Health : ఎంతకీ దగ్గు తగ్గట్లేదా... ఈ మూలికల్ని ఇలా వాడండి...

దగ్గు అనేది బాగా ఇర్రిటేషన్ తెప్పించే రకం. దగ్గు వస్తే దగ్గకుండా ఉండలేం. మూలికల ద్వారా దాన్ని త్వరగా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.

news18-telugu
Updated: September 17, 2020, 6:07 AM IST
Health : ఎంతకీ దగ్గు తగ్గట్లేదా... ఈ మూలికల్ని ఇలా వాడండి...
ఎంతకీ దగ్గు తగ్గట్లేదా... ఈ మూలికల్ని ఇలా వాడండి...
  • Share this:
వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల దగ్గు అనేది వస్తూ ఉంటుంది. జనరల్‌గా దగ్గును మనం పెద్దగా పట్టించుకోం. ఎందుకంటే... మహా అయితే... ఒకట్రెండు రోజుల్లో అదే తగ్గిపోతుంది. కానీ... కొంతమందికి అది వెంటనే తగ్గదు. చాలా ఇబ్బంది పెడుతుంది. పొట్టలో నొప్పి వచ్చేలా చేస్తుంది. అలాంటప్పుడు వారు పడే బాధను మనం చూడలేం. అలా దగ్గు వస్తుంటే ఏ పనీ చెయ్యలేరు. ఎంతో అసౌకర్యంగా ఫీలవుతారు. సరిపడా నిద్ర, విశ్రాంతి తీసుకుంటేనే అది తగ్గుతుంది. కానీ పనుల వల్ల రెస్టు తీసుకునే ఛాన్స్ ఉండకపోవచ్చు. అందువల్ల అది పొడి దగ్గు అయినా... కఫంతో కూడిన తడి దగ్గు అయినా... దాని అంతుచూసే మూలిగా మర్మం ఇప్పుడు తెలుసుకుందాం.

మందుల షాపుల్లో దగ్గుకు చాలా టానిక్‌లు, మందులూ ఉన్నాయి. వాటి రేటు కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. కానీ వాటిని వాడకపోవడమే మేలు. అవి మన బాడీలో సహజంగా ఉండే వ్యాధినిరోధక శక్తిని తగ్గించేస్తాయి. కాబట్టి... ఏ అనారోగ్యం వచ్చినా... మన భారతీయ మూలికల్ని వాడేసి తగ్గించేసుకోవాలి. మన పెద్దవాళ్లంతా చేసింది అదే కదా. అలాంటి ఓ చిట్కాలను చిటుక్కున తెలుసుకుందాం. వాటిలో ఏది ఫాలో అయినా ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు.

ఇలా చెయ్యండి :

- మూడు మిరియాల్ని పొడిలా చెయ్యండి. చిటికెడు జీలకర్ర, చిటికెడు ఉప్పులో దాన్ని కలపండి. దాన్ని చిన్న ముద్దలా చేసుకొని నోట్లో పెట్టుకోండి.... లేదా ఓ స్పూన్‌లో ఆ మిశ్రమాన్ని వేసి... నోట్లోకి వేసుకోండి. వెంటనే గోరు వెచ్చటి నీరు తాగండి. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం వేళ చెయ్యండి.

- నిద్రపోయేముందు... చిటికెడు పసుపును ఓ కప్పు గోరువెచ్చటి పాలలో వెయ్యండి. కలపండి. తాగండి. నిద్రపోండి.

- పెరట్లో తులసి మొక్క ఉంటుందిగా. దానికి సారీ చెప్పి... ఓ ఆరేడు ఆకులు తీసుకోండి. నమలండి (ఇలా రోజుకు 3 సార్లు చెయ్యండి)

- టీ స్పూన్ తేనెకు చిటికెడు పసుపు కలపండి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు తీసుకోండి.- మిరియాల పొడి, పటికబెల్లం పొడి సమాన సైజులో తీసుకోండి. కలపండి. కొద్దిగా నెయ్యి వెయ్యండి. చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి. ఒక్కోసారి ఒక్కో ముద్ద చొప్పున రోజుకు నాలుగుసార్లు... తీసుకోండి.

- తేనె, అల్లం రసం సమాన సైజులో తీసుకోండి. ప్రతిసారీ ఓ స్పూన్ చొప్పున రోజుకు నాలుగుసార్లు తీసుకోండి.

- ఓ టీస్పూన్ మిరియాల పొడి, నాలుగు టీస్పూన్ల బెల్లం కలిపి... చిన్న ముద్దలుగా చేయాలి. ఒక్కోసారి ఒక్కొక్కటి చొప్పున రోజుకు మూడు లేదా నాలుగుసార్లు తీసుకోండి.

పొడి దగ్గు బాగా ఉంటే :
- 8 టీస్పూన్ల కొబ్బరి పాలు, ఓ టేబుల్ స్పూన్ గసగసాలు, ఓ టేబుల్ స్పూన్ తేనె కలపండి. నిద్రపోయే ముందు తాగండి.
- గోరువెచ్చటి నీటిలో ఓ చిన్న నిమ్మకాయ రసం, ఓ టీ స్పూన్ తేనె కలిపి... రోజూ ఉదయం వేళ తాగండి.

కఫంతో దగ్గు ఉంటే :
- తేనె, ఉల్లిపాయ రసం సమానమైన పరిమాణంలో తీసుకొని కలపండి. ఒక్కోసారి ఒక్కో టీ స్పూన్ చొప్పున రోజుకు నాలుగుసార్లు తాగండి.
- ఓ లవంగాన్ని తీసుకొని... దానికి చిటికెడు ఉప్పు జతచేసి... నమలండి. ఇలా రోజుకు మూడుసార్లు చెయ్యండి.

ఇదంతా చదివాక... దీని బదులు టాబ్లెట్లు వేసుకోవడమే మేలని అనిపిస్తే... అది పొరపాటే. ఎందుకంటే టాబ్లెట్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేదా దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు వస్తాయి. పై సంప్రదాయ పద్ధతుల ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ రావని ఆరోగ్య నిపుణులు తెలిపారు.

గమనిక : రెండు వారాలకు పైగా దగ్గు వస్తూ ఉంటే మాత్రం... వెంటనే డాక్టర్‌ని కలవడం మేలు.
Published by: Krishna Kumar N
First published: September 17, 2020, 6:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading