• HOME
 • »
 • NEWS
 • »
 • LIFE-STYLE
 • »
 • HOW TO KEEP YOUR KIDS SAFE DURING THIS WINTER SEASON READ HERE MS

Winter Care For Kids: చలికాలంలో మీ చిన్నారులు జాగ్రత్త.. ఈ టిప్స్ పాటించండి...

Winter Care For Kids: చలికాలంలో మీ చిన్నారులు జాగ్రత్త.. ఈ టిప్స్ పాటించండి...

ప్రతీకాత్మక చిత్రం

చలికాలం సాధారణంగా చిన్నారుల ఆరోగ్యంపై గట్టిగా ప్రభావితం చూపిస్తుంది.  ఒక వైపు వాతావరణ ఎంతో అహ్లాదంగా ఉందనిపించినా మరో వైపు పిల్లలలో ఆస్థమా రావడం, చెవులలో ఇన్ఫెక్షన్, దీర్ఘకాలపు దగ్గు, పొడిబారి దురదలతో కూడిన చర్మం తో పాటూ ఎక్కువ చలి కారణంగా వారి ముక్కుల నుండి రక్తం రావడం వంటి సమస్యలు చలికాలంలో తలెత్తే ప్రమాదం ఉంది.

 • News18
 • Last Updated:
 • Share this:
  చలికాలం సాధారణంగా చిన్నారుల ఆరోగ్యంపై గట్టిగా ప్రభావితం చూపిస్తుంది.  ఒక వైపు వాతావరణ ఎంతో అహ్లాదంగా ఉందనిపించినా మరో వైపు పిల్లలలో ఆస్థమా రావడం, చెవులలో ఇన్ఫెక్షన్, దీర్ఘకాలపు దగ్గు, పొడిబారి దురదలతో కూడిన చర్మం తో పాటూ ఎక్కువ చలి కారణంగా వారి ముక్కుల నుండి రక్తం రావడం వంటి సమస్యలు చలికాలంలో తలెత్తే ప్రమాదం ఉంది.  అయితే ఇవి సంభవించకుండా తల్లితండ్రులు తమ పిల్లలకు కొన్ని ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో నేర్పించి బయట ఆడుకోవడానికి పంపించినట్లయితే చలికాలాన్ని మరింత ఆస్వాదించగలుగుతారు. చలికాలం సాధారణంగా చిన్నారుల ఆరోగ్యంపై గట్టిగా ప్రభావితం చూపిస్తుంది.  ఒక వైపు వాతావరణ ఎంతో అహ్లాదంగా ఉందనిపించినా మరో వైపు పిల్లలలో ఆస్థమా రావడం, చెవులలో ఇన్ఫెక్షన్, దీర్ఘకాలపు దగ్గు, పొడిబారి దురదలతో కూడిన చర్మం తో పాటూ ఎక్కువ చలి కారణంగా వారి ముక్కుల నుండి రక్తం రావడం వంటి సమస్యలు చలికాలంలో తలెత్తే ప్రమాదం ఉంది.

  అయితే ఇవి సంభవించకుండా తల్లితండ్రులు తమ పిల్లలకు కొన్ని ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో నేర్పించి బయట ఆడుకోవడానికి పంపించినట్లయితే చలికాలాన్ని మరింత ఆస్వాదించగలుగుతారు.

  తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఈ సంవత్సరపు చలి కాలం
  భారత వాతావరణ శాఖ పేర్కొంటున్న ప్రకారం ఈ సంవత్సరం చలి కాలం ఫిబ్రవరి వరకూ కొనసాగే అవకాశముంది.  దేశంలోని చాలా భాగాలలో ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య, మధ్య మరియు తూర్పు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గే ప్రమాదముంది.  అలానే పలు ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది.  దీంతో రాత్రి మరియు పగలు ఉష్ణోగ్రతల మధ్య ఎక్కువగా వత్యాసం ఉండే అవకాశముంది.

  ఇలా తగ్గిన ఉష్ణోగ్రతల వలన పెరిగిన చలి వలన అన్ని వయస్సుల వారిలో అందులోనూ ముఖ్యంగా చిన్నారులలో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

  జలుబు మరియు ఫ్లూ జ్వరం
  జలుబు మరియు ఫ్లూ జ్వరాలు చలి పెరగడం వలన వస్తాయని చెప్పలేక పోయినా శరీరంలో సరైన రోగ నిరోధక వ్యవస్థ లేకపోయిన వారిలో ఎక్కువగా చలికాలంలో కనిపిస్తాయి.  ఇవి సాధారణంగా గాలి ద్వారా ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తాయి.  ఇన్ఫ్లుఇన్జా అనేది సాధారణ ఫ్లూ వైరస్ వ్యక్తి శ్వాస కోస వ్యవస్థ అంటే ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తాయి.  పలు సందర్భాలలో ఇది సాధారణంగా తగ్గిపోయినా కొందరిలో మాత్రం ప్రాణాంతకమయ్యే అవకాశాలు లేక పోలేదు.
  ఇలా ఎక్కువ ప్రమాదం సంభవించే అవకాశమున్న వారిలో ఐదు సంవత్సరముల వయస్సు లోపున్న మరీ ముఖ్యంగా 6 నెలలోపు చిన్నారులతో పాటూ 65 సంవత్సరముల కన్నా ఎక్కువ వయస్సున్న పెద్దలు ఉన్నారు.

