Home /News /life-style /

HOW LONG SHOULD NUTS BE SOAKED BEFORE EATING TO GET MORE BENFITS PVN

Nuts : నట్స్ ని తినేముందు ఎంతసేపు నానబెడితే ఎక్కువ ప్రయోజనం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Nuts soaked : నట్స్(Nuts)తినడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ నట్స్ తినడానికి ఇష్టపడతారు. పీచు, ప్రొటీన్లు పుష్కలంగా ఉండే గింజలను మనం ప్రతిరోజూ తీసుకోవాలి. 

Nuts soaked : నట్స్(Nuts)తినడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ నట్స్ తినడానికి ఇష్టపడతారు. పీచు, ప్రొటీన్లు పుష్కలంగా ఉండే గింజలను మనం ప్రతిరోజూ తీసుకోవాలి.  విటమిన్ ఇ, కాల్షియం, పొటాషియం, విటమిన్ బి, థయామిన్ మొదలైన అనేక పోషకాలు ఉంటాయి, ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి. చాలా మంది ప్రజలు ప్రయాణంలో నట్స్ తినడానికి ఇష్టపడతారు, మనం రైళ్లల్లో,బస్సులో చాలా మంది ప్రయాణ సమయంలో పళ్లీలు,బాదం పప్పు వంటి తినడం చూస్తూనే ఉంటాం. అయితే చాలామంది వాటిని తమ ఇష్టమైన వంటకంతో కలిపి తింటారు. వంటల్లో వీటిని ఉపయోగించి ఆహారంలో కలిపి తీసుకుంటుంటారన్న సంగతి తెలిసిందే. అయితే నట్స్ తినడానికి సరైన మార్గం ఏమిటో మీకు తెలుసా. మనం తినే గింజలు చాలా వేడిగా ఉంటాయి. పచ్చి గింజలలో ఫైటిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది, ఇది కడుపు లేదా గుండెల్లో మంట సమస్యలను కలిగిస్తుంది. ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి గింజలను ఎలా, ఎంతసేపు నానబెట్టి తింటే ఎక్కువ బెన్ ఫిట్స్ శరీరానికి లభిస్తాయో తెలుసుకుందాం.

 ఉప్పు నీటిలో నానబెట్టండి
చాలా మంది పచ్చి గింజలను తినడం ద్వారా ఫైటేట్స్, ఎంజైమ్‌ల సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమస్యలను నియంత్రించాలంటే వీటిని ఉప్పు నీటిలో నానబెట్టాలి. నానబెట్టడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించవచ్చు. ఉప్పు, వేడి నీటిలో నానబెట్టడం గింజల వేడిని తొలగిస్తుంది, అలాగే అవసరమైన కొవ్వులు, ప్రోటీన్లను సంరక్షిస్తుంది.

Weight loss : ఫాస్ట్ గా బరువు తగ్గాలనుకుంటే స్విమ్ చేయడం బెటరా?ఈ విషయాలు తెలుసుకోండి

తినే ముందు ఎంతసేపు నానబెట్టాలి
నీటిలో ఎంతసేపు నానబెట్టాలి అనేది చాలా ముఖ్యం. అనేక రకాల నట్స్( గింజలు) ఉంటాయి, అదే విధంగా వాటిని నానబెట్టే పద్ధతి, సమయం తేడా ఉంటుంది. వాల్‌నట్‌లు, బాదం పప్పులు గట్టిగా ఉంటాయి కాబట్టి వాటిని 7 నుండి 8 గంటల పాటు నానబెట్టడం మంచిది. అదే సమయంలో, మీరు ఎండుద్రాక్ష లేదా పైన్ గింజలను నానబెట్టాలనుకుంటే 5 నుండి 6 గంటల సమయం సరిపోతుంది. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వాటిని తినడానికి ముందు వారి పైన తొక్కు లేదా చర్మంని తొలగించాలని గుర్తుంచుకోండి.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Doughnuts, Lifestyle

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు