• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • HOW TO CONVINCE YOUR HUSBAND ABOUT ORAL SEX HERE IS THE EXPERTS ANSWER MS GH

Sexual Wellness: అలా చేస్తేనే భార్యకు ఆనందం.. కానీ భర్త అస్సలు చేయడం లేదు.. అతడిని మార్చడమెలా..?

Sexual Wellness: అలా చేస్తేనే భార్యకు ఆనందం.. కానీ భర్త అస్సలు చేయడం లేదు.. అతడిని మార్చడమెలా..?

ప్రతీకాత్మక చిత్రం

Sexual Wellness: ఆయన మూడ్ సెట్ చేయడానికి గదిలో మంచి లైటింగ్, మంచి సువాసనలు ఉండేలా ప్రణాళిక వేసుకోండి. ఒకవేళ పరోక్షంగా అన్ని విషయాలు చెప్పినా మీ భర్తలో మార్పు లేనప్పుడు.. ఆయనతో నేరుగా చర్చించేందుకు సిద్ధపడాలి.

  • News18
  • Last Updated:
  • Share this:
‘నాకు పెళ్లి జరిగి మూడు సంవత్సరాలు అవుతోంది. సెక్స్ విషయంలో నా భర్త చాలా స్వార్థంగా ఉంటాడు. ఇన్నేళ్లలో నేను కేవలం ఒక్కసారి మాత్రమే ఓరల్ సెక్స్ పొందాను. అతడు మాత్రం ప్రతిరోజూ ఓరల్ సెక్స్‌ను ఎంజాయ్ చేస్తాడు. సెక్స్ చేసేటప్పుడు మంచంపై బద్ధకంగా పడుకొని ఉంటాడు. మిగతా పనంతా నేనే చేయాలంటాడు. ఇవి సరైనవి కావని ఆయనతో ఎలా చెప్పాలి..?’ ఇది చాలా మంది మహిళలను వేధిస్తున్న సమస్య. దీనికి ప్రముఖ సెక్సాలజిస్టులు ఇస్తున్న సమాధానమిదిగో..

చాలామంది ఆడవాళ్లు ఇలాంటి విషయాలను భర్త దృష్టికి తీసుకెళ్లడాన్ని అసౌర్యంగా భావిస్తారు. దాంపత్య బంధంలో భర్త నుంచి లైంగిక సంతృప్తిని కోరుకోవడం తప్పుకాదు. కానీ దీంతోపాటు ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్ ఉండాలి. అప్పుడే ఇలాంటి విషయాలను ఇబ్బందులు లేకుండా అతడితో చెప్పవచ్చు. సెక్స్ విషయంలో ప్రతి అంశాన్ని మీరు భర్తతో చర్చించాలి. ఇలాంటి విషయాలను సూటిగా చెప్పడం ఇబ్బందిగా అనిపించినా, వారు బాధపడతారని భావించినా.. పరోక్షంగా ఇవన్నీ తెలిసేలా చేయాలి. ఇందుకు అనేక మార్గాలున్నాయి. సెక్స్ విషయంలో సిగ్గుపడటం, కోరికలను బయటకు చెప్పకపోవడం వల్ల ఇద్దరికీ సంతృప్తి ఉండదు. సెక్స్‌లో ఒక్కరు అసంతృప్తిగా ఉన్నా సరే.. ఇద్దరూ ఆస్వాదించలేరు.

శృంగారంలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఎంజాయ్ చేస్తుంటే, అది అసలు సెక్స్ కిందకు రాదు. దాన్ని హస్తప్రయోగంగానే భావించాలి. మీరు ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే ఓరల్ సెక్స్ పొందారు. మీరు దీని గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి.. గతంలో ఓరల్ సెక్స్ అనుభవాలను మీ భర్తకు గుర్తు చేయండి. అప్పటి జ్ఞాపకాలను, ఆ అనుభవాన్ని పొగడండి. ఆ సమయంలో మీరు పొందిన అనుభూతి ఎంత అద్భుతంగా ఉందో చెప్పండి. ఇలా చేయడం వల్ల ఆయన మీ కోరికను పరిగణనలోకి తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ లేదా వీడియోలను కూడా మీరు చూపించవచ్చు.



పడకగదిలో మీవారు బద్దకాన్ని వీడేందుకు మీరు కొత్తగా తయారవ్వండి. ఉత్తేజాన్ని కలిగించే కొన్ని రకాల పర్ఫ్యూమ్స్, లింగీరీ వంటివి ప్రయత్నించవచ్చు. దీంతోపాటు ఆయన మూడ్ సెట్ చేయడానికి గదిలో మంచి లైటింగ్, మంచి సువాసనలు ఉండేలా ప్రణాళిక వేసుకోండి. ఒకవేళ పరోక్షంగా అన్ని విషయాలు చెప్పినా మీ భర్తలో మార్పు లేనప్పుడు.. ఆయనతో నేరుగా చర్చించేందుకు సిద్ధపడాలి.

కానీ ఈ విషయంలో మీరు మరీ కఠినంగా ఉండకూడదు. ఇలాంటి కొన్ని సున్నితమైన విషయాలే భవిష్యత్తులో మీ రిలేషన్‌షిప్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది. ఇతర సమయాల్లో వీటి గురించి భర్తతో చర్చించడానికి బదులుగా సెక్స్ చేసేటప్పుడే అన్నీ చెప్పడం మంచిది. సెక్స్ సమయంలో మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా చాలా విషయాలు కమ్యూనికేట్ చేయవచ్చు. మీ శరీర భాగాలను ఆయన తాకినప్పుడు పొందే అనుభూతిని వ్యక్తం చేయగలగాలి. మాటల ద్వారా కాకుండా ఎరాటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మీరు చెప్పాలనుకున్నవి చెప్పవచ్చు.
Published by:Srinivas Munigala
First published:

అగ్ర కథనాలు