  వీరితో పాటూ సుదీర్ఘకాలంగా హాస్పిటల్స్ లేదా ఆరోగ్య సేవలు అందించే కేంద్రాలలో గడిపిన వారు, గర్భవతులు మరియు ప్రసవించిన తర్వాత రెండు వారాల లోపున్న జన్మనిచ్చిన తల్లులు,  సరైన రోగ నిరోధక వ్యవస్థ లేని పెద్ద వారు, దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారు అంటే ఆస్థమా, గుండె రోగాలు, మూత్ర పిండాలకు సంబంధించిన జబ్బులున్న వారు, కాలేయ సమస్యలు, డయాబెటీస్ మరియు ఊబకాయం  ఉన్న వారికి కూడా ప్రమాదం ఎక్కువ స్థాయిలో ఉంటుంది.

  దగ్గు
  దగ్గు గొంతు లేదా శ్వాస కోస వ్యవస్థలో చేరిన పలు పదార్ధాలు, కణాలు, మైక్రోబాక్టీరియాలు, దురద కలిగించే వస్తువులు, ద్రవాలు మరియు మ్యూకస్ వంటి వాటిని బయటకు పంపించడానికి శరీరం తనంతతానుగా లేదా బలవంతంగా చేసే ప్రక్రియ.  దగ్గు అనేది కావాలని ప్రయత్నించేదైనా కావచ్చు లేకా కండరాలు తమంత తాము స్పందించి చేయవచ్చు.  చలికాలంలో ఏర్పడే చల్లటి గాలులు, పొడి వాతావరణం లేదా దుమ్ము కారణంగా దగ్గు ఏర్పడుతూ ఉంటుంది.  దీంతో పాటూ శీతల పానీయాలు కూడా గొంతులో ఇన్ఫెక్షన్ కారణమవ్వచ్చు.  ఒక వేళ దగ్గు నాలుగు వారాలకన్నా ఎక్కువ కాలం ఉంటే దానిని తీవ్రమైన దగ్గు అని, అంత కంటే ఎక్కువగా ఉంటే క్రానిక్ దగ్గు గా భావించి వైద్యులను సంప్రదించాలి.

  దురదలతో కూడిన చర్మం
  చల్లటి మరియు తేమ లేకుండా పొడి బారిన వాతావరణం కారణంగా చలి కాలంలో సున్నితమైన చర్మం ఉన్న వారిలో దురదలు ఏర్పడవచ్చు.  దీని కారణంగా చికాకు కలుగుతూ గట్టిగా గోక్కోవాలనే ప్రయత్నం చేయడంతో చర్మం లేచిపోయే ప్రమాదం ఉంది.  దీనిని నివారించడానికి కొబ్బరి, ఆలివ్ లేదా ఆల్మండ్ ఆయిల్ లు వంటివి చర్మంపై రుద్దడంతో పాటూ చర్మం పొడిబారకుండా వైపరైజర్స్ లేదా హుమిడిఫైయర్స్ తో గాలిలో తేమ ఉండేలా చూసుకోవాలి.

  శ్వాస కోస సంబంధిత రుగ్మతలు
  చలికాలంలో గాలి మరింత పలుచనై దాని పరిణామం తగ్గిపోవడంతో ఆస్థమా లేదా దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి ఉన్న వారికి ఊపిరి తీసుకోవడంతో ఇబ్బందులు ఏర్పడుతాయి.  చల్లటి మరియు పొడి గాలి శ్వాసకోశ నాళాలను మరింత బిగుసుకుని పోయేలా చేయడంతో ఈ ఇబ్బంది మరింత పెరుగుతుంది.

  సైనసైటిస్
  సైనసైటిస్ అనేది ముక్కు లోని కణజాలం వాచిపోవడం వలన కాని దురద లేదా మంట ఏర్పడడం వలన కాని వస్తుంది. సైనస్ అనే ఈ కణజాలంలో గాలి నిండి ఉంటుంది.  ఈ గాలి బదులుగా ఏదైనా ద్రవ పదార్థం లేదా బాక్టీరియాలు పెరిగి ఇన్ఫెక్షన్ కు దారి తీయడం వలన సైనసైటిస్ ఏర్పడుతుంది.  ఈ సైనసైటిస్ సాధారణంగా సరైన గాలి వెలుతురు ప్రసరణ లేని ఇండ్లలో ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.

  వీటితో పాటూ చలి కాలంలో గుండె కు సంబంధించిన పలు రుగ్మతలు ఏర్పడే ప్రమాదం లేక పోలేదు.  చలి పెరిగే కొద్దీ గుండె నుండి రక్తాన్ని తీసుకొని వెళ్లే నాళాలు కుచించుకొని పోవడం వలన వీటిలో ఇబ్బందులు రావచ్చు.  వీటితో పాటూ చలి కాలంలో కీళ్ల నొప్పులు ఏర్పడడం కూడా చూడవచ్చు.  ఇక చలి గాలుల కారణంగా తలనొప్పి రావడం గమనిస్తూ ఉంటాం.

