Home /News /life-style /

HOW ONE PHONE CALL BROKE THEIR RELATIONSHIP RNK

Relationship: ఒకే ఒక్క మిస్డ్‌ కాల్‌.. మా 5 ఏళ్ల బంధాన్ని బ్రేక్‌ చేసింది!

 ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Relationship: నిజంగా మన సొసైటీ అభివృద్ధి చెందిందా, సాంప్రదాయేతర సంబంధాలను నిర్వహించడానికి తగిన పరిణతి చెందిందో లేదో నాకు ఇప్పటికీ కచ్ఛితంగా తేలీదు. కానీ, నాలైఫ్‌లో అది తీవ్ర దుఃఖాన్ని మాత్రం మిగిల్చింది. దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా నాకు సమయం పట్టింది.

ఇంకా చదవండి ...
నేను మా ఇంట్లో అందరి కంటే చిన్న అమ్మాయిని. కానీ, మా పేరెంట్స్‌ (Parents)  నన్ను ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండాలి అని ప్రోత్సహించేవారు. వారు వాళ్ల ఊర్ల నుంచి దూరంగా వచ్చి సెమీ గవర్నమెంట్‌ (semi-government)  ఉద్యోగాలు చేస్తున్నారు. చాలి చాలని జీతంతో మమ్మల్ని బాగానే చదివించారు. అంతేకాదు స్వాతంత్రంగా తలెత్తుకుని ఎలా బతకాలో కూడా నేర్పించారు. ఇది తర్వాతి కాలంలో నాకు ఎంతగానో ఉపయోగపడింది.

ఇదిలా ఉండగా..డిగ్రీ మూడో ఏడాదిలో నాకు 6 నెలలు యూనివర్శిటీ  (university) ఎక్సె ్ఛంజ్‌ ప్రోగ్రాంలో భాగంగా విదేశాల్లో చదువుకునే అవకాశం దక్కింది. ఎంతో హ్యాపీగా ఫీలై వెళ్లాను. అక్కడే నేను నా లవ్‌ను కూడా కలిశాను. ఈలోగా ఆరునెల్లు ఇట్టే గడిచిపోయాయి. ఎంతో ఆనందంగా ఫీల్‌ అయ్యాను.. ఎందుకంటే గ్రాడ్యూయేషన్‌ (graduation)తోపాటు మంచి గ్రేడ్స్‌ కూడా సంపాదించాను. పైగా నేను ప్రేమించిన వ్యక్తిని కూడా అక్కడే కలిశాను. ఈనేపథ్యంలో ఇండియాకు తిరిగి వచ్చాను. మేమిద్దరం ఇరవైల్లోనే ఉన్నాం. కానీ, గాఢంగా ఒకరంటే మరొకరం విడిచి ఉండలేకపోయాం. ప్రతి వీకెండ్‌లో నా బాయ్‌ఫ్రెండ్‌ నన్ను చూడటానికి 100 కీమీలు ప్రయాణించేవాడు. నేనేమో అతను ఎప్పుడు వస్తాడో అని ఆత్రుతగా ఎదురు చూసేదాన్ని.

ఇది కూడా చదవండి:  ఈ సూపర్‌ సలాడ్‌.. ఎంతో ఆరోగ్యం!


నేను మా తల్లిదండ్రులతో ఏ విషయాన్ని దాచేదాన్ని కాదు. అందుకే నా ప్రేమ గురించి మొత్తం వారికి చెప్పేశాను. వాళ్లు నాకు సపోర్ట్‌ చేయడమే కాదు, నా బాయ్‌ఫ్రెండ్‌ వాళ్ల పేరెంట్స్‌కు కూడా వెంటనే కాల్‌ చేసి మా రిలేషన్‌ షిప్‌ (relationship) గురించి చెప్పారు. ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకుని, మా పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇక మా ఆనందానికి హద్దు లేకుండా పోయింది.

అయితే, విదేశాల్లో ఒక ప్రముఖ యూనివర్శిటీలో మాస్టర్స్‌ పూర్తి చేసే అవకాశం లభించింది. మళ్లీ నా బాయ్‌ఫ్రెండ్‌ను వదిలి వెళ్లలేక పోయా.. కానీ, జీవితంలో చదువు అనేది ఎంత ముఖ్యమో మా ఇద్దరికీ తెలుసు. అందుకే ఎంత దూరం వెళ్లినా.. మా మనస్సులు ఎప్పటికీ ఒక్కటే అనుకున్నాం. చదువు పూర్తి చేయడానికి వెళ్లాను. కొద్ది రోజుల తర్వాత నా బాయ్‌ఫ్రెండ్‌ కూడా తన పెద్ద చదువుల కోసం నా దగ్గరికి వచ్చేశాడు. అక్కడ మేమిద్దరం 2 ఏళ్లు కలిసి ఉన్నాం.

మా చదువులు పూరై్తన వెంటనే ఇద్దరం మంచి జాబ్‌లో జాయిన్‌ అయ్యాం. ఇక మా రిలేషన్‌షిప్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలనుకున్నాం. కొద్దిరోజుల్లోనే మా పేరెంట్స్‌ కూడా మేము పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత పనులు మొదలుపెట్టారు. అప్పటికే మేము రిలేషన్‌ షిప్‌లో ఉండి 5 ఏళ్లు గడిచాయి. అయితే, రెండు నెలల తర్వాత దిపావళి వచ్చింది. కానీ, నేను అప్పుడు ఆఫీస్‌ మీటింగ్‌లో ఉన్నాను. అప్పుడు నా బాయ్‌ఫ్రెండ్‌ వాళ్ల అమ్మ నాకు దీపావళి విషెస్‌ చెప్పడానికి కాల్‌ చేశారు. కానీ, అప్పటికే నేను ఫోన్‌ సైలెంట్‌ మోడ్‌లో పెట్టాను.

నేను మీటింగ్‌లో ఉన్నాను కాబట్టి ఫోన్‌ను సైలెంట్‌ మోడ్‌లో పెట్టాల్సి వచ్చింది..అందుకే నేను చూసుకోలేదు. మీటింగ్‌ తర్వాత ఇంటికి వెళ్లాను. అయితే, నేను ఫోన్‌ చూసుకోకుండా.. అలసిపోయినట్లుగా ఉంటే పడుకున్నాను. ఆ రాత్రి గడిచింది.ఉదయం లేవగానే ఫోన్‌ చూసుకున్నా.. అప్పుడు మిస్డ్‌ కాల్స్‌ చూసి.. నేను తిరిగి వెంటనే మా అత్తగారికి కాల్‌ చేశాను. కానీ, ఆశ్చర్యంగా ఆమె నుంచి చాలా రాష్‌గా జవాబు వచ్చింది. నేను బిజీగా ఉన్నా.. అని ఫోన్‌ డిస్‌కనెక్ట్‌ చేసేశారు.

ఇది కూడా చదవండి:  ఉద్యోగం లేదని స్ట్రెస్‌కు గురవుతున్నారా? ఈ చిట్కాతో పాజిటివ్‌..


అయితే, నేను నిజమే అనుకుని నా పనుల్లో నేను బిజీ అయిపోయా ఆఫీసుకు వెళ్లిపోయా. కానీ, మా అత్తగారు కూడా తన పనుల్లో తను ఉంది. కొద్ది గంటల్లోనే మా అమ్మ నుంచి కాల్‌ వచ్చింది. అబ్బాయి వాళ్ల పేరెంట్స్‌ మీ పెళ్లికి సిద్ధంగా లేరని. వారు నన్న వెంటనే మేము కలిసి ఉంటున్న ఫ్లాట్‌లో నుంచి కూడా బయటకు వెళ్లిపొమ్మని వారు ఆర్డర్‌ వేశారట. నమ్మలేకపోయా.. అది నాకు అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. రీజన్‌ అంత విచిత్రంగా ఉంది మరి. ఇక సాయంత్రం ఆఫీస్‌ నుంచి ఇంటికి తిరిగి వచ్చాను. అప్పటికే నా బాయ్‌ఫ్రెండ్‌ ఏడుస్తున్నాడు. తను వాళ్ల పేరెంట్స్‌ ఇష్టానికి వ్యతిరేకంగా ఏమి చేయలేనని నాకు సారీ చెప్తూ కన్నీరు పెట్టుకున్నాడు. మన రిలేషన్‌షిప్‌ను ఇక ముందుకు తీసుకెళ్లలేమని అన్నాడు. నేను అతడికి వివరించి కారణం చెప్పాలనుకున్నా.. కానీ, అతడు ఏడుస్తూ సారీ, చెప్తూనే ఉన్నాడు.. ఇక నేనేం మాట్లాడలేపోయా. 2–3 రోజుల్లో ఆ ఫ్లాట్‌ నుంచి వెళ్లిపోయా.

మా అత్తగారికి ఎన్నిసారు వివరించి చెప్పాలను ట్రై చేసినా.. ఆమె నా కాల్‌ను కట్‌ చేస్తునే ఉంది. ఒక్కసారి మా పేరెంట్స్‌తోపాటు ఆమెను నేరుగా కలిశాం. అప్పుడు నేను మా అత్తగారికి ఒక్క మాట చెప్పా.. నీ ప్లేస్‌లో మా పేరెంట్స్‌ ఉంటే.. నీలా మాత్రం చేయరు అని., దానికి ఆమె జవాబు ఏంటో తెలుసా? మేము అబ్బాయి కుటుంబం వాళ్లం అని గర్వంగా రిప్లై ఇచ్చారు.
Published by:Renuka Godugu
First published:

Tags: Relationship

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు