Diabetes Control Measures: డయాబెటిస్‌తో బాధపడుతున్నారా ? ఈ ఐదు సూత్రాలు పాటించండి.. కచ్చితంగా ప్రయోజనం.. చాలా సులువు

ఫ్రతీకాత్మక చిత్రం

How to Control Diabetes: జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల వ్యాధికి దూరంగా ఉండవచ్చు. మధుమేహాన్ని నియంత్రించడానికి సులువైన మార్గాలు ఉన్నాయి.

  • Share this:
దేశ జనాభాలో మధుమేహంతో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఒకప్పుడు ఈ వ్యాధి కేవలం వంశపార పర్యంగానే వస్తుందని భావించేవారు. కానీ ఇప్పుడు మారిన జీవనశైలి వల్ల చిన్న వయసులోనే దీని మూలాలు బయటపడుతున్నాయి. చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉందని చాలామంది ప్రజలు నమ్ముతారు. కానీ ఇది నిజం కాదు. ఇది జీవనశైలి లోపాల వల్ల వచ్చే లైఫ్‌స్టైల్ డిసీజ్. ఇప్పుడిప్పుడే ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఒక్కసారి మధుమేహం వచ్చిన తరువాత దాన్ని దూరం చేసుకోవడం కుదరదు. కాబట్టి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల వ్యాధికి దూరంగా ఉండవచ్చు. మధుమేహాన్ని నియంత్రించడానికి సులువైన మార్గాలు ఉన్నాయి. అవేంటంటే...

డయాబెటిస్ డైట్
సమయానికి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. దీంతో మధుమేహం వంటి సమస్యలు రావు. డయాబెటిస్ ఉన్నవారు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా లభించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇలాంటివారు తక్షణ శక్తినిచ్చే బిస్కెట్లు, కుకీలు, శుద్ధి చేసిన ఆహారానికి దూరంగా ఉండాలి. ఆహారంలో తగిన స్థాయిలో మంచి కొవ్వులు ఉంటే గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. కొవ్వు ఎక్కువగా ఉంటే చక్కెరలు, కార్బొహైడ్రేట్లు నెమ్మదిగా జీర్ణం అవుతాయి. దీంతో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఆహారంలో నెయ్యి, నట్స్, సీడ్స్ వంటివి తీసుకోవాలి.

జీవనశైలి మార్పులు
తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహం వస్తుందనేది పెద్ద అపోహ. జీవనశైలి లోపాల కారణంగా ఈ వ్యాధి రావచ్చు. తీరిక లేకపోవడం, పని ఒత్తిడి, నిద్రలేమి, శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్ వంటివన్నీ దీనికి కారణం కావచ్చు. ముందునుంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం, అనుసరించడం వల్ల ఈ వ్యాధికి దూరంగా ఉండవచ్చు. సమయానికి తినడం, పోషకాహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లు, వ్యాయామం చేయడం వంటివన్నీ అలవాటు చేసుకుంటే మధుమేహం ధరిచేరదు.

ప్రోటీన్లు
ప్రోటీన్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. అందువల్ల ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు ఉండే గుడ్లు, కిచిడీ కడీ, రైస్ దాల్, రోటీ వంటివి ఆహారంలో తీసుకోవాలి. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందితే మధుమేహం ప్రభావం ఉండదు.

నిద్ర
నిద్ర శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని ఎన్నో పరిశోధనల్లో కనుగొన్నారు. నిద్రలేమి, నిద్ర గంటలు సరిగా లేకపోవడం వల్ల శరీర జీవ గడియారం లేదా బాడీ క్లాక్ దెబ్బతింటుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తి, ఇతర సహజ జీవ ప్రక్రియలపై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల రోజూ కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. శరీరానికి, మెదడుకు తగినంత విశ్రాంతి అందేటా చూసుకోవాలి. రోజూ ఒకే సమయంలో నిద్ర పోవడం, నిద్ర లేవడం వల్ల జీవ గడియారం పనితీరు మెరుగ్గా ఉంటుంది.

వ్యాయామం
క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి రోజుకు కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ సలహా ఇస్తోంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంపొందించడానికి కసరత్తులు చేయాలి. జీవనశైలిలో వ్యాయామాన్ని ఒక భాగం చేసుకుంటే గ్లూకోజ్, ఇన్సులిన్ హెచ్చుతగ్గులు ఉండవు. దీంతో మధుమేహానికి దూరంగా ఉండవచ్చు.
Published by:Kishore Akkaladevi
First published: