Home /News /life-style /

HOW MUCH BETTER IS IT TO USE GARLIC TO RELIEVE DIABETES AND IS THAT USEFUL PRV

Diabetes: మధుమేహం నుంచి ఉపశమనం పొందడానికి ఔషధ గుణాలున్న వెల్లుల్లిని వాడితే ఎంత వరకు బెటర్​?​

వెల్లుల్లి

వెల్లుల్లి

మధుమేహగ్రస్తుల రక్తంలో చక్కెర స్థాయిలను (Sugar levels) నియంత్రిస్తుందట. మనం తినే ఆహారం... మన శరీరంలో షుగర్ లెవెల్స్ పెంచుతోంది. దానికి విరుగుడు వెల్లుల్లి. ఇది షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది.

    మధుమేహం (Diabetes). శారీరక శ్రమ పూర్తిగా లోపించడం, గంటల తరబడి కూర్చోని ఉండటం, పోషక పదార్థాలు సరిగా లేని ఆహారం, వేపుడు కూరలు, అధికంగా కొవ్వు ఉండే పదార్థాలు, మాంసాహారం, బేకరీ పదార్థాలు, నిల్వ ఉండే పచ్చళ్లు, తీపి పదార్థాలు, కొన్ని రకాల మందుల దుష్ఫరిణామాలు ఈ వ్యాధికి (disease) కారణం. స్టెరాయిడ్స్, కొన్ని రకాల వైరస్, ఇన్ఫెక్షన్స్, హార్మోన్ల అసమతుల్యత వల్ల మధుమేహం (Diabetes) వస్తుంటుంది. తరచుగా మూత్ర విసర్జన (పాలీయూరియా), పొడి గొంతు లేదా తరచుగా దాహం వెయ్యడం (పాలీడిప్సియా), కంటి చూపు(eye site) మందగించడం., కారణం లేకుండా ఆకస్మిక బరువు పెరుగుట లేదా బరువు తగ్గడం (weight loss), ఒక్కసారిగా నీరసం అలసటగా అనిపించడం అధికంగా ఆకలి వేయడం (Hungry) దీని ముఖ్య లక్షణాలు. గర్భవతుల్లో 2 నుంచి 5 శాతం వరకు ఈ డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. ఈ డయాబెటిస్‌కు సరిగా వైద్యం అందించకపోతే తల్లీ, బిడ్డలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కొన్నిసార్లు ప్రసవం తర్వాత డయాబెటిస్ ఉండవచ్చు. అయితే వెల్లుల్లి (Garlic)తో మధుమేహం నుంచి ఉపశమనం పొందవచ్చు. వెల్లుల్లి ప్రయోజనం ఎంతవరకో తెలుసుకుందాం....

    వెల్లుల్లి (garlic)లో ఔషధ గుణాలు ఎక్కువ. ఇక వెల్లుల్లి  వేసిన వంటలు చక్కని రుచి, వాసన (Smell) వస్తాయి. శరీరంలోని ఇంకా వ్యాధులకు (Diseases) చెక్ పెట్టే శక్తి వెల్లుల్లికి ఉంది. ఇక ఆస్తమా శ్వాస పీల్చుకోవడం వల్ల ఇబ్బంది వంటి ఊపిరితిత్తుల రుగ్మతలను తగ్గించడానికి వెల్లుల్లి చక్కగా ఉపయోగపడుతుంది. నోటి వ్యాధులకు వెల్లుల్లి బాగా పని చేస్తుంది.

    మధుమేహగ్రస్తుల రక్తంలో చక్కెర స్థాయిలను (Sugar levels) నియంత్రిస్తుందట. మనం తినే ఆహారం... మన శరీరంలో షుగర్ లెవెల్స్ పెంచుతోంది. దానికి విరుగుడు వెల్లుల్లి. ఇది షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. ఏడు వారాల్లో సెరమ్ గ్లూకోజ్‌ని 57 శాతానికి తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది. అంటే నెలన్నరలోనే టైప్-2 డయాబెటిస్ సమస్యల నుంచీ గట్టెక్కవచ్చు. అందువల్ల షుగర్ వ్యాధి ఉన్నవారు ఉదయాన్నే వెల్లుల్లి తింటే (eat) అద్భుత ఫలితాలు కనిపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

    వెల్లుల్లి మొత్తం శరీరంలోని 22 రకాల వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుందని ప్రాచీనకాలం నుంచి ఉన్న నమ్మకం. రోజు ఉదయాన్నే పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను నేరుగా అలాగే నమిలి తినవచ్చు. ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లి రసం తాగవచ్చు. ఇలా కూడా చేయలేం అనుకునేవారు వెల్లుల్లి రెబ్బలు 4 తీసుకొని వాటిని కాల్చి తినవచ్చు. షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం.

    కాగా, వాకింగ్ (walking)​ చేస్తే డయాబెటిస్​ అదుపులో పెట్టవచ్చు. రాత్రిపూట భోజనం తర్వాత వాకింగ్ చేసిన వారిలో ఏకంగా 22 శాతం వరకు షుగర్ లెవెల్స్ తగ్గినట్లు పరిశోధకులు వివరించారు. ఇలా వాకింగ్ చేస్తే మధుమేహం సమస్య దరిచేరదని చెబుతున్నారు. శరీరానికి మానసిక, శారీరక ఉల్లాసం దొరుకుతుందట. వారి పనితీరు సైతం మెరుగైనట్లు ఆ రిపోర్టులో తెలిపారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Diabetes, Food, Health Tips, Life Style

    తదుపరి వార్తలు