Home /News /life-style /

HOW TO DEAL WITH BREAKUP ANXIETY HERE THE FULL DETAILS FOR YOU GH SRD

Breakup Anxiety: బ్రేకప్ చెప్పేందుకు సిద్ధమవుతున్నారా? అయితే ఇలా చేసి చూడండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Breakup Anxiety: ప్రేమలో విఫలమైతే ఎంత బాధ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లవ్ బ్రేకప్​ తర్వాత ఆ వేదన వర్ణణాతీతంగా ఉంటుంది.

జీవితంలో అత్యంత ఆనందకరమైన సంఘటన మనల్ని ప్రేమించే వ్యక్తులతో వారిని మనం ఎంత ప్రేమిస్తున్నామో చెప్పడం.. మనల్ని ఎంతగానో ప్రేమించే వ్యక్తులతో వారిని ప్రేమిస్తున్నామని చెప్పడం ఎంత ఆనందంగా అనిపిస్తుందో.. ఒక బంధంలో ఉన్నప్పుడు అవతలివారు మనకు తగినవారు కాదని.. వారి వల్ల మనం బాధపడుతున్నామని తెలుసుకొని బ్రేకప్ చెప్పే సమయంలో అంతగానే బాధగా అనిపిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం ఎదుటివారు మనల్ని మోసం చేస్తే ఎంత బాధగా అనిపిస్తుందో.. వారికి మనం బ్రేకప్ చెప్పే సమయంలోనూ అంతే బాధగా అనిపిస్తుందట. చాలామంది ఇలాంటి సందర్భంలో వారిని బాధపెట్టడం ఇష్టం లేక వారంటే ఇష్టం లేకపోయినా వారితో కలిసి ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఇది మీ జీవితాన్ని నెగెటివిటీతో నింపేస్తుంది. మిమ్మల్ని యాంగ్జైటీలోకి దింపేసి, డిప్రెషన్ బారిన పడేలా చేస్తుంది. దీన్ని ఎదుర్కొని మీ భాగస్వామికి బ్రేకప్ చెప్పాలనుకుంటే ముందు మీ గురించి ఆలోచించి కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది..

కారణమేంటో తెలుసా?

చాలామంది బ్రేకప్ గురించి అవతలి వారితో మాట్లాడేందుకు చాలా కంగారు పడిపోతుంటారు. తమ మానసిక ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటుంటారు. అంతే కాదు.. అవతలి వారు కాస్త గద్దించడమో లేక బతిమాలడమో చేస్తే తమ నిర్ణయాన్ని మార్చుకోవడం గురించి కూడా ఆలోచిస్తారు. కానీ ఇలా బ్రేకప్ చెప్పి తిరిగి కలిసి ఉండడం వల్ల మీ ప్రశాంతత దెబ్బతింటుంది. అందుకే బ్రేకప్ చెప్పే ముందే ఇది తప్పనిసరా? అని ఆలోచించుకోండి. మీరు ఆ వ్యక్తిని వదిలి ఉండాలనుకోవడానికి కారణాలను రాసుకోండి. దీనివల్ల మీరు తీసుకునే నిర్ణయంపై బలంగా నిలబడే అవకాశం ఉంటుంది. బ్రేకప్ చెప్పిన తర్వాత కూడా తిరిగి వారి దగ్గరికే వెళ్లిపోవాలనిపించినప్పుడు కూడా ఈ లిస్టు చూసి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునే వీలుంటుంది.

సాయం తీసుకోండి...

చాలామంది భార్యభర్తలు లేదా ప్రేమికులు తమ మధ్య సమస్యలుంటే తామిద్దరం మాత్రమే వాటిని పరిష్కరించుకోవాలని భావిస్తారు. కానీ ఈ విషయాన్ని ముందుగా మీతో చాలా దగ్గరగా ఉండేవాళ్లతో పంచుకోవడం వల్ల అందులోని మంచి చెడులను వారు మీకు చెప్పే అవకాశాలు ఉంటాయి. దీని బట్టి మీకు మంచిదేదో, చెడేదో వారితో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు. మీ నిర్ణయాన్ని బలంగా తీసుకునేందుకు ఇది తోడ్పడుతుంది. అయితే ఒక్కోసారి వారు కూడా మీకు సహకరించకపోవచ్చు. ఇలాంటప్పుడు ఒంటరిగా ఉన్నానని బాధపడకుండా ముందుకెళ్లండి. మీరు బ్రేకప్ కి చెబుతున్న కారణాలు, దాని వెనుక సంఘటనల గురించి పూర్తిగా ప్రిపేర్ అయి ఉండండి. బ్రేకప్ చెప్పగానే అవతలి వారు సరేనని వెళ్లిపోవడం ఎక్కడా జరగదు. వారు బాధ పడతారు, గొడవ పడతారు, మిమ్మల్ని ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. వాటన్నింటికీ మీరు సమాధానం కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇందులో ఫీలింగ్స్ కి తావు ఇవ్వకుండా నిజాలను ముందుంచే ప్రయత్నం చేయండి. అంతేకాదు.. మీరు ఉపయోగించే మాటలు కూడా ఎదుటివారిని నొప్పించకుండా ఉండేలా ప్రయత్నించండి.

ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు..

మీ బంధం అస్సలు సాఫీగా సాగట్లేదు. బ్రేకప్ ఒక్కటే దానికి పరిష్కారం అని మీరు భావిస్తే అది మీరు మీకు, మీ భాగస్వామికి ఇద్దరి జీవితాలకు సంబంధించి తీసుకుంటున్న అద్భుతమైన నిర్ణయం. అందుకే ముందే బాగా ఆలోచించుకోండి. కావాలంటే దానికి కొన్ని నెలల సమయం తీసుకోండి. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మార్చుకోవద్దు. మానసికంగా ఈ సమయంలో చాలా బలహీనంగా మారిపోతారు. కానీ మనసు చెప్పేది కాకుండా మెదడుతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇలాంటప్పుడు చాలా ఒత్తిడి ఉంటుంది. అందుకే యోగా, మెడిటేషన్ చేయడం.. బాధ, కోపం వంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడల్లా గట్టిగా గాలి పీల్చుకొని వదిలేయడం చేస్తుంటే ఒత్తిడి, యాంగ్జైటీ తగ్గుతాయి. లేదంటే ఇవి డిప్రెషన్ గా కూడా మారే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి ఒత్తిడితో నిండిన సమయాల్లో మిమ్మల్ని మీరే జాగ్రత్తగా కాపాడుకునేందుకు ప్రయత్నించాలి.
Published by:Sridhar Reddy
First published:

Tags: Life Style, Love

తదుపరి వార్తలు