ఫైబర్ మనకు అత్యంత అవసరమైనది. మనం ఏదైనా తిన్న తర్వాత... ఆకలిపోయినట్లు, ఆహారం తిన్న ఫీలింగ్ కలగాలంటే ఫైబర్ అవసరం. మనం తినే ఫుడ్ సరిగా జీర్ణం అవ్వాలంటే కూడా ఫైబర్ అవసరం. అయితే మంచిది కదా అని ఎక్కువ ఫైబర్ తీసుకోకూడదు. నిజానికి ఫైబర్ అనేది ఓ రకమైన కార్బొహైడ్రేట్. ఇది ఎక్కువగా తృణధాన్యాలు, పప్పులు, విత్తనాలు, పండ్లు, కూరగాయల్లో ఉంటుంది. ఫైబర్ మన నోటి నుంచీ శరీరంలోకి వెళ్లగానే... తిన్నగా ఆహార నాళంలో చేరుతుంది. ఆహారం చక్కగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీన్నే డైటరీ ఫైబర్ అంటారు. ఇది మన ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది. గుండెకు మేలు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. మీరు రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు దోహదపడుతుంది. అధికబరువు తగ్గాలంటే కూడా ఫైబర్ అవసరమే.
ఎక్కువ ఫైబర్ తీసుకుంటున్నట్లు ఎలా తెలుస్తుంది : ఏ చాకొలెట్లో, చికెనో ఎక్కువగా తింటే... మనకు తెలిసిపోతుంది. కానీ ఫైబర్ అనేది తినే ఆహారంలో కలిసి ఉంటుంది. కాబట్టి ఎంత ఫైబర్ తీసుకుంటున్నామో మనకు తెలియదు. జనరల్‌గా రోజుకు 25 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. అంతకంటే ఎక్కువగా తీసుకుంటే... డయేరియా (అతిసారం), గ్యాస్, కడుపునొప్పి, ఏసీడీటీ వంటి సమస్యలు వస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే... ఎక్కువ ఫైబర్ తీసుకుంటే... ఎక్కువసార్లు టాయిలెట్‌కి వెళ్లక తప్పదు.
ఫైబర్ ఎక్కువైతే ఏం చెయ్యాలి? : దురదృష్టవశాత్తూ... బాడీలో ఫైబర్ ఎక్కువైతే... దాన్ని వెంటనే తొలగించేసుకునేందుకు ఏ టాబ్లెట్లూ లేవు. ఐతే... ఫైబర్ వల్ల వచ్చే సమస్యల్ని బట్టీ... వాటిని తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు పొట్టలో గ్యాస్ ఉంటే... OTC గ్యాస్‌తో పోరాటే టాబ్లెట్ వేసుకోవచ్చు. డయేరియా ఉంటే... మూత్రం బయటకు వెళ్లిపోవాల్సిందే. మరీ నీళ్ల విరేచనాలు ఉన్నప్పుడు, యాంటీ-డయేరియా మెడికేషన్ తీసుకోవాలి.
వేటిలో ఫైబర్ ఎక్కువ : కూరగాయలు, ఫ్రూట్స్‌లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. అలాగే తృణ ధాన్యాలు, పప్పుదినుసుల్లో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వెజిటేరియన్లకు ఈ ఫైబర్ ఎక్కువయ్యే సమస్య తలెత్తుతూ ఉంటుంది. కానీ చాలా దేశాల్లో ప్రజలు తీసుకోవాల్సిన దానికంటే తక్కువ ఫైబరే తీసుకుంటున్నారు. కొంతమందికి కొన్ని రకాల ఆహారాలు తిన్నప్పుడు... కడుపునొప్పి వస్తూ ఉంటుంది. వారు ఆ ఆహార పదార్థాల్ని తగ్గించుకుంటే మంచిదే.
సరిపడా ఫైబర్ తినాలంటే ఎలా : రోజుకు 25 గ్రాముల ఫైబర్ అవసరం. మీకు మలబద్ధకం, ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు వస్తుంటే... మీ బాడీలో ఫైబర్ తక్కువగా ఉన్నట్లు లెక్క. అప్పుడు మీరు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. మీకు కడుపునొప్పి, గ్యాస్ వంటివి వస్తుంటే... మీరు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం తగ్గించుకోవాలి. ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే... సరైన ఫలితం ఉంటుంది. ఎంత ట్రై చేసినా... బ్యాలెన్సింగ్ వీలుకాకపోతే... అప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్లడమే ఉత్తమం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health benifits, Health Tips, Life Style, Women health