Food after Exercise: వ్యాయామం చేసిన తర్వాత ఎంత సమయం లోపు ఆహారం తీసుకోవాలి.. ఎలాంటి ఆహారం బెటర్​?

ప్రతీకాత్మక చిత్రం

వ్యాయామం వలన మన శరీరపు (body) వ్యాధి నిరోధక శక్తి (Immunity system)ఎక్కువవుతుంది. గుండెకు సంబంధించిన వ్యాధులు (diseases), స్థూలకాయం, మధుమేహం (diabetes) వంటి వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది. అయితే వ్యాయామం చేసిన తర్వాత (After exercise) తీసుకునే ఆహారం (food) విషయంలో జాగ్రత్తగా (careful) ఉండాలట. లేకపోతే సమస్యలు కొనితెచ్చుకునే ప్రమాదం ఉంటుంది.

  • Share this:
    వ్యాయామం (Exercise). శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు. మానసిక ఆరోగ్యానికీ ముఖ్యం. కండరాలను పటిష్టంగా చేయడానికి ఎక్సర్సైజులు చాలా ఉపకరిస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరచడానికి, క్రీడలలో మంచి ప్రావీణ్యత సాధించడానికి, అధిక బరువు (heavy weight) తగ్గించుకోవడానికి, మానసిక ఉల్లాసం కొరకు  వ్యాయామాలు చేస్తారు. క్రమం తప్పకుండా చేసే వ్యాయామం వలన మన శరీరపు (body) వ్యాధి నిరోధక శక్తి  (Immunity system)ఎక్కువవుతుంది. గుండెకు సంబంధించిన వ్యాధులు (diseases), స్థూలకాయం, మధుమేహం (diabetes) వంటి వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది. అయితే వ్యాయామం చేసిన తర్వాత (After exercise) తీసుకునే ఆహారం (food) విషయంలో జాగ్రత్తగా (careful) ఉండాలట. లేకపోతే సమస్యలు కొనితెచ్చుకునే ప్రమాదం ఉంటుంది. అయితే వ్యాయామం చేసిన తర్వాత ఎంత సమయంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఒకసారి చూద్దాం..

    పిండి పదార్థాలు..

    వర్కౌట్లు చేసే ముందు మాదిరిగానే..  వ్యాయామాలు (Exercise) చేసిన తరువాత కూడా తగినన్ని నీళ్లు తాగాలి. అలాగే పిండి పదార్థాలు, ప్రొటీన్‌ సరైన మోతాదుల్లో తీసుకోవాలి. ఇవి కండరాల్లో ప్రొటీన్‌ ఉత్పత్తిని పెంచుతాయి. ఫలితంగా వ్యాయామాలతో కష్టపడ్డ కండరాలు వేగంగా కోలుకుంటాయి. ఆ తర్వాత వర్కౌట్ చేసినప్పుడు కండరాల సామర్థ్యాన్ని మరింత పెరుగుతుంది. త్వరగా అలసిపోకుండా చూస్తాయి.

    45 నిమిషాల్లోపు...

    వర్కౌట్ తర్వాత అరటి పండ్లు (banana) తినటం చాలా మంచిది. ఇతరత్రా పండ్లేవైనా (fruits) తినొచ్చు. ఇవి కణ స్థాయిలో జరిగే వాపు ప్రక్రియ తగ్గటానికి తోడ్పడతాయి. కండరాల్లో గ్లైకోజెన్‌ నిల్వలు పడిపోకుండా చూస్తాయి. వీలైనంత వరకు వ్యాయామాలు చేసిన 45 నిమిషాల్లోపే తినటం (eat) మంచిది. ఒకవేళ ఈ సమయంలో తినలేకపోతే.. ఆ తర్వాత 2 గంటల తరువాతే భోజనం చేయటం మంచిది.

    రోగాలకు చెక్​..

    వ్యాయామం సంపూర్ణ ఆరోగ్యానికి చాలా అవసరం. దైనందిక వ్యాయామం వలన అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, నిద్రలేమి, మానసిక రోగాల వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నివారించవచ్చును.

    షుగర్ వ్యాధిగ్రస్తులకు ఏరోబిక్ (aerobics)  వర్కవుట్ చాలా బాగా పనిచేస్తుందని తేలింది. దీని వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి.. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ కారణంగా బరువు (weight) కూడా అదుపులో ఉంటుంది. కండరాల బలానికి తోడ్పడుతుంది. అలాగే.. శరీరరం వదులుగా మారే గుణం కూడా తగ్గి ఫిట్‌‌గా ఉంటారు. శరీర కండరాల బలానికి కూడా ఎరోబిక్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

    రెగ్యులర్‌గా ఏరోబిక్స్ చేయడం వల్ల నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయి. ఇలా చేయడం వల్ల తర్వాత రోజు నూతనోత్సాహంతో ఉంటారు. వీటిని చేయడం అధిక రక్తపోటు తగ్గుతుంది. ఈ సమస్య రాకుండా చేస్తుంది. మంచి శరీరాకృతి మ సొంతం అవుతుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published: