Home /News /life-style /

HOW INDOOR AIR BE WORSE THAN OUTDOOR AIR POLLUTION AMID RISING AIR POLLUTION LEVELS MKS

ఇంటి గాలి యమ డేంజర్.. బయటి కాలుష్యం కంటే అదే ప్రమాదకరం ఎందుకు? Air pollution

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తాజా గణాంకాల ప్రకారం ఇంటి లోపల ఉండే వాయు కాలుష్య కారకాలు అనేక అనారోగ్య సమస్యలకు దారి తీశాయని నిరూపితమైంది. అయితే బయటి గాలి కంటే ఇంటి లోపల ఉండే గాలి ఎక్కువగా కలుషితమవుతుందా? ఇంటి లోపల ఉండే గాలి ఎంత ప్రమాదకరం? ఇంటి లోపల ఏ కాలుష్య కారకాలను ఉంటాయి? తదితర అంశాలు ఇప్పుడు చూద్దాం.

ఇంకా చదవండి ...
పెరుగుతున్న వాయు కాలుష్య స్థాయిలు తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా పరిణమిస్తున్నాయి. గాలిలోని కాలుష్య కారకాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. స్వచ్ఛమైన గాలి కరువై ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ కష్టంగా గాలి పీల్చుకోవలసిన పరిస్థితి వచ్చింది. కాలుష్య కోరల్లో చిక్కితే ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. బయట అడుగుపెట్టగానే ఎంతటి ప్రమాదకరమైన ధూళి కణాలు మనం నాసికా రంధ్రాలలోకి ప్రవేశిస్తున్నాయో అందరికీ తెలుసు. బయట గాలి మాత్రమే ప్రజల ఊపిరితిత్తులు, గుండె, కళ్లకు హాని చేస్తాయనుకుంటే పొరపాటే. ఎందుకంటే మన ఇళ్లలోని గదుల్లో ఉండే గాలి కూడా ఆరోగ్యానికి చాలా చేటు చేస్తుంది.

తాజా గణాంకాల ప్రకారం ఇంటి లోపల ఉండే వాయు కాలుష్య కారకాలు అనేక అనారోగ్య సమస్యలకు దారి తీశాయని నిరూపితమైంది. అయితే బయటి గాలి కంటే ఇంటి లోపల ఉండే గాలి ఎక్కువగా కలుషితమవుతుందా? ఇంటి లోపల ఉండే గాలి ఎంత ప్రమాదకరం? ఇంటి లోపల ఏ కాలుష్య కారకాలను ఉంటాయి? తదితర అంశాలు ఇప్పుడు చూద్దాం.

కాలుష్య కారకాలు ఇండోర్ వాయు కాలుష్యంని ఎలా ప్రభావితం చేస్తాయి?
గాలిలో ఉండే ఎలాంటి కాలుష్య కారకాలైనా లేదా రేణువులైనా మీరు పీల్చే గాలి నాణ్యతను తగ్గిస్తాయి. ఈ కారకాలు ఇంట్లో ఉన్నాయా లేదా బయట ఉన్నాయా అనేది అనవసరం. అవుట్‌డోర్ వాయు కాలుష్య స్థాయిలు సాధారణంగా చాలా ఆందోళన కలిగిస్తుంటాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా మనం మాస్క్ ధరిస్తుంటాం. అయితే ఇండోర్ గాలి నాణ్యత కూడా ఆందోళనకరంగా ఉండొచ్చు. ఇళ్లల్లో గాలి పీల్చినా జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. డబ్ల్యూహెచ్ఓ అంచనాల ప్రకారం, దాదాపు 8 మిలియన్ల మందిపై పేలవమైన ఇండోర్ గాలి నాణ్యత స్థాయిల వల్ల తీవ్ర ప్రభావం పడుతోంది. కాలుష్య సంబంధిత మరణాలలో సగానికి పైగా ఇండోర్ కాలుష్యం కారణంగానే సంభవించాయి.

ఇంటి లోపలి గాలి నాణ్యత తక్కువగా ఉండటానికి ప్రధాన కారకాలు ఏంటి?
గ్రామీణ ప్రాంతాల్లో కలప మండించడం, ఇంధన వనరులను ఉపయోగించడం వల్ల ఇండోర్ వాయు కాలుష్యం పెరుగుతుంది. బొగ్గులపై ఆహారాన్ని నేరుగా వండడం, బహిరంగ ఇంధనంపై కలప వ్యర్థాలు వేసి కాల్చడం వల్ల గాలిలో కాలుష్య కారకాలను విడుదలవుతాయి. ఫర్నిచర్‌పై ఉపయోగించే పెయింట్‌లు, క్లీనింగ్ ప్రొడక్ట్స్, ఇంధనాలు, నిర్మాణంలో ఉపయోగించే నిర్మాణ వస్తువులు, కొవ్వొత్తులు, గ్యాస్ స్టవ్‌లు, ఇంటి లోపల ధూమపానం చేయడం వల్ల హానికరమైన వాయువులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. పైన పేర్కొన్న వస్తువుల వల్ల NOx, SO2, O3, PM, సెమీ- వోలటైల్ కర్బన సమ్మేళనాలు (VOCs) వంటి విష రసాయనాల సైలెంట్ గా ఇంట్లో విడుదలవుతాయి. ఇవన్నీ ఆరోగ్యానికి హానికరమేనని నిపుణులు చెబుతున్నారు.

కాలుష్య స్థాయిలు ఆరుబయట కంటే ఇంటి లోపల మరింత ప్రమాదకరంగా ఉంటాయా?
ఆరుబయట ఉండే గాలి శ్వాసకోశ సమస్యలు, కొమొర్బిడిటీలతో బాధపడేవారిలో తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుంది. షాకింగ్ విషయం ఏమిటంటే.. కొన్నిసార్లు, ఇండోర్ వాయు కాలుష్య కారకాలు బయటి స్థాయిల కంటే 2-5 రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇండోర్ కాలుష్య కారకాల సాంద్రత మరింత మందంగా ఉంటుంది. వెంటిలేషన్ సరిగా లేకపోతే ఇంట్లో ఉన్న గాలి కారకాలు మరింత ప్రమాదకరంగా మారి తీవ్ర అనారోగ్యాలను తెచ్చిపెడతాయి. అయితే ఇలా ప్రతిసారీ ప్రతి ఇంట్లో జరగకపోవచ్చు కానీ దీని గురించి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఇది ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
పూర్ ఎయిర్ క్వాలిటీ శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది. దగ్గుకు మించిన అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఇండోర్ వాయు కాలుష్యాలు, క్షీణిస్తున్న గాలి నాణ్యత తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇస్కీమిక్ (ischemic) గుండె జబ్బులు, స్ట్రోక్, అరిథ్మియా, ఊపిరితిత్తుల వ్యాధులు ఇండోర్ ఎయిర్ వల్ల వచ్చే ప్రమాదం ఉంది. క్యాన్సర్, ఆస్తమా, ఊపిరితిత్తులు, గుండె జబ్బులతో బాధపడేవారిలో లక్షణాలు తీవ్రతరం అవుతాయి.

ఇంటి లోపల గాలిని సురక్షితంగా చేయడం ఎలా?
గాలిని శుభ్రపరచడానికి, దానిని మరింత స్వచ్ఛంగా మార్చడానికి శుద్ధి లేదా ఫిల్టర్ చేయాలి. వెంటిలేషన్ శుభ్రంగా ఉంచుకోవాలి. సూర్యరశ్మి లోపలికి వచ్చేలా కిటికీలను ఏర్పాటు చేయాలి. ఇంట్లో ఎయిర్ క్వాలిటీ ప్యూరిఫైయర్‌లను ఇన్‌స్టాల్ చేయడం వల్ల గాలిలోని విషపూరిత సమ్మేళనాలు, రసాయనాలను ఫిల్టర్ చేయవచ్చు. శ్వాసకోస, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నట్లయితే తప్పనిసరిగా ప్యూరిఫైయర్‌లను ఇన్‌స్టాల్ చేయాలి. గాలిని శుద్ధి చేసే ప్లాంట్లను కూడా ఉపయోగించుకోవచ్చు. కాలుష్యాన్ని పెంచే క్లీనింగ్ ప్రొడక్ట్స్ తక్కువగా ఉపయోగించడం, కాలుష్యానికి కారణం కాని పద్ధతిలో వంట చేయడం ద్వారా స్వచ్ఛమైన గాలి ఇంట్లో ఉండేలా చేయవచ్చు.
Published by:Madhu Kota
First published:

Tags: Air Pollution, Health

తదుపరి వార్తలు