Reduce To Hiccups: ఎక్కిళ్లు ఎక్కువగా వస్తున్నాయా.. అయితే ఈ చిట్కాలను ట్రై చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

Reduce To Hiccups: ఎక్కువమందికి ఎక్కిళ్లు తరచుగా వస్తుంటాయి. వీటికి కారణం ఛాతి అడుగున ఉండే డయాఫ్రమ్ అసంకల్పితంగా స్పందించినపుడు కలిగే శారీరక మార్పే ఈ ఎక్కిళ్ళు. ఇలా జరటానికి చాలా కారణాలున్నాయి. అయితే, ఎక్కిళ్లు రాకుండా ఉండాలంటే ఎక్కిళ్లను ప్రేరేపించే విషయాలకు, తినుబండరాలకు దూరంగా ఉంటే చాలు. అయితే ఎక్కిళ్లు వస్తే ఏం చేయాలో కూడా ఇక్కడ తెలుసుకుందాం..

 • Share this:
  ఎక్కిళ్లు(Hiccups) ప్రతి ఒక్కరికీ వస్తుంటాయి. కొంతమందికి ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి. మరికొంత మందికి చాలా సమయం వరకు ఉండి తెగ ఇబ్బంది పెడతాయి. తినే సమయంలో అయితే ఆ బాధ మాటల్లో చెప్పలేము. ఎక్కిళ్లు అనేవి జబ్బు కాదు. ఎక్కిళ్లు దీర్ఘకాలంగా ఉన్నా ప్రమాదం లేదు. అయితే ఎక్కిళ్లు వచ్చినపుడు ఇబ్బందిగా, విసుగ్గా ఉంటుంది. సాధారణంగా.. ఎక్కిళ్ళు కాసేపటి తరువాత ఆగిపోతాయి. వీటిని తగ్గించుకునేందుకు కొన్ని ఇంటి చిట్కాలు త్వరగా సమస్యని తగ్గిస్తాయి. ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే ఈ ఎక్కిళ్లను త్వరగా తగ్గించుకోవచ్చు. ఎక్కిళ్లు వస్తే అంత త్వరగా తగ్గవు. ఇవి వచ్చాయంటే చాలు.. మాట కష్టంగా ఉంటుంది. ఇబ్బందిగానే ఉంటుంది. వీటిని తగ్గించుకునేందుకు ఎలాంటి మందులు ఉండవు. వీటిని కొన్ని చిట్కాలు వాడడం వల్ల ఈ సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  Sneezing: కళ్లు తెరిచి తుమ్మితే కనుగుడ్లు బయటకు వస్తాయా.. పరిశోధనలో ఏం తేలింది..


  ముందుగా ఎక్కిళ్లు పోవాలంటే సడన్‌గా భయాందోళనలు కల్గించే మాటలు గానీ, షాకింగ్‌ న్యూస్‌ గానీ చెప్పటం వలన ఎక్కిళ్లు వెంటనే తగ్గుతాయని చాలా మందికి తెలుసు. ఎందుకంటే మన మెదడు ఆ న్యూస్‌కి రియాక్ట్‌ అయి వెంటనే స్పందిస్తుంది. వీటిని సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. ఇవి కాకుండా ఇంటి రెమిడీస్ కూడా ఉన్నాయి. శొంఠి, ఎక్కిళ్లకు మంచిగా పని చేస్తుంది. శొంఠిని పొడిచేసి బెల్లంతో కలిపి పీలిస్తే ఎక్కిళ్లు తగ్గుముఖం పడతాయి.

  Remove Lizards From Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..


