నెయ్యిని ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.. ఎలాగో చూడండి

భారతీయులు భోజన ప్రియులు. ఉత్తరాది, దక్షిణాది, పాశ్చాత్య వంట ఎలాంటిదైనా గుటకలేసుకుంటూ మరీ లాగేస్తుంటారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో రకరకాల కూరలతో పాటు పచ్చళ్లు ఆహారంలో కీలక పాత్ర పోషిస్తాయి.

news18-telugu
Updated: September 20, 2020, 1:34 PM IST
నెయ్యిని ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.. ఎలాగో చూడండి
నెయ్యి
  • Share this:
భారతీయులు భోజన ప్రియులు. ఉత్తరాది, దక్షిణాది, పాశ్చాత్య వంట ఎలాంటిదైనా గుటకలేసుకుంటూ మరీ లాగేస్తుంటారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో రకరకాల కూరలతో పాటు పచ్చళ్లు ఆహారంలో కీలక పాత్ర పోషిస్తాయి. కూర లేనప్పుడు కూరలాగా.. పెరుగులో ఊరగాయలా ఉపయోగపడుతుంది. అయితే ఈ పచ్చడి వేసుకున్నప్పుడు నెయ్యి తప్పనిసరిగా ఉండాల్సిందే. నెయ్యి రుచి ఎందులోనూ దొరకదు. అందుకే ఇంట్లో దీన్ని విరివిగా వాడుతుంటారు. అయితే అప్పటికప్పుడు నెయ్యి దొరకదు కాబట్టి దాన్ని మార్కెట్లో కొనుగోలు చేస్తుంటారు. అయితే నెయ్యిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి నెయ్యిని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

అవసరమైన పదార్ధాలు..

-వెన్న ఎక్కువగా ఉన్న పాలు
-పెరుగు
-చల్లటి నీరు
-ఐస్ ముక్కలు

నెయ్యి తయారీ విధానం..-పచ్చి పాలను పెనంలో పోసి సన్నని మంటపై వేడి చేయాలి. పాలు బాగా మరిగే వరకు వేచి ఉండాలి.
-అనంతరం స్టవ్ కట్టేసి పాలు పూర్తిగా చల్లారే వరకు ఎదురుచూడాలి.
-ఇప్పుడు ఆ పాలపై ఉన్న తేలాడుతున్న మీగడను ఓ పాత్రలో సేకరించాలి. -అనంతరం ఆ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో ఉంచుకోవాలి.
-ఈ విధంగా 10 నుంచి 15 రోజుల పాటు చేయాలి. ఫ్రిజ్ లో సేకరించిన మిశ్రమాన్ని గది ఉష్ణోగ్రత వద్దకు తీసుకొచ్చి పెద్ద పాత్రలో వేయాలి.
-ఆ మీగడకు పెరుగును జోడించి బాగా కలపాలి. (మూడు కప్పుల మిశ్రమాన్ని రెండు టేబుల్ స్పూన్ల పెరుగును జోడించాలి)
-మీగడకు పెరుగు కలిపిన మిశ్రమాన్ని 6 నుంచి 8 గంటల నిల్వచేయాలి.
-అనంతరం ఆ మిశ్రమంలో చల్లటి నీటిని, ఐస్ ముక్కలను కలపాలి.
-ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్లెండర్ ను ఉపయోగించి వెన్న తేలాడే వరకు ఆ మిశ్రమాన్ని వేడిచేయాలి. అనంతరం పైన తేలాడుతున్న వెన్నను చిన్న బంతి ఆకారంలో వేసి గిన్నేలో ఉంచాలి.
-ముద్దగా చేసిన వెన్నను నీటి గిన్నేలో కడగాలి.
-అనంతరం ముద్దగా చేసిన వెన్నను పెనంలో వేసి తక్కువ మంటపై వేడి చేయాలి.


ఈ విధంగా 45 నిముషాల పాటు వేడి చేయాలి. అనంతరం పూర్తిగా వెన్న కరిగిన తర్వాత మస్లీన్ వస్త్ర ద్వారా ఆ మిశ్రామాన్ని వడకట్టాలి. ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని కంటైనర్ లో నెయ్యి పోయాలి. మీరు దీన్ని రెండు నెలల వరకు ఉపయోగించుకోవచ్చు.
Published by: Sumanth Kanukula
First published: September 20, 2020, 1:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading