తమను తాము కాపాడుకోవడానికి రోగ నిరోధకశక్తి పెంచుకోవడానికి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు. ఇందులో కొంతమంది నాన్ వెజ్ అంటే మాసాహారం తినని వారు డ్రై ఫ్రూట్స్(Dry Fruits) తింటూ వాళ్ల రోగనిరోధకశక్తిని పెంచుకుంటుంటే.. మరి కొందరు చికెన్, మటన్ దీంతో పాటు చేపలు కూడా తింటూ పెంచుకుంటున్నారు. అయితే చాలామంది మటన్ షాప్ కు వెళ్లినప్పుడు కిలో లేదా రెండు కిలోల మటన్ చెప్పి.. ఆ షాప్ యజమాని ఇచ్చింది తెచ్చుకుంటాం..

  Live Longer: మీకు ఎక్కువ కాలం బతకాలని ఉందా..! అయితే ఇలా చేయండి..


  కానీ కొంతమంది ఆ మటన్ ముదురుదా..లేదా అనేది ఆరా తీస్తారు. ముదురు మాంసం అయితే ఎక్కువగా చాలామంది ఇష్టపడరు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇదంతా ఇలా ఉంచితే.. ముదురుది, లేత అనేది ఎలా గుర్తు పట్టాలి.. వాటి కోసం ఏం చేయాలి ఇక్కడ తెలుసుకుందాం.. చికెన్ కంటే కూడా మటన్ తినడం చాలామంచింది. ఎందుకంటే.. అందులో ముఖ్యంగా విట‌మిన్ బి12 మ‌ట‌న్ ద్వారా ఎక్కువ‌గా ల‌భిస్తుంది. ముఖ్యంగా..

  Ants Problems: ఇంట్లో చీమలతో చిరాకు వేస్తోందా.. ఈ చిట్కాలను వాడి చీమలను తరిమికొట్టేయండి..


  మాంసం దుకాణాల్లో మనకు కనిపించే మటన్(గొర్రె లేదా మేక) అనేది లేత మటన్ అయితే.. లేత ఎరుపు రంగులో కనిపిస్తుంటుంది. అది ఒక వేళ ముదురు మటన్(Meat) అయితే మాత్రం డార్క్ రెడ్(Dark Red) లో కనిపిస్తుంది.

  మటన్ పై కొవ్వు(Fat) అనేది ప‌సుపు(Turmaric) లేదా బూడిద రంగులో ఉంటే మాత్రం అది ముదురు మటన్ అని.. కొవ్వు తెల్ల‌(White)గా, లేత‌ ప‌సుపు రంగులో ఉంటే అది లేత మటన్ అని మనం గుర్తించవచ్చు.

  లేత మటన్ నుంచి ఆ కొవ్వును సులువుగా తొలగించవచ్చు. ముదురు మటన్ నుంచి ఆ కొవ్వను తొలగించాలంటే సలుభంగా వేరు చేయలేము. అది చాలా గ‌ట్టిగా ఉంటుంది.

  Remove Lizards From Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..


  లేత మటన్ అనేది వాసన (Smell) వస్తూ ఉంటుంది.. ముదురు మటన్ వాసన రాదు.

  సులభంగా గుర్తించే మరి కొన్ని చిట్కాలు(tips) ఏంటంటే.. మటన్ పై వేలితో నొక్కితే సొట్టలు పడతాయి.

  ఇలా ఏర్పడితే అది ముదురు మటన్ అని అర్ధం. పక్కటెముకలు చిన్నగా ఉంటే లేత మటన్ అని.. పెద్దగా ఉంటే ముదురు మటన్ అని గుర్తుంచుకోవచ్చు.

  అన్నింటి కంటే మరో చిన్న చిట్కా(Tips) ఏంటంటే.. తోక చిన్నగా ఉంటే లేతది అని.. పెద్ద‌గా ఉంటే ముదురు మ‌ట‌న్ అని తెలుసుకోవచ్చు. ఇలాంటివి ఫాలో అయి లేత లేదా ముదురు మటన్ ను గుర్తించవచ్చు. ఇక ముందు దుకాణానికి వెళ్లినప్పుడు పై విషయాలను గుర్తుపెట్టుకొని వెళ్లిండి.

  Published by:Veera Babu
  First published:

  Tags: Health, Health benifits, Mutton

  ఉత్తమ కథలు