Beauty tips: చర్మ సంరక్షణకు సన్​ స్క్రీన్​ లోషన్​ వాడితే ఎంతవరకు ఫలితం ఉంటుంది?.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

చర్మం ఎప్పుడూ కూడా పొడిబారి పోకుండా ఎప్పటికప్పుడు హైడ్రేట్ గా ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా చేస్తే చర్మం పువ్వులా వికసిస్తుంది.

  • Share this:
    కరోనా (Corona) కారణంగా బ్యూటీ పార్లర్లు (beauty parlor), సెలూన్లు చాలా రోజుల వరకు మూసే ఉన్నాయి. అయితే చర్మంపై జాగ్రత్తలు తీసుకునే వారు మాత్రం ఇంట్లోనే బ్యూటీ ట్రీట్​మెంట్లను, పద్దతులను తయారు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు పార్లర్లు తెరిచినా చాలామంది వాటికి వెళ్లడానికి చాలామంది భయపడుతున్నారు. ఎవరి వల్ల కరోనా వస్తుందో అన్న అనుమానం కూడా దీనికి కారణం. ఇంట్లోనే కొన్ని సులభమైన టిప్స్ (simple beauty tips) పాటిస్తూ అందాన్ని సులువుగా కాపాడుకోవచ్చు.

    చర్మానికి (skin) ఎలాంటి హాని జరగకుండా పువ్వులా వికసించాలంటే హైడ్రేషన్ (hydration) అనేది చాలా ముఖ్యం. మన చర్మం ఎప్పుడూ కూడా పొడిబారి పోకుండా ఎప్పటికప్పుడు హైడ్రేట్ గా ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా చేస్తే చర్మం పువ్వులా వికసిస్తుంది. ఇక చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌ (moisturizer)ని రెగ్యులర్ గా వాడటం వల్ల స్కిన్ కి నేచురల్ గ్లో అనేది చాలా ఈజీగా పెరుగుతుంది.

    ఇక డ్రై స్కిన్ తో బాధ పడేవాళ్లకి  క్రీం బేస్డ్ మాయిశ్చరైజర్ (moisturizer) ఇంకా ఆయిల్ ఉండే వాటిని వాడటం మంచిది. ఆయిల్ ఇంకా కాంబినేషన్ స్కిన్ అయితే జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ (jel based moisturizer) వాడటం ఎంతో మంచిదట. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మంచి సన్ స్క్రీన్ లోషన్ (sun screen lotion) తప్పనిసరిగా వాడాలి. అలా సన్ స్క్రీన్ లోషన్ వాడుకోవడం అనేది చర్మానికి (skin) చాలా మంచిదట. సూర్య కిరణాల కారణంగా స్కిన్ పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్‌గా సన్ స్క్రీన్ ని వాడటం మంచిదట.

    ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?

    కనీసం నెలకోసారి అయినా ముఖానికి ఫేస్ ప్యాక్ (face pack) వేసుకోవడం అవసరం.  మన కిచెన్ లో లభించే వస్తువులతో ఫేస్ ప్యాక్ (face pack) వేసుకోవచ్చు. వీటివల్ల ఖర్చు తగ్గడంతో పాటు ముఖం కూడా మెరుస్తూ కనిపిస్తుంది.

    ఎప్పుడూ కూడా సన్ స్క్రీన్ (sun screen) వాడేటప్పుడు ఎస్పీఎఫ్ 30 కంటే ఎక్కువ ఉండే వాటిని వాడటం మంచిది. ఒకవేళ ఇంట్లో ఉన్నా సరే సన్ స్క్రీన్ లోషన్ (sun screen lotion) రాసుకోవడం చాలా మంచిది. ఇలా రోజు రెగ్యులర్ గా మీరు సన్ స్క్రీన్ లోషన్ ని వాడటం వల్ల మీ చర్మం (skin) అందంగా, షైనీగా ఇంకా పువ్వులా ఎప్పటికి వికసిస్తూ ఉంటుంది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)



    ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి



    ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి
    Published by:Prabhakar Vaddi
    First published: