Home /News /life-style /

HOME REMEDIES TO TREAT FRIZZY HAIR DURING MONSOONS UMG GH

Frizzy Hair: వర్షాకాలంలో జుట్టు చిక్కులు పడుతోందా.. ఇలా చెక్ పెట్టండి..!

వర్షాకాలంలో జుట్టు చిక్కులు పడుతోందా.. ఇలా చెక్ పెట్టండి..!

వర్షాకాలంలో జుట్టు చిక్కులు పడుతోందా.. ఇలా చెక్ పెట్టండి..!

వర్షాకాలంలో కురులను సంరక్షించుకోకపోతే జుట్టు చిట్లడంతో సహా జుట్టు రాలే సమస్యలు కూడా తప్పవు. జుట్టు కూడా విపరీతంగా చిక్కులు (Frizzy Hair) కడుతుంది. అప్పుడు కురులు అందవిహీనంగా కనిపిస్తాయి. మరి ఈ సమస్యలకు హోమ్ రెమెడీస్ (Home Remedies)తో ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ఎండాకాలంలో వేడిమి వల్ల మాడుకు బాగా చెమట పట్టి జుట్టు (Hair) పాడవుతుంది. ఆ తర్వాత వచ్చే వర్షాకాలం (Monsoon)లో చెమట సమస్యలు అంతగా ఉండవు. కానీ వాతావరణంలో తేమ (Humidity) అధికంగా ఉండి జుట్టు ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఈ కాలంలో కురిసే వర్షపు నీరు, తేమ వల్ల జుట్టులో అధికంగా మురికి పేరుకుపోతుంది. ప్రస్తుతం భారతదేశంలో వర్షాకాలం కొనసాగుతోంది కాబట్టి ఈ సీజన్‌లో తగిన జుట్టు సంరక్షణ జాగ్రత్తలు (Hare Care Tips) పాటించడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో కురులను సంరక్షించుకోకపోతే జుట్టు చిట్లడంతో సహా జుట్టు రాలే సమస్యలు కూడా తప్పవు. జుట్టు కూడా విపరీతంగా చిక్కులు (Frizzy Hair) కడుతుంది. అప్పుడు కురులు అందవిహీనంగా కనిపిస్తాయి. మరి ఈ సమస్యలకు హోమ్ రెమెడీస్ (Home Remedies)తో ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

- యాపిల్ సిడార్ వెనిగర్
ఒక కప్పులో మూడవ వంతు మోతాదులో యాపిల్ సిడార్ వెనిగర్‌ను తీసుకుని, దానిని లీటరు గోరువెచ్చని నీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేసి, కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత మీ జుట్టును బాగా వాష్ చేసుకొని ఆరనివ్వాలి. జుట్టు సహజ పీహెచ్ (pH) ఆమ్లం వైపు ఉంటుంది. ఇది బ్యాలెన్స్ తప్పినప్పుడు జట్టు ఆల్కలీన్ వైపుకు వంగుతుంది. దానివల్ల కురులు ఎలా పడితే అలా వంకర్లు తిరిగి చిక్కులు పడతాయి. అయితే యాపిల్ సిడార్ వెనిగర్ వల్ల కురుల పీహెచ్ అనేది మళ్లీ యాసిడ్ వైపు మళ్లుతుంది. అప్పుడు చిక్కులతో గజిబిజిగా ఉన్న మీ జుట్టు స్మూత్, నీట్‌గా తయారవుతుంది.

ఇదీ చదవండి: వామ్మో వీడు మామూలోడు కాదయ్యో.. ఏకంగా సీఎం ఫొటోతోనే కోట్లు కొల్లగొట్టడానికి రెడీ ! చివరికి ఏమైందంటే ?


- గుడ్లు, ఆలివ్ ఆయిల్
ఒక గుడ్డును ఆలివ్ నూనెలో యాడ్ చేసి అవి రెండూ బాగా కలిసేలా గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి 40 నిమిషాల నుంచి గంట వరకు అలాగే ఉంచాలి. తర్వాత సాధారణ షాంపూతో శుభ్రంగా జుట్టును వాష్ చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్‌లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లతో పాటు గుడ్లలోని ప్రొటీన్లు, కొవ్వులు చిట్లిన జుట్టు, చిక్కుపడిన జుట్టును మంచిగా మార్చుతాయి. కురుల ఆరోగ్యానికి తగినంత తేమను కూడా అందిస్తాయి. అప్పుడు మీ హెయిర్ సిల్కీగా మెరిసిపోతుంది.

- గుడ్లు, పెరుగు
గుడ్లు, పెరుగు కూడా చింపిరి జుట్టును వదిలించేందుకు ఒక బెస్ట్ హోం రెమెడీగా పనిచేస్తుంది. వర్షాకాలంలో గుడ్లను కొంచెం పెరుగుతో కలిపి.. ఆ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసుకోవాలి. అరగంట పాటు అలాగే ఉంచి కడిగేయాలి. ఈ రెండు సహజ పదార్థాలు జుట్టుకు పోషణనిస్తాయి.



- అలోవెరా, బాదం నూనె
పావు కప్పు అలోవెరా జెల్‌ను ఒక కప్పు బాదం నూనెలో యాడ్ చేయాలి. ఈ మిశ్రమంతో తల, కురులను బాగా మర్దన చేయాలి. జుట్టును మసాజ్ చేశాక, దానిని గంటసేపు అలాగే ఉంచాలి. అనంతరం షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్‌లోని విటమిన్ ఇ సహజంగా దెబ్బతిన్న కురులను మళ్లీ పట్టులా మిలమిల మెరిసేలా చేస్తుంది. కొబ్బరి నూనెతో కలబందను కలపడం ద్వారా కూడా జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Beauty tips, Hair fall, Hair problem tips, Monsoon

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు