ఆహారాన్ని ఎలా తింటే..బరువు తగ్గుతారో.. తెలుసా..!

ఆహారాన్ని నమిలి తినండి..లేదో లావైపోతారు..అని అంటున్నారు.. డాక్టర్స్. ఎందుకంటే ఈరోజుల్లో.. భౌతికంగా కష్టపడే ఉద్యోగాలు, పనులు తగ్గిపోయి మానసికంగా శ్రమించే ఉద్యోగాలు పెరిగిపోతున్నాయి. ఆహారాన్ని భారతీయులు వేగంగా తింటారని ఓ అధ్యయనంలో తేలింది

news18-telugu
Updated: February 10, 2019, 7:46 AM IST
ఆహారాన్ని ఎలా తింటే..బరువు తగ్గుతారో.. తెలుసా..!
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 10, 2019, 7:46 AM IST
ఆహారాన్ని నమిలి తినండి..లేదో లావైపోతారు..అని అంటున్నారు.. డాక్టర్స్. ఎందుకంటే ఈరోజుల్లో.. భౌతికంగా కష్టపడే ఉద్యోగాలు, పనులు తగ్గిపోయి మానసికంగా శ్రమించే ఉద్యోగాలు పెరిగిపోతున్నాయి. ఆహారాన్ని భారతీయులు వేగంగా తింటారని ఓ అధ్యయనంలో తేలింది. అయితే ఇది ఆరోగ్యానికి ముప్పని నిపుణులు చెబుతున్నారు. నమిలి తినే తీరిక లేక మింగేస్తుండటంతో జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువవుతున్నాయి.

diet-food
ప్రతీకాత్మక చిత్రం


ఆహారం అరుగుదల నోటిలోనే జీర్ణంకావడం ప్రారంభమవుతుంది. నోటిలోని అమైలేజ్‌, లైపేజ్‌ ఎంజైమ్‌లు ఈపని చేస్తాయి. ఆహారాన్ని వేగంగా తింటే జీర్ణానికి తోడ్పడే ఎంజైముల, ఆమ్లాల విడుదల మందగిస్తుంది. దీని వల్ల అసిడిసీ, అజీర్తి వంటివి సంభవించే అవకాశం ఎక్కువ. అంతేకాకుండా వేగంగా తినడం వల్ల ఎక్కువ తినేసే అవకాశం ఉంటుంది. దీని వల్ల శరీరానికి ఎంత అవసరమో అంతమాత్రమే ఉపయోగించుకుని మిగిలింది కొవ్వు రూపంలో పేరుకు పోతుంది. ఫలితంగా గుండె జబ్బులు, ఊబకాయం వంటి జబ్బులు బారిన పడే అవకాశం ఉంది.

Drop these 6 Foods to Claim Your Heart Health
(Photo courtesy: AFP Relaxnews/ Tharakorn/ Istock.com)
ఆహారం తీసుకొనేటప్పుడు పక్కన సెల్‌ఫోన్లు, టెలివిజన్, మాట్లాడటం వంటి పద్ధతులను పక్కన పెట్టాలి. ఏం తింటున్నాం? ఎంత తీసుకుంటున్నాం? అనే ఆలోచన ఉండాలి. అప్పడే బరువుని నియంత్రణలో ఉంచుకోవచ్చు.
First published: February 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...