HOW TO GET RID OF ALLERGY DUE TO ARTIFICIAL JEWELRY PVN
Allergy from artificial jewelry : ఆ నగలు పెట్టుకుంటే స్కిన్ అలర్జీ వస్తోందా?ఇలా చేస్తే ఏ ఇబ్బంది ఉండదు
(ప్రతీకాత్మక చిత్రం)
Allergy from artificial jewelry: అయితే ఆడపిల్లలుగా పుట్టిన ప్రతి ఒక్కరికి నగలపై(Jewelry) లేదా బంగారం అంటే ఇష్టం ఉంటుంది. దాదాపు ప్రతి అమ్మాయి బంగారం ధరించాలని కోరుకుంటుంది. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు వస్తే అండగా ఉంటుందనే ఆలోచనతో కూడా కొందరు బంగారు కొనుగోలు చేస్తారు.
Allergy from artificial jewelry: అయితే ఆడపిల్లలుగా పుట్టిన ప్రతి ఒక్కరికి నగలపై(Jewelry) లేదా బంగారం అంటే ఇష్టం ఉంటుంది. దాదాపు ప్రతి అమ్మాయి బంగారం ధరించాలని కోరుకుంటుంది. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు వస్తే అండగా ఉంటుందనే ఆలోచనతో కూడా కొందరు బంగారు కొనుగోలు చేస్తారు. అయితే పెరిగిన బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో బంగారం కొనలేక,ఏదైనా శుభకార్యాలకు వెళ్లేటప్పుడు బంగారం ధరించకుండా ఉండలేక చాలామంది ఇటీవల కాలంలో కృత్రిమ నగలు(Artificial Jewelry)ధరిస్తున్న విషయం తెలిసిందే. అయితే బంగారం బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఉండటం వల్ల,బంగారం సమయానికి అందుబాటులో లేకపోవడంతో చాలామంది,మరికొందరైతే బంగారం పాడైపోతది అన్న ఉద్దేశ్యంతో ఏదైనా శుభాకార్యాలకు,విందులు,పార్టీలకు వెళ్లినప్పుడు ఈ ఆర్టిఫిషియల్ జ్యూవెలరీని పెట్టుకుంటున్నారు. అయితే ఆర్టిఫిషియల్ జ్యూవెలరీలో పెరుగుతున్న వైవిధ్యం,ఆప్షన్స్ కారణంగా చాలామందిస్త్రీలు ఈ కృత్రిమ ఆభరణాలను ధరించడానికి ఇష్టపడుతున్నారు. అయితే కృత్రిమ నగలు కూడా అనేక రకాల లోహాలతో తయారు చేస్తారు. దీని వల్ల చాలా మందికి స్కిన్ అలర్జీ సమస్య వస్తోంది.
ఒక్కొక్కరి చర్మం ఒక్కొక్క తీరుగా ఉంటుంది. ప్రతి ఒక్కరి చర్మం వివిధ లోహాలకు భిన్నంగా స్పందిస్తుంది. మెడలో లేదా చెవికి వివిధ రకాల నగలు ధరించడం వల్ల చాలా సార్లు సమస్యలు వస్తుంటాయి. ఈ కారణంగా చాలా మంది కృత్రిమ నగలు ధరించడం మానేస్తారు. కృత్రిమ ఆభరణాల వల్ల కలిగే సమస్యను చర్మశోథ అంటారు. కృత్రిమ ఆభరణాలు ధరించేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, తద్వారా మీరు చర్మ అలెర్జీలను ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం.
లోహాలలో అత్యంత ప్రమాదకరమైనది నికెల్. ఇది ప్రాథమికంగా చౌకైన ఆభరణాల బేస్ మెటల్. కొందరికి ఈ లోహంతో చేసిన నగలు ధరించడం వల్ల చేతుల్లో లేదా మెడలో దద్దుర్లు సమస్య మొదలవుతుంది. ఈ రకమైన సమస్య చాలా కాలం పాటు కొనసాగితే, అప్పుడు చర్మంపై నికెల్ అలెర్జీ వస్తుంది.
కృత్రిమ నగలతో సమస్య ఉంటే వాటిని ధరించడం మానుకోండి.
కృత్రిమ ఆభరణాలు పొరపాటున కూడా నీటిలో నానబెట్టడానికి ప్రయత్నించొద్దుjewe
అలెర్జీలు ఉన్నప్పటికీ నగలు ధరించినట్లయితే బారియర్ క్రీమ్, స్టెరాయిడ్ క్రీమ్ లేదా టాల్కమ్ పౌడర్ ఉపయోగించండి.
బరువైన చాలా గట్టి నగలు ధరించవద్దు. సౌకర్యవంతంగా ఉంటే నగలు ధరించాలి.
నగల ఉపరితలంపై నెయిల్ పెయింట్‌ను వేయండి. తద్వారా ఆభరణం, చర్మం మధ్య పొర ఉంటుంది.
ఆభరణాలను ప్యాక్ చేసేటప్పుడు అది పూర్తిగా పొడిగా ఉంటే తేమ ఉందని గుర్తుంచుకోండి. వాటిని ధరించినప్పుడు దురద ఉంటుంది.
ఆభరణాలపై పల్లాడియం లోహాన్ని పూయడం ద్వారా కూడా చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది.
కృత్రిమ ఆభరణాలు ధరించడం వల్ల మీకు ఏదైనా అలెర్జీ ఉంటే మీరు వాటిని ధరించకుండా ఉండాలి. బదులుగా మీ స్కిన్ కి సరిపోయే ఆభరణాలను ధరించండి.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.