Home /News /life-style /

HOLI 2021 TAKE THESE PRECAUTIONS ON HOLI DAY TO PROTECT YOUR EYES FROM HARMFUL SYNTHETIC COLORS NK

Holi 2021: హోలీ వేళ మీ కళ్లు జాగ్రత్త... కళ్లలో రంగు పడితే ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు?

హోలీ వేళ మీ కళ్లు జాగ్రత్త (ప్రతీకాత్మక చిత్రం)

హోలీ వేళ మీ కళ్లు జాగ్రత్త (ప్రతీకాత్మక చిత్రం)

Holi 2021: దేశవ్యాప్తంగా ఆదివారం, సోమవారం హోలీ పండుగ జరగనుంది. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్‌ గౌరవ్‌ అరోరా ద్వారా తెలుసుకుందాం.

  రంగుల పండుగ హోలీ వచ్చేసినట్లే. ప్రతి ఒక్కరూ అత్యంత ఆసక్తిగా వేడుకల్లో పాల్గొనడానికి రెడీ అవుతున్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ... కలర్స్ చల్లుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే హోలీ వచ్చినప్పుడు కళ్లకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. దురదృష్టవశాత్తు, చాలామంది ఈ వేడుకల్లో పాల్గొనేటప్పుడు నీటిని వెదజల్లుతుంటారు కానీ, దానివల్ల కలిగే పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయనేది ఆలోచించరు. వినోదం పొందడం అవసరమే కానీ, కంటి రక్షణ దగ్గరకు వచ్చేసరికి మనం తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈమధ్య కాలంలో, రంగులు తయారుచేయడానికి కూరగాయలు లేదంటే ఎండిన పూల నుంచి తీసిన రంగుల్ని వాడట్లేదు. సింథటిక్‌ రసాయన రంగులను వాడుతున్నారు. ఇవి కంటి చూపుకి హాని చేస్తాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే... కళ్లలో దురద లేదా ఎలర్జీలు, ఇన్‌ఫెక్షన్లు వంటి వాటితో బాధపడాల్సి వస్తుంది. కొన్నిసార్లు తాత్కాలిక అంధత్వమూ రావొచ్చు.

  హోలీ ఆడేముందు చేయాల్సిన, చేయకూడని అంశాలు:

  చేయాల్సిన అంశాలుః
  1.నూనె రక్షణ:
  కళ్ల చుట్టూ ఉన్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కొబ్బరి నూనె లేదా బాదం నూనెను బయటకు వెళ్లే ముందు రాసుకోవడం చేస్తే చర్మం పాడవకుండా కాపాడుతాయి.

  2. షేడ్స్‌ వినియోగించండి:
  ఆకర్షణీయంగా మీరు కనిపించేందుకు సాయం చేయడం మాత్రమే కాదు, మీ కళ్లకు తగిన రక్షణను సైతం షేడ్స్‌ అందిస్తాయి. ఎవరైనా రంగులను మీ కళ్లలో కొట్టేందుకు ప్రయత్నిస్తే ఈ షేడ్స్‌ మీ కళ్లలోకి ఆ రంగులు చేరకుండా అడ్డుకుంటాయి. ఈ షేడ్స్‌లో ప్రొటెక్టివ్‌ గ్లాస్‌లు, సన్‌గ్లాసెస్‌ లేదా ప్లెయిన్‌ గ్లాస్‌లు అయినా రక్షణ అందిస్తాయి. రంగులు కళ్లలో చేరకుండా ఉండేందుకు సైతం ఇవి సహాయపడతాయి.

  3. కళ్లు మూస్తూ తెరుస్తుండటం మరియు శుభ్రం చేయడం:
  మీ కళ్లలో పడిన రంగులను వీలైనంతగా తొలగించడం అత్యంత కీలకం. ఒకవేళ రంగులు మీ కంటిలో చేరితే, వెంటనే కళ్లను పరిశుభ్రమైన లేదా తాగునీటితో ఎక్కువసార్లు కడగాలి. మీ ముఖం కిందకు దించి, నెమ్మదిగా మీ కళ్లను మీ అరచేతిలో నింపుకున్న నీటిలో ఉంచి శుభ్రపరచడానికి ప్రయత్నించాలి. తరచుగా కళ్లు మూసి చేయడం, మీ కళ్లను పైకి, కిందకు తిప్పడం ద్వారా రంగులను వీలైనంత వరకూ తొలగించవచ్చు. అలాగని మీ కళ్లలోని నేరుగా నీరు పోయకూడదు. అలా చేస్తే అది ఇంకా ప్రమాదకరంగా మారొచ్చు. మీ జుట్టు ముడివేసుకుని, దానిపై టోపీ పెట్టుకోవాలి. తద్వారా రంగు నీళ్లు మీ జుట్టు ద్వారా కళ్లలోకి చేరే ప్రమాదాన్ని నివారించవచ్చు.

  4. డాక్టర్‌ను సంప్రదించండి:
  ఒకవేళ మీ కళ్లు ఎర్రబారి, అది పోకపోయినా లేదంటే ఒకవేళ కళ్లు దురదలు పెడుతున్నా, కళ్ల నుంచి నీరు వస్తున్నా, మీకు అసౌకర్యంగా ఉన్నా లేదంటే రక్తస్రావం అవుతున్నా తక్షణమే కంటి చికిత్స నిపుణులను సంప్రదించాలి.

  5. ఆప్రమప్తంగా ఉండండి:
  కంటికి దగ్గరగా ఎక్కడా రంగులు పడకుండా జాగ్రత్త పడటం ప్రయోజనకరం. అయితే, అది అన్ని వేళలా సాధ్యం కాదు. అందువల్ల, ఒకవేళ ఎవరైనా మీ మొహంపై రంగులు చల్లే పరిస్ధితిలో ఉంటే మీ కళ్లు, పెదాలను గట్టిగా మూసి వేయండి.

  చేయకూడని అంశాలు:
  1. కళ్లను నలపకూడదు.
  హోలీ ఆడేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశం కళ్లను నలపకపోవడం. ఈ కళ్లను తాకడం లేదా తరచుగా వాటిని నలుపడం చేయరాదు. అలా చేస్తే నేత్ర దృష్టిని కోల్పోవడం లేదా చికాకు కలిగించడం జరుగవచ్చు.

  2. నీటి బెలూన్స్‌ నిరోధించాలి:
  నీటి బెలూన్స్‌కు దూరంగా ఉండాలి. ఇవి అత్యంత ప్రమాదకరంగా ఉండటంతో పాటుగా కళ్లకు తీవ్ర గాయాలను సైతం కలిగించే ప్రమాదం ఉంది. ఈ కారణంగా రక్తస్రావం, కంటి లోపల కటకాలు స్ధానభ్రంశం కావడం, మాక్యులర్‌ ఎడెమా లేదా రెటీనా నిర్లిప్తంగా మారడం జరుగవచ్చు. ఈ కారణం చేత కంటి చూపు కోల్పోవడం లేదా మొత్తానికి కంటినే కోల్పోవడం కూడా జరుగవచ్చు. ఈ తరహా సంఘటనలు జరిగినప్పుడు తక్షణమే ఆప్తమాలజిస్ట్‌ను సంప్రదించవలసి ఉంటుంది.

  3. కళ్లలో పడిన పదార్ధాలను తొలగించడం:
  మీ కళ్లలో పడిన ఏదైనా వస్తువు లేదంటే పదార్థాలను హ్యాండ్‌ కర్ఛీఫ్‌ లేదా టిష్యూ పేపర్‌ వినియోగించి తీయడానికి ప్రయత్నించవద్దు. ఇలా చేస్తే పరిస్థితులు మరింతగా దిగజారే ప్రమాదం ఉంది.

  4. కాంటాక్ట్‌ లెన్స్‌లు వాడవద్దు:
  కాంటాక్ట్‌లెన్స్‌లు వాడటం చేయరాదు. దీనికి బదులుగా డెయిలీ డిస్పోజబుల్‌ తరహ వాటిని వాడవచ్చు. కాంటాక్ట్‌ లెన్స్‌ వల్ల మంచి కన్నా చెడు ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది. కాంటాక్ట్‌లెన్స్‌లో నీటిని పీల్చుకునే లక్షణాలు ఉన్నాయి. కంటిలో పడిన రంగు నీళ్లను సైతం అది పీల్చుకోవడం వల్ల అలర్జీలు, ఇన్‌ఫెక్షన్లు వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తుంది. మరింత మార్గనిర్దేశనం కోసం మీ కాంటాక్ట్‌లెన్స్‌ స్పెషలిస్ట్‌ను సంప్రదించండి.

  కళ్లద్దాలను ధరించే వారు హోలీ ఆడుతున్న సమయంలో ఆప్రమప్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. మరీ ముఖ్యంగా ముఖం మీద రంగులు చల్లే సమయంలో. ఒకవేళ ఎవరైనా రంగులు చల్లడానికి వస్తే, మీరు ముందుగానే ముఖంపై రాయవద్దని కోరడం చేయవచ్చు లేదంటే అతను/ఆమె కంటి అద్దాలతో వారికే ప్రమాదం జరుగవచ్చు.

  కంటి అద్దాలను ధరించే వారు హోలీ సమయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వారు కంటిఅద్దాలను ధరిస్తే, రంగులు వాటి కంటి అద్దాలపై నిలిచిపోయే ప్రమాదం ఉంది. రిమ్‌లెస్‌ కంటి అద్దాలు అతి సులభంగా పగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల, వారు కంటి అద్దాలను వాడకపోవడం ఉత్తమం.

  ఇది కూడా చదవండి:Summer Tips: ఇంట్లో వేడిని ఇలా తగ్గించుకోండి... సింపుల్ టిప్స్

  ప్రకాశవంతమైన రంగులు మన జీవితంలో ఎన్నో సానుకూలమైన మార్పులు తీసుకువస్తాయనే నమ్మకం మీలో ఉన్నట్లయితే, మీ కళ్లకు దూరంగా అవి ఉన్నాయన్న భరోసానూ కలిగి ఉండండి. హోలీ పండుగను సంపూర్ణంగా ఆస్వాదించండి కానీ ఈ సూచనలు మాత్రం పాటించండి. తద్వారా మీతో పాటుగా మీ ప్రియమైన వారు కూడా సురక్షితంగా ఉండగలరు. సంతోషంగా ఉండండి... జీవితాన్ని రంగులమయం చేసుకోండి.
  (రచయిత డాక్టర్ గౌరవ్ అరోరా, రీజనల్‌ హెడ్‌, క్లీనికల్‌ సర్వీసెస్‌, డాక్టర్‌ అగర్వాల్స్‌ కంటి ఆస్పత్రి, హైదరాబాద్‌, తెలంగాణ)
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Health, Holi 2021

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు