Makeup hacks: రెడీ అవ్వడానికి టైం లేదా? ఈ 5 బ్యూటీ హ్యాక్స్‌తో..!

ప్రతీకాత్మక చిత్రం

Makeup hacks: మీరు పడుకునే ముందు చర్మ సంరక్షణకు రాత్రి దినచర్యగా పెట్టుకోండి. పడుకునే ముందు ముఖాన్ని ఫేస్‌ వాష్‌తో కడుక్కోండి. ఆ తర్వాత రోజ్‌ వాటర్‌ లేదా నైట్‌ క్రీం అప్లై చేసుకుని పడుకోవాలి.

  • Share this:
నేటి బిజీ లైఫ్‌లో మహిళలకు సమయం తక్కువ ఉంటుంది. ఆఫీసు, ఇల్లు ఇలా అనేక పనులు ఉంటాయి. ఈ బిజీ లైఫ్‌ (busy life)లో తమకు టైం కేటాయించుకోలేరు. అలాగే మేకప్‌కు సంబంధించిన అన్ని ఉపకరణాలు అందుబాటులో ఉన్నప్పటికీ వారు మేకప్‌ చేసుకోలేరు.

కానీ, లైఫ్‌స్టైల్‌ (life style)ను ఓ క్రమపద్ధతిలో నిర్వహించి..ఓ రెండు నిమిషాలు కేటాయిస్తే చాలు. ఎంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోగలరు. ఇప్పుడు మీరు 5 నిమిషాల్లో ఎలా సిద్ధం కావాలో తెలుసుకుందాం.

మీరు పడుకునే ముందు చర్మ సంరక్షణకు రాత్రి దినచర్యగా పెట్టుకోండి. పడుకునే ముందు ముఖాన్ని ఫేస్‌ వాష్‌తో కడుక్కోండి. ఆ తర్వాత రోజ్‌ వాటర్‌ లేదా నైట్‌ క్రీం అప్లై చేసుకుని పడుకోవాలి. ఉదయం మీ ముఖం చాలా తాజాగా కనిపిస్తుంది. ఆ తర్వాత మీరు మస్కారా, లిప్‌ గ్లాస్‌ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు.

ఇది కూడా చదవండి:  ఈ చిట్కాతో 50 శాతం గ్యాస్‌ ఆదా అవుతుంది!

బీబీ లేదా సీసీ క్రీం..
ఫౌండేషన్, కన్సీలర్‌తో (concealer) మేకప్‌ సెటిల్‌ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అప్పుడు ఉదయం మాయిశ్చరైజర్‌తో బీబీ లేదా సీసీ క్రీం ఉపయోగించండి. ఇది మీ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. చర్మం శుభ్రంగా కనిపిస్తుంది.

లిప్‌గ్లాస్‌..
మీకు సమయం లేకపోతే, మీరు తప్పనిసరిగా మీ పర్సులో లిప్‌ గ్లాస్‌ను ఉంచుకోవాలి. సమయవ వచ్చిన వెంటనే పెదవులపై అప్లై చేసుకోవాలి. మీరు తేలికపాటిగా చేతితో కళ్లపై కూడా అప్లై చేసుకోచ్చు. ఇది మీ రూపాన్ని మెరుగ్గా చేస్తుంది.

ఇది కూడా చదవండి:  స్క్రీన్‌ వర్క్‌ ఎక్కువై.. మెడనొప్పి వస్తోందా? ఇలా ఈజీగా..!

మృదువైన పాదాలకు..
రాత్రి పడుకునే ముందు మీ ముఖం అలాగే మీ పాదాలకు క్రీం రాయండి. మీ పాదాలకు పగుళ్లు ఉంటే.. వాటిపై క్రీమ్‌ రాయడం మర్చిపోవద్దు.

మీ జుట్టును షాంపూ చేయడానికి సమయం లేకపోతే.. జుట్టు మూలలకు టాల్కం పౌడర్‌ను స్ప్రే చేసి బ్రష్‌ చేయండి. మీ జుట్టు మెత్తగా కనిపిస్తుంది. అయితే, ఇలా చేసినపుడు రాత్రిపడుకునే ముందు జుట్టు కడుక్కుని నిద్రపోవడం మంచిది.
Published by:Renuka Godugu
First published: