గుడిలో ప్రదక్షిణలు ఎన్ని చేయాలి.. ఎలా చేయాలి..

గుడిలోకి వెళ్లగానే చాలామంది దేవుడి దర్శనానికి ముందు ప్రదిక్షణలు చేస్తుంటారు. అయితే, ఇందులో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మంచిదన్న సందేహం ఉంటుంది. ఆ విషయం గురించి తెలుసుకోండి..

Amala Ravula | news18-telugu
Updated: June 24, 2019, 9:55 AM IST
గుడిలో ప్రదక్షిణలు ఎన్ని చేయాలి.. ఎలా చేయాలి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆలయంలోకి వెళ్లామంటే మనసంతా ఆధ్యాత్మిక భావనతో నిండి ఉండాలి. మనసును దైవంపైనే నిలపాలు. అంతేకానీ, ఏవో ఆలోచనలు చేస్తూ ఉండకూడదు.. ప్రదక్షిణలు ప్రధాన ఆలయం, ఉప ఆలయాలకు కలిపి చేయొచ్చు. అదే విధంగా.. ఇన్ని చేయాలన్న నియమం లేదు.. ఎక్కువ ప్రదక్షిణలు చేస్తే మంచిదన్న ఆలోచన అస్సలు ఉండకూడదు. మనస్సు సత్వ, రజో, తామస త్రిగుణాలతో భగవంతుడిని ప్రార్థిస్తూ మూడు ప్రదక్షిణలు చేసినా చాలు.. ఎక్కువ చేస్తే తప్పు కూడా లేదు. ఇందులోనూ సరి, బేసి అనే నియామాలు లేవు. కాబట్టి మూడు నుంచి ఎన్ని ప్రదక్షిణలైనా చేయొచ్చు.

ముఖ్యంగా.. ఆగమశాస్త్రం ప్రకారం మూలవిరాట్టులోని దైవీశక్తి ఉత్సవ విగ్రహం, పాదుకలు, ధ్వజస్తంభం, అర్చకునిలో కొలువై ఉంటుంది కాబట్టి.. ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణ చేయాలని పెద్దలు చెబుతారు.

First published: June 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు