STRAP: కొవిడ్-19 మూడో వేవ్ పిల్లల మీద బాగా ప్రభావం చూపించబోతోందని అందరూ భయపడుతున్నారు. భవిష్యత్తులో ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి వైద్యులు, ప్రభుత్వాధికారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
పిల్లలు, యుక్తవయస్కులు అని తేడా లేకుండా కొవిడ్-19 అందరికీ సోకుతుంది. అయితే కొవిడ్-19 బారిన పడిన పిల్లల సంఖ్య తక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఒకరిద్దరు పిల్లలకు సోకినా వాళ్లకు లక్షణాలు లేకపోవడం లేదా తక్కువ లక్షణాలు ఉండటం కనిపించింది. భారతదేశంలో కొవిడ్-19 బారిన పడిన పిల్లల్లో కొంతమంది మాత్రమే ఆసుపత్రి పాలయ్యారు.1
అయితే కొవిడ్-19 మూడో వేవ్ తప్పనిసరిగా పిల్లలను ప్రభావితం చేస్తుందని అందరూ భయపడుతున్నారు. అయినా, దీనిని రుజువు చేసే సైద్ధాంతిక సాక్ష్యం ఏదీ లేదు.2 మొదటి వేవ్‌లో పెద్దవాళ్లు, రెండో వేవ్‌లో యువకులు ఎక్కువగా ప్రభావితమయ్యారు. కాబట్టి, మూడో వేవ్‌లో తప్పనిసరిగా పిల్లలు ప్రభావితమవుతారని అనుకుంటున్నారు. అంతేకాకుండా, పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభం కాలేదు కాబట్టి వారే ఎక్కువగా ఇబ్బంది పడతారని కూడా కొందరు భయపడుతున్నారు. భవిష్యత్తులో ఈ పరిస్థితితో పోరాడటానికి, మూడో వేవ్ కొవిడ్-19 కోసం సంసిద్ధంగా ఉండటానికి డాక్టర్లు, ప్రభుత్వాధికారులు ప్రయత్నిస్తున్నారు.
పిల్లల్లో కొవిడ్-19 లక్షణాలు
పీడియాట్రిక్ వయస్సు గ్రూప్‌లో కొవిడ్-19 నిర్వహణకు సంబంధించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం, పిల్లల్లో అతిసాధారణంగా కనిపించే లక్షణాలు జలుబు, కొద్దిగా దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం. వీటితో పాటుగా కడుపులో నొప్పి, డయేరియా, వాసన, రుచి కోల్పోవడం లాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. కాబట్టి పిల్లల్లో కొవిడ్-19ను వీలైనంత త్వరగా గుర్తించి, చికిత్స చేయడం చాలా ముఖ్యం.3
చిన్నారికి కొవిడ్-19 సోకిందో లేదో తెలుసుకోవడానికి, వారికి టెస్ట్ చేయించడం చాలా అవసరం. కుటుంబంలో కొవిడ్-19 పాజిటివ్ వచ్చిన వ్యక్తితో లేదా కొవిడ్-19 లక్షణాలు ఉన్న వారితో చిన్నారి కాంటాక్ట్ అయినా లేదా మూడు రోజులకు మించి చిన్నారికి జ్వరం ఉన్నా, వైద్యుని సలహా తీసుకుని, చిన్నారికి టెస్ట్ చేయించి, ఇంట్లోనే ఐసోలేట్ చేయండి.
కొవిడ్-19 పాజిటివ్ పిల్లల సంరక్షణ
చిన్నారికి కొవిడ్-19 సోకితే, వారిని వెంటనే ఇతర కుటుంబ సభ్యుల నుండి వేరుగా చేసి (కుదిరితే), ప్రత్యేక గదిలో ఐసోలేట్ చేయడం చాలా ముఖ్యం. వీలైతే వీడియో కాల్స్ ద్వారా పిల్లలకు పాజిటివ్ టాక్ అందించే ప్రయత్నం చేయడం ఉత్తమం.
ఒకవేళ తల్లికి, పిల్లలకు ఇద్దరికీ కొవిడ్-19 పాజిటివ్ వస్తే, పిల్లలు తల్లి దగ్గర ఉండగలుగుతారు. కానీ తల్లికి అంత ఓపిక లేకపోయినా లేదా హాస్పిటల్ పాలైనా అది కుదరకపోవచ్చు. పిల్లలకు పాలివ్వడాన్ని తల్లులు కొనసాగించవచ్చు. ఒకవేళ తల్లికి కొవిడ్-19 పాజిటివ్ అయ్యుండి, పిల్లలను సంరక్షించగల ఓపిక ఆమెకు ఉన్నట్లయితే, చిన్నారి నెగెటివ్ అయినా కూడా ఆమె తన పిల్లల సంరక్షణ చూడవచ్చు. అయితే ఇలా చేయాలనుకున్నప్పుడు మాత్రం పాజిటివ్ వచ్చిన తల్లి పూర్తి శానిటైజ్ రక్షణలు తీసుకోవాలి. వీలైనంత మేరకు మాస్క్ ధరించాలి.
