HOW TO FIND THE MILK PURITY THROUGH SOME HOME REMEDIES RNK
Milk adulteration: పాలస్వచ్ఛతను సులభంగా పసిగడితే.. ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు..
ప్రతీకాత్మక చిత్రం
Adulteration of milk: కల్తీ పాలు తాగితే ఆరోగ్యానికి హానికరం.. అనేకరకాలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కల్తీ పాలు తాగడం వలన క్షయ వ్యాధి వస్తుంది. అంతేకాదు నత్రజనితో యూరియా కలుషితం కావడం వల్ల మూత్రపిండాలు, గుండె, కాలేయం వంటి అవయవాలు వైఫల్యానికి దారితీస్తాయి. గుండెజబ్బులకు కారణమవుతాయి. అంతేకాదు పిల్లల ఎదుగుల కుంటుబడుతుంది.
కల్తీ ప్రపంచంలో తాగే పాల (Milk adulteration) నుంచి తినే బియ్యం వరకు ప్రతీది కల్తీనే. వీటిని తేలిగ్గా తీసుకోకండి. కొంతమంది మార్కెట్ మాయగాళ్లు మన ప్రాణాలతోనే చెలగాటం ఆడుతున్నారు. అస్సలు కల్తీ లేని ఆహారం ఏదో నిర్ధారించుకోవడానికి వినియోగదారులకు పెద్ద సవాలే. ఇటీవలె పాలు కల్తీ చేస్తున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే. మరి మీరు వాడే పాలు కూడా కల్తీ లేనివే అని ఎలా నిర్ధారించుకుంటారు. తెల్లనివన్ని పాలేనా? ప్రతిరోజూ టీ, కాఫీ లేనిదే మన రోజు మొదలవ్వదు. మరి ఈ పాలలో యూరియా ఇతర కల్తీ ఆహారాలను (Food adulteration) కలుపుతూ ప్రతిరోజూ స్లో పాయిజన్ లాగా మన శరీరంలోకి ప్రవేశిస్తోంది. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనికి కొన్ని హోం రెమిడీస్ ఉన్నాయి. వాటితో పాల స్వచ్ఛతను సులభం పసిగెట్టేయోచ్చు.
పిండి కలిపిన పాలను ఈజీగా గుర్తించడం ఎలా?
స్టార్చ్ లాడిన్ ద్రావణంలో మీరు వాడే ఒక చుక్క పాలు వేయండి.. అవి నీలం రంగులోకి మారితే.. పాలల్లో పిండి కలిపినట్లు నిర్ధారించుకోండి.
ఒక చుక్క పాలను తీసుకుని ఒక టెస్ట్ ట్యూబ్లో వేయండి.. కొంచెం పసుపుని కలిపి బాగా షేక్ చేయండి. కొద్ది సమయం తర్వాత పాలు ఎరుపు లిట్మస్ కాగితాన్ని జోడించండి. ఈ కాగితం నీలం రంగులోకి మారితే, పాలలో యూరియా కలిసిందని అర్ధం.
పరిణామాలు..
ఈ పాలు ప్రాణాంతకం. అరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎట్టిపరిస్థితుల్లో చిన్నపిల్లకు ఇలాంటి పాలివ్వడం మంచిది కాదు. అయితే ఈ సింథటిక్ పాలను ఎలా గుర్తించాలి అంటే.. సింథటిక్ పాలు చాలా చేదుగా ఉంటాయి. అంతేకాదు పాలను తీసుకుని చర్మంపై రుద్దితే.. సబ్బు రుద్దిన ఫీలింగ్ వస్తుంది. అంతేకాదు ఈ పాలు వేడి చేసిన తర్వాత పాలు పసుపు రంగులోకి మారుతాయి.
సబ్బు పొడితో పాలు: ప్రస్తుతం మార్కెట్లోకి ఎక్కువగా వస్తున్న కల్తీ పాలలో ఈ రకం ఎక్కవగా ఉన్నాయి. డిటర్జెంట్ 5 -10 మి.లీ పాలలో సమానమైన నీటిని బాగా కలపండి. ఈ మిశ్రమంలో ఎక్కువ నురుగు వస్తే.. ఆ పాలల్లో డిటర్జెంట్ కలిపినట్లు ఈజీగా గుర్తించవచ్చు..
ఇక కల్తీ పాలను గుర్తించడానికి ప్రస్తుతం షాప్స్ లో యూరియా స్ట్రిప్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో పాల స్వచ్ఛతను గుర్తించవచ్చు.
కల్తీ పాలు తాగితే ఆరోగ్యానికి హానికరం.. అనేకరకాలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కల్తీ పాలు తాగడం వలన క్షయ వ్యాధి వస్తుంది. అంతేకాదు నత్రజనితో యూరియా కలుషితం కావడం వల్ల మూత్రపిండాలు, గుండె, కాలేయం వంటి అవయవాలు వైఫల్యానికి దారితీస్తాయి. గుండెజబ్బులకు కారణమవుతాయి. అంతేకాదు పిల్లల ఎదుగుల కుంటుబడుతుంది.
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.