Cancer Day 2021: రొమ్ము క్యాన్సర్‌లో స్టేజ్‌లు ఎన్ని.. వాటిని గుర్తించడం ఎలా?

Cancer Day 2021: రొమ్ము క్యాన్సర్‌లో స్టేజ్‌లు ఎన్ని.. వాటిని గుర్తించడం ఎలా?

ప్రతీకాత్మక చిత్రం

Breast Cancer Stages: రొమ్ము కణాలలో అభివృద్ధి చెందే క్యాన్సర్‌ను రొమ్ము క్యాన్సర్ అంటారు. ఈ రకమైన క్యాన్సర్ మహిళలతో పాటు పురుషుల్లోనూ సంభవిస్తుంది.

  • Share this:
    ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రేటు వేగంగా పెరుగుతోంది. అన్ని వయస్సుల మహిళల్లోనూ ఈ క్యాన్సర్ సంభవిస్తుండటంతో దీనిపై అవగాన పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. క్యాన్సర్ తీవ్రత దృష్ట్యా ఈ క్యాన్సర్ను 5 దశలుగా వర్గీకరించవచ్చు. అవేంటో తెలుసుందాం. రొమ్ము కణాలలో అభివృద్ధి చెందే క్యాన్సర్‌ను రొమ్ము క్యాన్సర్ అంటారు. ఈ రకమైన క్యాన్సర్ మహిళలతో పాటు పురుషుల్లోనూ సంభవిస్తుంది. కాని మహిళలతో పోలిస్తే రొమ్ము క్యాన్సర్‌కు గురయ్యే పురుషుల సంఖ్య చాలా తక్కువ. WHO ప్రకారం, ప్రతి ఏడాది సుమారు 2.1 మిలియన్ల మంది మహిళలు రొమ్ము క్యాన్సర్కు గురవుతున్నారు.

    అత్యధిక క్యాన్సర్ సంబంధిత మరణాల్లో దీని వల్లే ఎక్కువ మంది మహిళలలు మరణిస్తున్నారని అధ్యయనాల్లో తేలింది. రొమ్ము క్యాన్సర్ని ముందుగానే గుర్తించగలిగేలా మహిళలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. ప్రారంభంలోనే దీన్ని గుర్తించగలిగితే వేగంగా దీని నుంచి బయటపడి ప్రాణాలను రక్షించుకోవచ్చు. క్యాన్సర్ ఎంత వ్యాపించిందనే దాని ఆధారంగా రొమ్ము క్యాన్సర్ను ఐదు దశలుగా విభజించవచ్చు.

    స్టేజ్ 0
    ఈ దశలో, క్యాన్సర్ను గుర్తించడం కష్టం. ఈ దశలో, క్యాన్సర్ ఇతర కణజాలాలను ప్రభావితం చేయకుండా రొమ్ముల నాళాలకు పరిమితం చేయబడింది. కాబట్టి, ఈ దశను డక్టల్ కార్సినోమా ఇన్ సిటు (DCIS) గా సూచిస్తారు.

    స్టేజ్ 1
    కణితి ఏర్పడే ప్రాధమిక దశ ఇది. ఈ దశలో కణితి పరిమాణం 2 సెంటీమీటర్ల వెడల్పు లేదా అంతకంటే తక్కువ వెడల్పు ఉన్న కణితి తయారవుతుంది. ఈ దశలో క్యాన్సర్ కణాలు ఎక్కువ అభివృద్ధికి చెందడానికి అవకాశం ఉంది.

    స్టేజ్ 2
    ఈ దశలో కణతి సుమారు 2 సెంటీమీటర్లు వెడల్పు ఉండి సమీపంలోని 1-3 శోషరస కణుపులను ప్రభావితం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో, శోషరస కణుపులను ప్రభావితం చేయకుండా కణితి పరిమాణం 2-5 సెంటీమీటర్ల మధ్య ఉంటుంది.

    స్టేజ్ 3
    క్యాన్సర్ వేర్వేరు ఆక్సిలరీ శోషరస కణుపులకు వ్యాపిస్తుంది. ఈ దశలో కణితి పరిమాణం మారవచ్చు. ఇతర సందర్భాల్లో కణితి పరిమాణం 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉండి 1-3 ఆక్సిలరీ శోషరస కణుపులను ప్రభావితం చేస్తుంది.

    స్టేజ్ 4
    క్యాన్సర్ తీవ్రంగా వ్యాపించే అవకాశమున్న చివరిదశ. ఈ దశ కాలేయం, ఊపిరితిత్తులు లేదా మెదడు వంటి సుదూర అవయవాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది ఎముకలకు కూడా హాని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే నిర్ధారించడానికి ప్రతి స్త్రీ కనీసం ఒక్కసారైనా మామోగ్రఫీని చేయించుకోవాలిని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు