HOW TO BE A GOOD DAD WILL HE BE THE BEST DAD IF GIVE EVERYTHING TO KIDS THEY ASKED FOR RNK
Father's day 2022: మంచి నాన్న అంటే ఎలా ఉండాలి? పిల్లలు అడిగింది అన్నీ ఇస్తే బెస్ట్ డాడ్ అవుతాడా?
ప్రతీకాత్మక చిత్రం
Happy Father's day 2022: పిల్లలు కోరిన కోర్కెలు, వారు అడిగిన గిఫ్ట్ లు అన్నీ ఇస్తే బెస్ట్ డ్యాడ్ అవుతాడా? మరి పిల్లలకు మంచి తండ్రిగా ఎలా ఉండాలి? మీరు మంచి ,బాధ్యతాయుతమైన తండ్రిగా మారడంలో మీకు సహాయపడే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.
Father's day 2022: పిల్లల పెంపకంలో తండ్రి ప్రమేయం వారి మొత్తం అభివృద్ధిని (Growth) ప్రభావితం చేస్తుంది. నిజానికి, తమ పిల్లల రోజువారీ కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొనే తండ్రి (Father), పిల్లల జీవితాన్ని మరెవరూ చేయలేని విధంగా సానుకూల మార్పులను తీసుకురావడంలో సహాయపడతారు. అయితే, మంచి నాన్న అంటే ఎలా ఉంటాడు? పిల్లలు కోరిన కోర్కెలు, వారు అడిగిన గిఫ్ట్ లు అన్నీ ఇస్తే బెస్ట్ డ్యాడ్ అవుతాడా? మరి పిల్లలకు మంచి తండ్రిగా ఎలా ఉండాలి? మీరు మంచి ,బాధ్యతాయుతమైన తండ్రిగా మారడంలో మీకు సహాయపడే కొన్ని ముఖ్యమైన విషయాల తెలుసుకుందాం.
తల్లికి గౌరవం..
ఒక తండ్రి తన బిడ్డ కోసం చేయాల్సిన గొప్ప విషయం ఏంటంటే పిల్లల తల్లిని గౌరవించడం. ఈ గౌరవం పిల్లలకు సురక్షితం. భార్యాభర్తల మధ్య సంబంధాన్ని గౌరవప్రదంగా ఉంచడం మంచి తల్లిదండ్రులకు చాలా ముఖ్యం. ఈ గౌరవ వాతావరణం మీ బిడ్డకు సురక్షితమైన అనుభూతిని ఇస్తుంది.
సమయం..
తండ్రిగా తన పిల్లలకు సమయం ఇవ్వడం ఎంతో ముఖ్యం. మీరు మీ బిడ్డకు ఏం తెచ్చి అందించినా వారి కోసం సమయం కేటాయించకపోతే, వారు విడిచిపెట్టినట్లు భావిస్తారు. మీ పిల్లలకు సమయం ఇస్తున్నప్పుడు మీరు చాలా ఇతర కార్యకలాపాలను కోల్పోవచ్చు కానీ వారికి ఇచ్చిన సమయం వృథా కాదు. మీ ఈ త్యాగాలు మీరు గొప్ప తండ్రిగా మారడానికి సహాయపడతాయి. బాల్యం చాలా వేగంగా సాగిపోతుంది. ఇది మళ్లీ తిరిగిరాదు.
వినండి..
చాలా సందర్భాలలో తండ్రి తనతో మాట్లాడాలనుకుంటున్నాడని పిల్లలకు చెప్పినప్పుడు వారు భయపడవచ్చు, ఎందుకంటే ఎక్కువగా తండ్రులు పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు మాత్రమే మాట్లాడతారు. మీరు చిన్న వయస్సు నుండి మీ పిల్లలతో వివిధ విషయాల గురించి మాట్లాడటం ప్రారంభిస్తే, వారి మనస్సులో ఎటువంటి భయం లేకుండా వినడానికి అవకాశం లభిస్తుంది. ఇది వారితో మెరుగైన సంభాషణను కలిగి ఉండటంలో మీకు సహాయపడుతుంది.
ప్రేమతో కూడిన క్రమశిక్షణ..
ప్రతి తండ్రి తన కొడుకు లేదా కూతురికి క్రమశిక్షణ నేర్పడం చాలా ముఖ్యం. కానీ వాటికి సరైన మార్గాలు ఉన్నాయి. వారిని శిక్షించడం ద్వారా మాత్రమే కాదు. పర్యవసానాల గురించి వారికి అవగాహన కల్పించండి, మంచి ప్రవర్తనకు వారికి ఏదైనా బహుమతిని ఇవ్వండి. ఒక తండ్రికి ఇది వారి బిడ్డ పట్ల వారి ప్రేమను చూపించే మార్గం.
రోల్ మోడల్..
తండ్రులు తమ పిల్లలకు వారు గ్రహించినా లేదా గుర్తించకపోయినా వారికి రోల్ మోడల్‌లు. ఒక కుమార్తె కోసం తండ్రి లక్ష్యాలను నిర్దేశిస్తాడు. కుమారులకు తండ్రులు స్త్రీలు, పెద్దవారిని ఎలా గౌరవించాలో చెప్పడం నీతి, బాధ్యత, నిజాయితీకి నిదర్శనం.
గైడ్..
మీ బిడ్డకు ఎవరో ఒకరు మార్గదర్శకంగా ఉండాలని చాలా మంది అనుకుంటారు.తల్లిదండ్రులు తమ పిల్లలలో ప్రతిభను బయటకు తీసుకురావడంలో గొప్పవారు. తండ్రులు నేర్పిన పాఠాలనే పిల్లు ఎంపిక చేసుకుంటారు.
కుటుంబ సమేతంగా..
భోజనం చేయడం లేదా కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చోవడం వల్ల మంచి బంధాలు ఏర్పడతాయి. ఈ సమయంలో బిజీ షెడ్యూల్‌తో పాటు మీరు మీ పిల్లలతో మాట్లాడవచ్చు, సలహాలు ఇవ్వవచ్చు. వారికి కొత్తగా ఏదైనా నేర్పించవచ్చు. ఒక కుటుంబంగా మీరు ఎదగవచ్చు, ఒకరినొకరు బాగా తెలుసుకోవచ్చు. అందుకే కుటుంబసమేతంగా ఏ పనైనా చేయాలి.
చదవించండి..
చిన్న వయస్సు నుండే చదవడం ప్రారంభించడం చాలా ముఖ్యం. పిల్లలకు పుస్తకాలు ఇతరాలు చదివించడం నేర్పించడం తండ్రి బాధ్యత కూడా. ఇది మీ పిల్లల నైపుణ్యాలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. పిల్లలు చిన్నప్పటి నుంచి చదివితే, పెద్దయ్యాక తమను తాము చదవాలనే ఆసక్తిని చూపుతారు. ఇది జీవితకాలం కోసం ఒక మంచి అభిరుచి ఏర్పడటానికి కూడా సహాయపడుతుంది
అంతు లేని బాధ్యత..
మీ పిల్లలు పెద్దవారైన తర్వాత లేదా వారు ఇల్లు వదిలి వెళ్లినా లేదా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తండ్రి బాధ్యత ఎప్పటికీ ముగియదు. పిల్లలు ఇప్పటికీ కౌన్సెలింగ్ ,సలహాల కోసం తమ తండ్రుల కోసం చూస్తున్నారు. మీ బిడ్డ ఎంత ఎదిగినా తండ్రులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.