  శ్వాసను ఆపుకోవడం వల్ల..
  ఎక్కిళ్ళను తగ్గించేందుకు ఉపయోగపడే అత్యంత సులభమైన మార్గం శ్వాసను కాసేపు నొక్కిపెట్టకుని ఉండడం. అంటే ముందుగానే ఎక్కువగా గాలి పీల్చుకొని ఉంచుకోవాలి. అప్పడు ముక్కును, నోటిని బలవంతంగా నొక్కి పట్టుకోవాలి. ఇలా శ్వాసని కంట్రోల్ చేయడం ద్వారా ఉపిరితిత్తుల్లో కార్బన్ డయాక్సైడ్ పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల డయాఫ్రమ్ రిలాక్స్ అవుతుంది. తద్వారా ఎక్కిళ్ళు తగ్గుతాయి. ఎక్కిళ్లు తగ్గేవరకూ ఇలా చేస్తూనే ఉండండి.

  అయితే వెంట వెంటనే చేయకూడదు. కాస్తా సమయం మధ్యలో తీసుకుంటూ చేయాలి. ఇలా చేయడం వల్ల త్వరగా సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. కాగితపు బ్యాగ్ లో శ్వాసని తీసుకోవడం ద్వారా కూడా వచ్చిన ఎక్కిళ్ళను కంట్రోల్ చేయవచ్చు. పేపర్ బ్యాగ్ లో శ్వాస తీసుకుంటే రక్తంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి పెరుగుతుంది. దీని వల్ల డయాఫ్రమ్ లో ఉండే నొప్పి తగ్గుతుంది.

  Weight Loss Tips : త్వరగా బరువు తగ్గాలా.. అయితే ఈ 6 మర్పులు చేయండి..


  చల్లని నీరు తాగితే..
  చల్లటి నీళ్లను కొంచెం కొంచెం సిప్ చేస్తే ఎక్కిళ్ల సమస్య తగ్గించుకోవచ్చు. ఇది ఎంతో చాలా సులభమైన పద్ధతి. చల్లటి నీళ్లను నొట్లో పుక్కిలించడం ద్వారా కూడా ఎక్కిళ్లు ఉపశమనం పోందవచ్చు. ఎక్కిళ్లు ఎక్కువగా ఇబ్బంది పెడితే నీటిని తాగమని చెబుతుంటారు. అయితే, ఈ నీరు కూడా మామూలు నీరు కంటే చల్లని నీరు తాగితే సమస్య త్వరగా తగ్గుతాయి. ఈ నీటిని ఎక్కువగా తాగుతుండాలి. ఇలా చేస్తుంటే ఎక్కిళ్లు త్వరగా తగ్గిపోతాయి. ఎక్కిళ్లు తగ్గేవరకు కొద్దికొద్దిగా నీటిని తాగుతుండాలి..

  Daily Walking Tips: మీరు ఆరోగ్యంగా ఉండాలంటే నడకలో ఇలాంటి మార్పులు చేయండి.. వివరాలు తెలుసుకోండి..


  నీరు, తేనె మిశ్రమం..
  తేనె తీసుకోవడం ద్వారా కూడా ఎక్కిళ్ళ బాధను తగ్గించుకోవచ్చు. టీస్పూన్ తేనెని గోరువెచ్చని నీళ్లలో కలిపి, ఆ మిశ్రమాన్ని తీసుకుంటే ఎక్కిళ్ళు తగ్గే అవకాశాలు ఉన్నాయి.అయితే, చల్లని నీటికి కాసింత తేనెని కలిపి ఆ నీటిని ముందుగా పుకిలించండి.. ఇలా చేస్తుంటే త్వరగా ఎక్కిళ్లు తగ్గుతాయి.

  ఐస్ ముక్కలు కూడా..
  అదే విధంగా ఐస్ క్యూబ్స్ కూడా బాగా పనిచేస్తాయి. ఎక్కిళ్లు తగ్గాలంటే.. ఓ చిన్న ఐస్ క్యూబ్‌ని నోటిలో పెట్టుకుని నోటితో ఆ నీటిని పీలుస్తూ ఉండాలి. ఇలా చేస్తుంటే త్వరగా ఎక్కిళ్లు తగ్గుతాయి.

  పంచదారతో పరార్..
  ప్రతీ ఇంట్లో పంచదార అనేది ఉంటుంది. ఓ చెంచా చక్కెరను తీసుకుని నోట్లో వేసుకోవాలి. వేసుకున్న వెంటనే నమలకుండా.. నోట్లోనే ఎక్కువ సేపు ఉంచుకోవాలి. మెల్లిగా అందులోనుంచి వచ్చే రసాన్ని మింగుతూ ఉండాలి. ఇలా చేస్తుంటే త్వరగా ఎక్కిళ్లు తగ్గుతాయి. పంచదార తినడం వల్ల వేగస్ నరం ఉత్తేజానికి గురవుతుంది. ఇలా చేయడం వల్ల మీ మెదడుని ఎక్కిళ్ల గురించి మరిచిపోయేలా చేస్తుంది. మెదడుకు, కడుపుకు కనెక్ట్ అయి ఉన్న నరంపై చక్కర ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ చిట్కా పని చేస్తుంది.

  Sexual Wellness: కరోనా సమయంలో శృంగారంలో పాల్గొంటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..!


  ఇంట్లో నిమ్మాకాయ ఉందా.. అయితే ఇలా చేయండి..
  ఎన్నో అద్భుత గుణాలు ఉండే నిమ్మకాయను తీసుకోవడం వల్ల త్వరగా ఎక్కిళ్లు తగ్గుతాయి. నిమ్మ రుచి నరాలను ప్రభావితం చేస్తుంది. దీంతో సమస్య త్వరగా తగ్గుతుంది. ఇందుకోసం ఓ చెంచా నిమ్మరసం తీసుకోవాలి. ఈ రసాన్ని అలానే మింగండి.. ఇలానే కాకుండా నిమ్మ ముక్కపై ఉప్పు వేసి ఆ రసాన్ని పీల్చుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కూడా త్వరగా ఎక్కిళ్లు తగ్గుతాయి. చిన్న నిమ్మకాయ ముక్కను తీసుకొని మీ నాలికపై పెట్టుకొని పీల్చడం ద్వారా వచ్చే పులుపు ఎక్కిళ్ళను తగ్గించవచ్చు.

  ఛాతిని మోకాలి వరకు లాగడం ద్వారా కూడా ఎక్కిళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు. మోకాలపైకి ఛాతిని లాగి అలా కాసేపు ఉంచాలి. కొద్దిసేపటి తర్వాత దాన్ని వదిలివేయాలి. ఈ విధంగా చేయడం వల్ల డయాఫ్రమ్ మీద పడిన ఒత్తిడి కూడా తగ్గుతుంది.

  Pregnant Women: కరోనా వైరస్‌తో గర్భిణీలకు ముప్పే.. ఐసీఎంఆర్ అధ్యయనంలో షాకింగ్ నిజాలు..


  ఇప్పటినుంచి ఎక్కిళ్ళు వస్తే వీటిలో ఏ చిట్కా అయినా పాటించడానికి ట్రై చేయండి. దాంతో, ఎక్కిళ్ల బాధ నుంచి మీకు విముక్తి కలుగుతుంది. ఎక్కిళ్లు రాకుండా ఉండాలంటే ఎక్కిళ్లను ప్రేరేపించే విషయాలకు, తినుబండరాలకు దూరంగా ఉంటే చాలు. అవేంటంటే.. మద్యం, సిగరెట్లు తాగకూడదు. శీతలపానీయాలకు దూరంగా ఉండాలి. హఠాత్తుగా ఆందోళనకు గురికావడం, హఠాత్తుగా ఉత్తేజితమవటం వంటివి చేయరాదు. వేగంగా తినే అలవాటును మార్చుకోవాలి. ఎక్కువ తినడం, తాగడాన్ని తగ్గించుకోవాలి.
  Published by:Veera Babu
  First published: