Sexual Wellness: నా భార్య సెక్స్ వద్దంటోంది.. కానీ అలా ఉండమంటోంది.. నేనేం చేయాలి?

ప్రతీకాత్మక చిత్రం

నేను నా భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. 26 ఏళ్ల వయసులో మాకు వివాహం జరిగింది. ప్రస్తుతం సంపాదనపై దృష్టి పెట్టాం. అయితే ఇటీవల కాలంలో నా భార్య సెక్స్(Sex) పట్ల అస్సలు ఆసక్తి చూపించడం లేదు. ఇప్పుడు ఎలా?

  • Share this:
ప్రశ్న: హాయ్ నా పేరు రవి(పేరు మార్చాం). నేను నా భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. 26 ఏళ్ల వయసులో మాకు వివాహం జరిగింది. ప్రస్తుతం సంపాదనపై దృష్టిపెట్టాం. అయితే ఇటీవల కాలంలో నా భార్య సెక్స్(Sex) పట్ల అస్సలు ఆసక్తి చూపించడం లేదు. అంతే కాకుండా ఎక్కువగా అబ్బాయిల గురించి మాట్లాడుతుంది. తన జిమ్ లో ఎంతో మంది మగవారు కండలతో చూపులకు ఆకర్షణీయంగా ఉన్నారని నాతో వ్యంగ్యంగా మాట్లాడుతుంది. తనతో నేను బాయ్ ఫ్రెండ్(Boy Friend) లాగా ప్రవర్తించాలని, లేకపోతే తను వేరొకరిని చూసుకుంటానని చెబుతోంది. ప్రస్తుతం మా ఇద్దరి మధ్య మాటలు కూడా పెద్దగా లేవు. నేను నా స్టార్టప్(Start Up) తో బిజీగా ఉన్నా. ఆమె కూడా పనిచేస్తోంది. ఆమెపై నాకు నమ్మకం ఉన్నప్పటికీ సెక్స్ పట్ల ఆసక్తి చూపించకుండా అబ్బాయిల గురించి మాట్లాడటం అయోమయంగా అనిపిస్తుంది. నేను పెద్ద అందగాడిని కాదు. డబ్బు, శృంగారం విషయంలో ఆమె అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నా వెనక ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు.

సమాధానం: మొదటగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఇటీవల కాలంలో మీ భార్యతో పెద్దగా మాటల్లేవని మీరంటున్నారు. ఈ ప్రశ్నలోనే సమాధానముంది. ఆరోగ్యకరమైన సంభాషణలు సంబంధంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. మీ భార్య మిమ్మల్ని నిందించడం, ఆటపట్టించడం స్పష్టంగా ప్రభావితం చేస్తుందని తెలుస్తుంది. ఇది మీకు అసురక్షితంగా అనిపిస్తుంది. ఇది మీ ఆర్థిక, సెక్సువల్ సామర్థ్యం పట్ల అభద్రతకు లోనవుతున్నట్లు అర్థమవుతుంది. ఈ అంశాలను మీరు పరిష్కరించుకోవాలి. ఇందుకు మీరు డాక్టర్ లేదా మానసిక నిపుణులతో మాట్లాడాలని నేను సిఫార్సు చేస్తున్నా. ఎందుకంటే మీ ఆత్మగౌరవ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇది నిజంగా మీకు సహాయపడుతుంది. ఇదే సమయంలో ఇది మీకు ఇబ్బంది కలిగిస్తుందని వీలైనంత వరకు మీరు భార్యకు తెలియజేయాలి.

ఆమె జోకులు మీకు ఇబ్బంది కలగనంత వరకు ఫర్వాలేదు. కానీ మీకు హాని కలిగితే స్పష్టం చేయాలి. ఈ నిందలు చేయడానికి ఆమెను ప్రేరేపించేది అని ఏంటో తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశంగా ఉపయోగించుకోండి. మీరు బాయ్ ఫ్రెండ్ లాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు మీరు ప్రస్తావించారు. మీ వివాహానికి ముందు మీరు ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమ, సాన్నిహిత్యాన్ని ఆమె కోల్పోవచ్చు. జీవితంలో బిజీగా మారిన తర్వాత డబ్బుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు కొంత సమయం కేటాయించండి. విశ్రాంతి తీసుకోమని ఆమెను అడగండి. ఇద్దరు కలిసి సెలవు తీసుకుని టూర్ ప్లాన్ చేసుకోండి. మీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు సందర్శించిన ప్రదేశాలను మళ్లి దర్శించండి. పూర్తిగా విరామం తీసుకోవడం కుదరకపోయినట్లయితే పని-జీవితానికి సంబంధించి బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించండి. పనిభారాన్ని ఇంటి వరకు తీసుకురాకండి.

కలిసి భోజనం చేయడం, కలిసి వాకింగ్ వెళ్లేందుకు ప్రయత్నించండి. మీరు కొంత నాణ్యమైన సమయాన్ని గడపాలని నిర్ధారించుకోండి. ఇది ఎంత చిన్నదైనా వీలైనంత తరచూ మీరిద్దరూ కలిసి వీలైనంత తరచూ టీవీ, ఫోన్లతో కాకుండా తగిన సమయాన్ని కేటాయించండి. మీ భాగస్వామి మీ భావాలు, అభద్రతల గురించి స్పష్టంగా, నిజాయితీగా ఉండటానికి సిగ్గు పడనక్కర్లేదు. వాటిని రహస్యంగా ఉంచడం, అన్ని సమయాల్లో ఆందోళన చెందడం సంబంధాన్ని మరింత దిగజారుస్తుంది. ఇది అన్ని రకాల సందేహాలను, అభద్రతా భావాలను సృష్టిస్తుంది.

ఆమె మంచి సానుభూతి గల వ్యక్తి అయితే కచ్చితంగా మీ సమస్యలను అర్థం చేసుకుంటారు. సంబంధాన్ని నయం చేయడంలో మీతో కలిసి పనిచేస్తారు. ప్రతి సంబంధానికి వివాహం తర్వాత ప్రేమ అవసరం. ఇది ఇద్దరి సమన్వయంపై ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం ఇద్దరూ కమ్యూనికేషన్, నిబద్ధతకు కృషి అవసరం. కాబట్టి సమయాన్ని వెతకండి. దానిపై కలిసి పనిచేయండి.
Published by:Nikhil Kumar S
First published: