హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

టైప్ 2 డయాబెటిస్‌ సహజసిద్ధంగా తగ్గాలా? ఈ జ్యూస్ తాగండి... ఆరోగ్య ప్రదాయిని

టైప్ 2 డయాబెటిస్‌ సహజసిద్ధంగా తగ్గాలా? ఈ జ్యూస్ తాగండి... ఆరోగ్య ప్రదాయిని

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

World Diabetes Day : బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని సహజ సిద్ధంగా తగ్గించుకోవాలంటే... మీ డైట్‌లో తక్కువ కేలరీలు ఉండే క్యారట్లను చేర్చుకోండి అంటున్నారు పరిశోధకులు. ఎందుకో తెలుసుకుందాం.

ఈ రోజుల్లో మనం తినే ఆహారం వల్ల సరిగా కంట్రోల్ చేసుకోలేకపోతే టైప్ 2 డయాబెటిస్‌ వల్ల చాలా సమస్యలు వస్తాయి. మందులు వాడటంతోపాటూ... మన డైట్‌లోనూ కొన్ని మార్పులు చేసుకుంటే మంచిదే. పుష్కలంగా పోషకాలు ఉండి, తక్కువ ఫ్యాట్, తక్కువ కేలరీలు ఉండే ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. అదే సమయంలో సమమైన బరువు కలిగి... ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉంటే... బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. తద్వారా డయాబెటిస్ వల్ల తలెత్తే సీరియస్ ప్రాబ్లమ్స్ నుంచీ బయటపడొచ్చు. అలాంటి ఆహారాల్లో ఒకటి క్యారట్ జ్యూస్. దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో, డయాబెటిస్‌ను ఇది ఎలా కంట్రోల్ చేస్తుందో తెలుసుకుందాం.

గ్లూకోజ్ లెవెల్స్‌ను కంట్రోల్ చెయ్యడానికి సరిపడా ఇన్సులిన్ మన శరీరంలో ఉత్పత్తి కాకపోతే... మనకు టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. ఇన్సులిన్ అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్‌ ఎక్కువా, తక్కువా కాకుండా మెయింటేన్ చేస్తూ ఉంటుంది. క్యారెట్ల వంటి ఆహారం తీసుకుంటే... బ్లడ్ షుగర్ లెవెల్స్ మరీ ఎక్కువా, మరీ తక్కువా కాకుండా కంట్రోల్‌లో ఉంటాయి.

క్యారట్లు ఎలా పనిచేస్తాయి : టైప్ 2 డయాబెటిస్‌ను అడ్డుకునే యాంటీఆక్సిడెంట్స్ క్యారట్లలో ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని పెంచుతాయి. కాలిఫోర్నియాలోని స్టాండ్‌ఫోర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో పరిశోధకులు కొన్ని అధ్యయనాలు చేశారు. కేరట్లలోని బీటా కెరోటిన్ అనే పదార్థం... టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గిస్తోందని తెలిసింది. మన శరీరం ఈ బీటా కెరోటిన్‌ను విటమిన్ A తరహా పోషకంగా మార్చుకుంటుంది. ఐతే... డయాబెటిస్‌కీ విటమిన్ Aకీ సంబంధం ఏంటన్నది పరిశోధనలో తేలలేదు. ఇది బీటా కణాల్లో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుందని స్వీడన్‌లోని లండ్ యూనివర్శిటీ డయాబెటిస్ సెంటర్‌లో పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

స్టాండ్‌ఫోర్డ్ యూనివర్శిటీ సైంటిస్టుల పరిశోధనలో మరో విషయం కూడా తెలిసింది. వెజిటబుల్ ఆయిల్స్, నట్స్, సీడ్స్, గోధుమల్లో ఉండే విటమిన్ E నుంచీ తయారయ్యే గమ్మా-టోకోఫెరాల్... టైప్ 2 డయాబెటిస్‌ పెరిగేందుకు కారణమవుతోంది. అందువల్ల టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లు ఇలాంటి ఆహారానికి వీలైనంత దూరంగా ఉంటే మంచిదే.

క్యారట్ జ్యూస్ ఎంత తీసుకోవాలి : సిడ్నీ యూనివర్శిటీ పరిశోధకుల ప్రకారం రోజూ 250ml క్యారట్ జ్యూస్ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. క్యారట్లలో కొద్దిగా షుగర్, పిండి పదార్థాలు ఉన్నప్పటికీ అవి డయాబెటిస్‌పై వ్యతిరేక ప్రభావం చూపవని తేలింది. అందువల్ల టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారు... క్యారట్ జ్యూస్ ట్రై చేయవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.

First published:

Tags: Health Tips, Life Style, Tips For Women

ఉత్తమ కథలు