  ఇక చలి కాలంలో చిన్నారులలో సాధారణంగా ఏర్పడే ఆరోగ్య సమస్యలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు...  ఆస్థమా
  మారుతున్న వాతావరణం మరియు చలి గాలి చిన్నారులలో ఎక్కువగా ఆస్థమా రావడానికి కారణమవుతుంది.  ఆస్థమాతో భాదపడుతున్న చిన్నారులు ఈ సమయంలో ఖచ్చితంగా సంబంధిత మందులు ముఖ్యంగా ఇన్హేలర్స్ దగ్గర ఉంచుకోవాలి.  దగ్గు, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, ఆయాసం వంటివి గమనిస్తే వెంటనే మందులు తీసుకోవడం ప్రారంభించాలి.  అంతే గాకుండా చలి కాలం వచ్చే ముందే ఇలాంటి ప్రమాదమున్న చిన్నారులకు ఆస్థమా నివారణ మందులు ఇవ్వడం మంచిది.

  దీర్ఘకాలపు దగ్గు
  చలికాలమంటేనే ఫ్లూ సీజన్.  ఈ సమయంలో చిన్నారులలో దగ్గు ఏర్పడడం సాధారణం.  అయితే నాలుగు వారాల కన్నా ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స ప్రారంభించాలి.

  పొడి చర్మం
  వాతావరణంలో తేమ లేకపోవడం అనేది చల్లటి మరియు పొడి గాలి బయట వాతావరణంలో మరియు ఇళ్లలలో హీటర్స్ వినియోగించడం వలన గాలి వేడెక్కడం వలన చిన్నారుల చర్మం పొడి బారి పోయి దురదలకు దారి తీస్తుంది.  దీంతో పాటూ ప్రస్థుత కరోనా కాలంలో చేతులను సోపుతో ఎక్కువగా కడుక్కోవడం వలన చేతుల మీద, పెదవుల చుట్టూ పొక్కులు ఏర్పడవచ్చు. ఇవి నివారించడానికి చిన్నారులకు వినియోగించే సోపుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.  అలానే వారికి రోజులో ఎక్కువ సార్లు మాయిశ్చరైజర్ రాయడం ద్వారా చర్మం పొడిబారకుండా చూసుకోవాలి.

  తామర
  చర్మం పొడి బారడం వలన ఏర్పడే మరో చర్మ సమస్య తామర.  దీని కారణంగా చిన్నారుల చర్మంపై ఎర్రటి మరియు దురద కలిగించే ప్రదేశాలను గమనించవచ్చు.  ఇవి చలి కాలంలో మరింత తవ్రమవుతాయి.  ఇవి ఏర్పడితే వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడమే కాకుండా వారి చర్మం మరింత పొడి బారకుండా తేమ కలిగిన బట్టలతో శరీరాన్ని కప్పి ఉంచాలి.

  ముక్కులో రక్త స్రావం
  చల్లటి గాలి కారణంగా చిన్నారుల ముక్కులో రక్త స్రావం జరుగుతుంది.  వీటిని అరికట్టడానికి ముక్కుపై మాయిశ్చరైజర్స్ రాసుకోవడం చేయాలి.  అంతే గాకుండా జలుబు, సైనసైటిస్ లేదా అలర్జీల కారణంగా కూడా ముక్కు నుండి రక్త స్రావం జరుగవచ్చు.

  ఇలాంటి సమస్యలు రాకుండా నివారణ చర్యలు


  చిన్నారులలో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా క్రింద పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాటిని నివారించవచ్చు....

  • ప్రతి సంవత్సరం ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వడం

  • అపుడే పుట్టిన బిడ్డలను లేదా చిన్న వారిని ఎక్కువ మంది జనం తిరిగే ప్రదేశాలకు తీసుకొని వెళ్లకుండా ఉండడం

  • జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న పిల్లలకు దూరంగా ఎలా మెలగాలో నేర్పించడం

  • చేతులను శుభ్రం చేసుకొనే ప్రక్రియను నేర్పించడం

  • దగ్గేటపుడు గుడ్డ అడ్డం పెట్టుకొని దగ్గడం నేర్పించడం

  • ఆడుకొనేటపుడు లేదా పాఠశాలలో నీళ్లలలో దిగడం లేదా ఆడడం మానిపించడం• శుభ్రమైన నీటిని సేవించడం

  పైన పేర్కొన్న కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చిన్నారులలో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు తద్వారా చల్లటి వాతావరణం కారణంగా జబ్బులు తీవ్రం కాకుండా నివారించవచ్చు.

  వ్యాసకర్త - టి. నరేందర్ (Consultant General Pediatrician & Neonatologist, Aster Prime Hospital, Ameerpet, Hyderabad)
  Published by:Srinivas Munigala
  First published:

  అగ్ర కథనాలు