ఆంజనేయస్వామికి సాష్టాంగ నమస్కారం చేయకూడదా..

దేవుళ్లందరికీ మనం సాష్టాంగ నమస్కారం పెడతాం.. ఆంజనేయ స్వామికి మొక్కే విషయంలోనే ఎన్నో సందేహాలుంటాయి. త్రిమూర్తి స్వరూపుడు, రుద్రాంశసంభూతుడైన ఈయనకు ఎలా పూజ చేయాలి, ఎలా నమస్కరించాలి.. అసలు సాష్టాంగ నమస్కారం చేయొచ్చా లేదా అని సంశయిస్తుంటారు. అలాంటివారికి వేదపండితులు చెప్పే విషయమేంటంటే..

Amala Ravula | news18-telugu
Updated: April 9, 2019, 7:39 AM IST
ఆంజనేయస్వామికి సాష్టాంగ నమస్కారం చేయకూడదా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంజనేయుడికి ఎవరైనా సాష్టాంగ నమస్కరం చేయొచ్చు.. ఆంజనేయుడంటేనే సేవకు ప్రతీక. కొందరు హనుమపాదాల కింద శనైశ్చరుడు ఉంటాడు కాబట్టి సాష్టాంగం చేయకూడదని అంటారు. కానీ, అది ఎంతమాత్రం నిజం కాదని అంటారు. నిరంతరం రామచంద్రుని పాదసన్నిధిని కోరుకునే హనుమంతుడిని ఎలా అయినా పూజించొచ్చు. ఇందులో ఎలాంటి దోషం లేదని పండితులు చెబుతున్నారు. అదేవిదంగా ఆంజనేయుడి విషయంలో పురుషులు ఈ విధంగా సాష్టాంగ నమస్కారం చేయకూడదన్న అపోహ కూడా సరికాదని, ఈ నియమం ఎక్కడలేదని చెబుతున్నారు.
అయినా దేవుళ్లను పూజించే విషయంలో ఎన్నో సందేహాలు, సంశయాలతో ప్రజలు నిండిఉంటారు. కానీ త్రికరణ శుద్ధిగా మనసంతా దైవంపైనే నిలిపి పూజ చేసి ప్రార్థిస్తే ఎలాంటి దోషాలు ఉండవని, అలాగని మరి నియమాలను వదిలేయొద్దని చెబుతున్నారు.

First published: April 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...