పిల్లల్లో కొవిడ్-19 నిర్వహణ గురించి డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) మార్గదర్శకాల ప్రకారం, మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (MIS-C) అది కొవిడ్-19 నుండి రికవరీ అయిన పిల్లల్లో 2 నుండి 6 వారాల తర్వాత కనిపిస్తుంది. MIS-C వచ్చిన పిల్లల్లో గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, మెదడు, చర్మం, కళ్లు లేదా జీర్ణవ్యవస్థ లాంటి శరీర భాగాల్లో మంటగా ఉండటం సాధారణంగా కనిపించే లక్షణం. అలాగే జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, డయేరియా, ర్యాష్, కళ్లు ఎర్రబడటం, షాక్, అలసట, కండ్లకలక, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. MIS-C కలగడానికి కారణం మాత్రం తెలియదు. అయినప్పటికీ, MIS-C ఉన్న చాలా మంది పిల్లలు గతంలో కొవిడ్-19 బారిన పడ్డారు. పిల్లల్లో MIS-C వల్ల ఎదురయ్యే క్లిష్టమైన సమస్యలను తగ్గించడానికి వీలైనంత త్వరగా వ్యాధిని గుర్తించి, మెడికల్ కేర్, చికిత్స తీసుకుంటే చాలు.
భారతదేశంలో, ఇతర దేశాల్లో పిల్లలకు కొవిడ్-19 వ్యాక్సిన్
ప్రస్తుతం భారతదేశంలో, కేవలం పెద్దవాళ్లకు మాత్రమే వ్యాక్సిన్ అందించబడుతోంది. పిల్లలు (2 ఏళ్లు దాటినవారు), టీనేజీ వాళ్లకు కొవాక్సిన్ (ఫేజ్ II/III) క్లినికల్ ట్రయల్ ప్రస్తుతం జరుగుతోంది5. 12 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల పిల్లలకు వ్యాక్సిన్ అందించడాన్ని ఇప్పటికే కొన్ని దేశాలు ప్రారంభించాయి. 12 నుండి 15 ఏళ్ల పిల్లల్లో Pfizer-BioNTech (ఫైజర్-బయోఎన్‌టెక్) క్లినికల్ ట్రయల్ విజయవంతమయ్యాక, దీన్ని 12 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి అందుబాటులోకి తీసుకువచ్చారు. 6
కొవిడ్-19 జబ్బుల నుండి నివారణ
ప్రస్తుతం, కొవిడ్-19 నుండి పిల్లలను కాపాడటానికి ఉత్తమమైన దారి ఒక్కటే, అదేంటంటే కొవిడ్-19 సహిత ప్రవర్తనలైన సామాజిక దూరం, మాస్క్ ధరించడం, సబ్బుతో చేతులు కడుక్వడం, ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ ఉపయోగించడం లాంటివి పాటించడం మాత్రమే. పిల్లల్లో కొవిడ్-19 నిర్వహణ గురించి డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) అందించిన మార్గదర్శకాల ప్రకారం, ఐదేళ్లలోపు చిన్నారులు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు, అయితే 6 నుండి 11 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారులు తల్లిదండ్రుల పర్యవేక్షణలో మాస్క్ ధరించాలి, అలగే 12 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు తప్పకుండా మాస్క్ ధరించాలి.7
ఎటువంటి జబ్బునైనా తట్టుకునేలా రోగనిరోధకశక్తిని పెంచడానికి ఆరోగ్యకరమైన, పోషక విలువలు గల కూరగాయలు, పళ్లు ఆహారంగా తీసుకుంటూ, ఎక్కువగా నీళ్లు తాగాలి. 6 నెలల లోపు చిన్నారులకు వారి ఆరోగ్యం కోసం పాలివ్వడమే ఉత్తమ పోషకాహారం. 6 నెలలు దాటిన పిల్లలకు పాలివ్వడంతో పాటు కాంప్లిమెంటరీ ఆహారం కూడా ఇవ్వవచ్చు. అలాగే పిల్లలకు రోజువారీ ఇమ్యూనైజేషన్ కూడా ఇవ్వాలి.
పిల్లల్లో మానసిక ఆరోగ్య ప్రాముఖ్యత
కొవిడ్-19 సమయంలో పిల్లల మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోవడం కూడా తల్లిదండ్రులకు చాలా ముఖ్యమైన పని. కొవిడ్-19 కారణంగా పిల్లలు కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ప్రభావితమవుతారు. వారిలో అలసట, ఒత్తిడి, చిరాకు, డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. తల్లిదండ్రులు పిల్లలకు అవసరమైనప్పుడల్లా వారితో సమయం గడిపి, వారికి ప్రోత్సాహాన్నిస్తూ వారిలో ఉత్తేజాన్ని పెంచాలి. వారి స్నేహితులతో వర్చువల్ విధానంలో కలిసేలా చేయడం, ఇండోర్ గేమ్స్ లాంటివి ఆడించడం చేస్తుండాలి.8
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.