హోలీ కోసం ఇంట్లోనే సహజసిద్ధ రంగులు తయారు చేసుకోండి..

కెమికల్స్ కలిసిన రంగులు మంచివి కావు. వీటిని వాడడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. కొన్ని అప్పుడే ప్రభావం చూపకపోయినా ముందుముందు తీవ్రప్రభావం చూపిస్తాయి. కాబట్టి అలాంటి సమస్యలు లేకుండా ఇంట్లోనే సహజసిద్ధంగా రంగులు తయారుచేసుకోండి. హోలీ పండుగను ఆనందంగా జరుపుకోండి.

Amala Ravula | news18-telugu
Updated: March 20, 2019, 10:18 AM IST
హోలీ కోసం ఇంట్లోనే సహజసిద్ధ రంగులు తయారు చేసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 20, 2019, 10:18 AM IST
చిన్నా పెద్దా తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపే పండుగ హోలీ రానే వచ్చింది. ఈ పండుగ కోసం చిన్నపిల్లలు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఓ వారం ముందునుంచే రకరకాల రంగులు, స్ప్రేలు రెడీ చేసుకుంటారు. హోలీ రాగానే తమ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి రంగులు చల్లుతుంటారు. అయితే బయట దొరికే కెమికల్స్ కలిసిన కలర్స్ ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుంది. అలా కాకుండా ఉండాలంటే మనమే రంగులను తయారు చేసుకోవాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకుని ముందు పెద్దలు పాటిస్తే చిన్నపిల్లలు కూడా ఆచరిస్తారు. అయితే అది ఎలా చేయాలో చూద్దాం.
* పసుపు, శనగపిండిని కలిపి రంగుగా పూయొచ్చు.
* పసుపు, కుంకుమ కలిపితే మరో కొత్త రంగు సిద్ధమైనట్లే.

* ఆకుకూరలను ఎండబెట్టి పొడిగా మిక్సీపట్టి రాయొచ్చు.
* వాడేసిన కాఫీ, టీ పౌడర్‌లను మిక్సీ పట్టి రాయొచ్చు.
* పూలను కూడా ఆరబెట్టి వాటిని మిక్సీ పట్టాలి. వీటన్నింటిని నీటిలో కలిపి కూడా చల్లొచ్చు.


* ఎర్రచందనం, చందనం పొడులను హోలీ రంగులుగా వాడొచ్చు. దీన్ని నేరుగా పూయొచ్చు లేదా నీటిలో కలిపి రాయొచ్చు.
Loading...
* దానిమ్మ గింజలు, బీట్‌రూట్ మంచి కలర్స్‌నిస్తాయి. వీటిని మిక్సీ పట్టి లేదా కాస్తా మెదిపి రంగుగా పూయొచ్చు.
* గోరింటాకు పొడిలో రకరకాల పూలు, పండ్లతో తీసిన రంగులను కలిపి రాయొచ్చు.
* రకరకాల చెట్ల ