HOW OFTEN SHOULD SMALL CHILDREN BE BATHED AND WHAT HAPPENS IF YOU DO IT TOO MANY TIMES PRV
Bath for children: చిన్న పిల్లలకు ఎప్పుడు స్నానం చేయించాలి.. ఎక్కువ సార్లు చేయిస్తే ఏమవుతుంది?
ప్రతీకాత్మక చిత్రం
స్నానం చేయడం వల్ల మంచి సూక్ష్మజీవులు సంతులనం జరిగి చర్మ వ్యాధులకు కారణమయ్యే హానికర బ్యాక్టీరియా నాశనమవుతుంది. ముఖాన్ని శుభ్రం చేసుకోకపోతే మొటిమలు, నల్ల మచ్చలు ఎక్కువగా వస్తాయి. అయితే పిల్లల (children) విషయంలో మాత్రం స్నానం చేయించేటపుడు జాగ్రత్త.
స్నానం (bathing) శరీరానికి చాలా అవసరం. చర్మాన్ని సౌందర్యం గా ఉండడం తో పాటు ఆరోగ్యంగా ఉంటుంది. చాలా మందికి ముఖ్యంగా ఈ చలికాలంలో స్నానం ఏం చేస్తాంలే అని బద్ధకంగా ఉంటారు జనాలు. కాని రోజుకి రెండుసార్లు స్నానం చేస్తే చాలా మంచిది. ఎక్కువ రోజులు స్నానం చేయకుండా కాలక్షేపం చేస్తే.. చర్మం (skin) పాలిపోయిన ట్లుగా మారుతుంది. ముదురు ఎరుపు రంగులో పాచెస్ వస్తాయి. రోజూ స్నానం (bath) చేయకపోతే కొత్త వ్యాధులు (diseases) దాడి చేస్తాయి. చర్మంపై అనేక జాతుల బ్యాక్టీరియాలు జీవిస్తున్నాయి. స్నానం చేయడం వల్ల మంచి సూక్ష్మజీవులు సంతులనం జరిగి చర్మ వ్యాధులకు కారణమయ్యే హానికర బ్యాక్టీరియా నాశనమవుతుంది. ముఖాన్ని శుభ్రం చేసుకోకపోతే మొటిమలు, నల్ల మచ్చలు ఎక్కువగా వస్తాయి. అయితే పిల్లల (children) విషయంలో మాత్రం స్నానం చేయించేటపుడు జాగ్రత్త.
తరుచూ మంచిది కాదు..
పుట్టిన పిల్లలకు (born babies) రోజు స్నానం చేయిస్తుంటారు పెద్దలు. చిన్నపిల్లలు (children) కొంచెం చికాకుగా కనిపించినా.. సతాయించినా స్నానం (bath) పోసి వాళ్లను పడుకోబెడుతుంటారు. ఇక సమయానికి ఆహారం అందివ్వడం ఎంత ముఖ్యమూ. స్నానం చేయించడం కూడా అంతే ముఖ్యమని చిన్నారుల తల్లిదండ్రులు భావిస్తారు. అయితే ఇలా తరచూ స్నానం చేయించడం వల్ల పిల్లలు ఇబ్బందులకు గురవుతారట.
దుర్వాసన దూరమవుతుంది..
పాపాయి చర్మం ఆరోగ్యంగా (healthy skin) ఉండాలంటే స్నానం ఎప్పుడెప్పుడు చేయాలో తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. స్నానం చేస్తే శరీరంపై ఉండే మృత కణాలు తొలగిపోతాయి. దుర్వాసన దూరమవుతుంది. శ్వేధ రంధ్రాలు శుభ్రపడి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఇందుకు మాటి మాటికీ స్నానం చేయడం మాత్రం ప్రమాదకరమట. ఇక నీరు, సబ్బు వల్ల శిశువుల చర్మం పొడి బారుతుంది. దీని వల్ల తామర వంటి చర్మవ్యాధులు (skin diseases), చర్మంపై పొక్కులు, ఇతర ఇన్‌ఫెక్షన్‌లు ఎదురయ్యే అవకాశం ఉంటుందట. వైద్య పరంగా పిల్లలకు ప్రతిరోజూ స్నానం చేయించాల్సిన అవసరం లేదు. రెండు మూడు రోజులకు ఒకసారి స్నానం చేయిస్తే చాలని చెబుతున్నారు.
అయితే పిల్లలకు ఎంత తరచుగా స్నానం చేయించాలనే విషయం వివిధ రకాల అంశాలతో ముడిపడి ఉంటుంది. నివసించే వాతావరణం, శరీర తత్వం, రోజులో పిల్లలు ఎంత సమయం దుమ్ములో ఆడుకుంటున్నారు అనేవి స్నానం చేయించడానికి పరిగణనలోకి తీసుకోవాలట.
చిన్నారుల స్నానానికి సంబంధించి కొన్ని సలహాలు ఇస్తున్నారు నిపుణులు. సబ్బు (soap) వాడకాన్ని తగ్గించడంతో పాటు పిల్లల శరీరం తేమను కోల్పోకుండా చూడాలి. సబ్బుకు బదులుగా బాత్ ఆయిల్ (bath oil) వాడటం మంచిది. వాతావరణ పరిస్థితులనూ దృష్టిలో పెట్టుకొని స్నానం చేయించాలి. శీతాకాలంలో చల్లని గాలి శరీరాన్ని పొడిబార్చుతుంది. అందువల్ల తక్కువ సార్లు స్నానం (limited times bath) చేస్తూ, శరీరాన్ని తేమగా ఉంచాలి. ఏసీలు ఎక్కువగా వాడినా ఇదే పద్ధతిని పాటించాలి. అందువల్ల వాతావరణం, శరీరతత్వాన్ని బట్టి పిల్లలకు స్నానం ఎన్నిసార్లు చేయాలన్నది నిర్ణయించుకోవడం మంచిది.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.