Home /News /life-style /

Horoscope Today: డిసెంబరు 2 రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి అప్పుల కష్టాలు తీరుతాయి..

Horoscope Today: డిసెంబరు 2 రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి అప్పుల కష్టాలు తీరుతాయి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Today Horoscope: నేడు గురువారం (డిసెంబర్ 2).. ఇవాళ పలు రాశుల వారికి చాలా బాగుంది. అనుకున్నవన్నీ జరుగుతాయి. కానీ మరికొందరు మాత్రం జాగ్రత్తగా ఉండలి. వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది. మేషం నుంచి మీన రాశి వరకు.. ఇవాళ ఎవరికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  కాలజ్ఞానం

  డిసెంబరు 2, 2021

  దినఫలాలు

  మేషం (Aries)(అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలుంటాయి. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం పరవాలేదు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

  వృషభం (Taurus)(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) గ్రహస్థితి బాగా అనుకూలంగా ఉంది. కొన్ని ప్రయత్నాలు నెరవేరుతాయి. అదృష్ట యోగం ఉంది. ఉద్యోగంలో ఉత్తమ స్థితి కనిపిస్తోంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటు ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

  మిథునం (Gemini)(మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఉద్యోగంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. శుభవార్తలు వింటారు. ఇంటా బయటా శ్రమ పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు బాగుంది. ఆరోగ్యం పరవాలేదు.

  లక్ష్మీదేవి కరుణకు తులసి వద్ద ఈ ఒక్క ఉపాయం చేయాలి...

  కర్కాటకం (Cancer)(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక, రాజకీయ రంగాలవారికి బాగుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. భాగస్వాములతో విభేదాలు పరిష్కారమవుతాయి. రుణాలు తీరుస్తారు. ఉద్యోగంలోను, వ్యాపారంలోను మంచి అభివృద్ధి కనిపిస్తోంది. ఒక గడ్డు సమస్య నుంచి బయటపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరో గ్యం జాగ్రత్త.

  సింహం (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1) ఇంటా బయటా సానుకూల పరిస్థితులుంటాయి. ఈ రోజు మీకు అంతా మంచే జరుగుతుంది. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల సలహాలు పట్టించుకోండి.

  కలలో మీకు పిల్లలు ఇలా కనబడితే ఏం జరగుతుందో తెలుసా?

  కన్య (Virgo)(ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) గట్టి పట్టుదలతో అనుకున్నవి సాధిస్తారు. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. బంధువుల రాకపోకలుంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

  తుల (Libra)(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ప్రస్తుతం మీకు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో శ్రమకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభి స్తుంది. పెళ్లి కుదిరే అవకాశం ఉంది. అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి. ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. బంధుమిత్రుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం పరవాలేదు.

  వృశ్చికం (Scorpio)(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) ఉద్యోగంలో శ్రమ ఎక్కువగా ఉన్నా మేలు జరుగుతుంది. ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణ సూచనలున్నాయి. కొన్ని కష్టాల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాల వారికి చేతి నిండా పని ఉంటుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.

  ఇంటిని శుభ్రం చేశాక వ‌చ్చే మురికి నీరు శ‌రీరంపై ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పడకూడదు..

  ధనస్సు (Sagittarius)(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) మానసికంగా, శారీరకంగా ఒత్తిడి ఉన్నా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ముఖ్యంగా కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాలపరంగా లాభాలున్నాయి. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతానానికి సంబంధించి శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో అనుకూల సమాచారం అందుతుంది.

  మకరం (Capricorn)(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ముఖ్యమైన పనుల్లో కొన్నిటిని శ్రమ మీద పూర్తి చేస్తారు. పరిస్థితులు వ్యతిరేకంగా కనిపించినా పట్టుదలగా ముందడుగు వేయండి. పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు. సన్నిహితుల సూచనలు కూడా అవసరం అని గ్రహించండి. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం వస్తుంది.

  అద్భుతం.. ఈ 4 రాశులు త్వరల్ రిచ్ అవ్వడం ఖాయం.. మీ రాశీ ఇదేనా?

  కుంభం (Aquarius)(ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగానికి సంబంధించి మంచి కబురు తెలుస్తుంది. తెలిసినవారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. మిత్రులకు సహాయం చేస్తారు.

  మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4) ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగినా ఇబ్బందేమీ ఉండదు. ముఖ్యమైన పనుల్లో త్వరితగతిన విజయాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారులు విజ యాలు సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. ఎవరికీ హామీలు ఉండొద్దు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashifal, Rasi phalalu, Zodiac sign

  తదుపరి వార్తలు