Diwali 2019 : దీపావళికి ఇంటిని క్లీన్ చేయడమంటే... ఫ్యామిలీతో కాలం గడపడమే

దీపావళి

8 ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పుణే, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌లోని 22 నుంచి 34 సంవత్సరాల వయస్సున్న 5 వేలమందిపై అర్బన్ క్లాప్ అనే సంస్థ చేసిన పరిశోధనలో కొన్ని కొత్త విషయాలు తెలిశాయి.

  • Share this:
దీపావళి.. పిల్లలు, పెద్దలు ఎంతగానో ఇష్టపడే ఈ పండుగని చేసుకునేందుకు ప్రతిఒక్కరూ ఎదురుచూస్తుంటారు. ఇంటిని శుభ్రం చేసుకుని, కొత్త బట్టలు వేసుకుని తారాజువ్వల వెలుగులతో ఆనందంగా గడుపుతుంటారు. అయితే 8 ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పుణే, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌లోని 22 నుంచి 34 సంవత్సరాల వయస్సున్న 5 వేలమందిపై అర్బన్ క్లాప్ అనే సంస్థ చేసిన పరిశోధనలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. అవేంటంటే... 68శాతం మంది... పండుగ కోసం ఇంటిని ముస్తాబు చేయడాన్ని తమ కుటుంబసభ్యులతో గడపడంకోసమే చేస్తారట. ఇక 55శాతం మంది ఇంట్లో ఆహారపదార్థాలు, కొత్తబట్టలు తీసుకోవడానికి ఇంట్లో అలంకరణ వస్తువులు తీసుకోవడానికి ఇష్టపడతారట. 30శాతం మంది ఇంటిని శుభ్రం చేస్తారట ఇండియాలో.

చాలా మోడ్రన్ ఫ్యామిలీస్‌లో ఇంటిని శుభ్రపరచడం వంటి పనులను చేయడాన్ని ఇబ్బందిగా ఫీల్ అవుతారట. ఇందుకు కారణాలను విశ్లేషిస్తే... 42శాతం మందికి డస్ట్ ఎలర్జీ ఉండడం, 26శాతం మంది వీకెండ్ ఇంట్లోనే బందీలుగా ఉంటున్నట్లు ఫీల్ అవుతున్నట్లు వెల్లడించారు.

అయితే ఇందులో పండుగకు ఇంటిని శుభ్రం చేయడం కోసం 68శాతం మంది బయటివారి హెల్ప్ తీసుకుంటున్నారు. 35శాతం మంది వారంతట వారే చేసుకుంటున్నారట. మరి మీ సంగతి ఏంటి... పండక్కి ఇంటిని ఆల్రెడీ తీర్చిదిద్దుకొనే ఉంటారు. ఇక బంధువుల్నిపిలిచేయండి మరి.

 

Pics : అందాల అప్సరస ఊర్వశి రౌతేలా

ఇవి కూడా చదవండి :

దీపాల వెలుగులో ఫొటోలు దిగుతున్నారా... ఈ చిట్కాలు మీకోసమే

Diwali 2019 : దీపావళికి ఈజీగా రంగోలీ వెయ్యడం ఎలా?

Diwali 2019 : దీపావళి పూజా విధానం... పురాణ ప్రాసస్థ్యం

Diwali 2019 : దీపావళికి దీపాలు ఎందుకు వెలిగిస్తారు... ఇదీ పండుగ ప్రాసస్థ్యం
Published by:Krishna Kumar N
First published: