Teeth brushing tips: పళ్లను బ్రష్ చేసుకోవడానికి 2 నిమిషాలు సరిపోదా?
ప్రతీకాత్మక చిత్రం
Dental cleaning tips: రెండు నిమిషాలు బ్రషింగ్ చేయడం వల్ల ముందు కంటే ఎక్కువ మురికి తొలగిపోతుంది. అయినప్పటికీ 2 నిమిషాల కంటే ఎక్కువ సేపు బ్రష్ చేయడం వల్ల మన దంతాలు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటాయనే దానిపై ఇంకా పరిశోధనలు జరగలేవు.
మనలో చాలా మందికి రోజుకు రెండుసార్లు బ్రష్ (tooth brush) చేసుకోవాలి. కనీసం 2 నిమిషాలు పళ్లు బ్రష్ చేసుకోవాలని తెలుసు. 1970లలో డెంటిస్టులు (dentists) 2నిమిషాలు పళ్లు కచ్చితంగా తోముకోవాలని సూచించారు. ఆ తర్వాత బ్రష్ చేసుకోవడానికి కేవలం సెన్సిటీవ్ బ్రష్‌నే వాడాలని సిఫార్సు చేశారు.
అదేంటి..? ఒక్క నిమిషం పళ్లు తోముకున్నా.. సరిపోతుందని కొందరు అంటుంటే, 2 నిమిషాలు బ్రష్ చేసినా సరిపోదని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. కొన్ని కొత్త అధ్యయనాల ప్రకారం దంతాల నుంచి మరింత ఎక్కువ మురికిని (plaque) తొలగించాలంటే, ఎక్కువ సేపు బ్రషింగ్ కూడా చేయాల్సి ఉంటుంది.
దీనికోసం కనీసం 3–4 నిమిషాల పాటు బ్రష్ చేసుకోవాలని సూచించారు. దీనర్థం మనం బ్రషింగ్ సమయాన్ని రెట్టింపు చేసి, ఇంకాస్త ఎక్కువ సేపు బ్రషింగ్ చేయాల్సి ఉంటుంది.
కానీ, ప్రస్తుతం ఏకాభిప్రాయం ప్రధానం. బ్రషింగ్ సమయం, దాని సాంకేతికత, వివిధ రకాల టూత్ బ్రష్‌లపై 1990 నుంచి ప్రచురించబడిన పరిశోధన నివేదికలపై ఆధారపడింది.
ఈ పరిశోధనల్లో 2 నిమిషాలు బ్రష్ చేయడం వల్ల గారను తొలగించడంలో సహాయపడుతుందని కనుగొన్నారు. కానీ, ఇది సరైన పద్ధతి కాదు.
అయినప్పటికీ గార ఎక్కువగా పేరుకుపోవడం వల్ల కలిగే నష్టం మనకు తెలుసు, దీని ఆధారంగా ప్రతి బ్రషింగ్‌తో మురికిని తొలగించడంతోపాటు మన నోటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.కానీ,దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. ఈ పరిశోధన చేయడం కూడా అంత సులభం కాదు. ఎందుకంటే అలాంటి పరిశోధన చాలా సమయం పడుతుంది.
మనం పళ్లు తోమకున్నప్పుడు అందులోని సూక్ష్మక్రిములను తొలగిం^è డమే మన లక్ష్యం. వీటిని డెంటల్ ప్లేక్స్ అంటారు. ఈ ప్లేక్స్ బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంద్రాల రూపంలో సేకరిస్తాయి. అక్కడ ఒకేదగ్గర జీవిస్తాయి. దీన్ని మైక్రోబియల్ బయోఫిల్మ్ అంటారు.
ఈ బయోఫిల్మ్‌లు (bio films) చాలా జిగటగా ఉంటాయి. బ్రష్ సహాయంతో మాత్రమే ఈ సూక్ష్మక్రిములు తొలగించబడతాయి. ఈ సూక్ష్మక్రిములు అనేక కారణాల వల్ల పెరిగిపోతాయి.
వాస్తవానికి ఈ బయోఫిల్మ్‌లు మన దంతాలను శుభ్రపరచిన కొన్ని గంటల తర్వాత పునరుత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అప్పుడు రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం మంచిది.
దంతాలను ఎక్కువసేపు బ్రష్ చేయకపోతే దానిపై ప్లేక్ లోతుగా పేరుకుపోతుంది. ఇది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని సక్రియం చేస్తుంది. ఇది చిగుళ్ల వాపు, పంటినొప్పికి దారితీస్తుంది.
వాపు సాధారణంగా బాధకరంగా ఉండదు. కానీ తరచూ బ్రషింగ్ సమయంలో ర క్తస్రావం, కొన్ని సందర్భల్లో దుర్వాసన కూడా వస్తుంది. బయోఫిల్మ్‌లు కూడా కావిటీకి కారణమవుతుంది.
బ్రషింగ్ ముఖ్య ఉద్దేశం ప్రతి పంటి నుంచి వీలైనంత ఎక్కువ ప్లేక్‌ను తొలగించడం. ఇటీవలి ఆధారాలు ఎక్కువ సమయాన్ని బ్రషింగ్‌కు వెచ్చించడాన్ని సూచిస్తున్నాయి. (ప్రతిసారీ నాలుగు నిమిషాల వరకు).
ఎక్కువసేపు బ్రషింగ్ అంటే మన దంతాలను ఎక్కువగా శుభ్రం చేసుకోగలం. ముఖ్యంగా బ్రష్ చేయలేని ప్రదేశంలో తక్కువ సేపు శుభ్రం జరుగుతుంది.
కానీ, దంతాలను తరచూ బ్రష్ చేయకుండా (రోజుకు రెండుసార్లు కంటే ఎక్కువ), వాటిని చాలా గట్టిగా రుద్దకుండా జాగ్రత్త వహించాలి. ఇది కాకుండా మరో ముఖ్యమైంది గట్టి బ్రిస్టల్ బ్రష్‌లు, కఠినమైన టూత్‌పేస్ట్ లేదా పౌడర్‌ను అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే అవి దంతాలపై ఎక్కువ రాపిడిని కలిగిస్తాయి. వాటికి నష్టాన్ని కలిగిస్తాయి.
బ్రష్ చేయడానికి విభిన్న పద్ధతులు ఉన్నాయి. మీరు బ్రష్ సరిగ్గా చేసుకోవడానికి వాటిని అనుసరించండి. వీటిలో ఒకటి బాస్ టెక్నిక్. ఇందులో దంతాలతోపాటు చిగుళ్లను పూర్తిగా శుభ్రపరుస్తుంది. దీనిలో చిగుళ్ల దిగువ భాగం కూడా క్లీన్ అవుతుంది. అక్కడ ప్లేక్ ఎక్కువ పేరుకుపోతుంది.
దంతాలను చాలా తేలికగా బ్రష్ చేయాలి. ఎంత బలం ఉపయోగించాలని ఆధారాలు లేవు.
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.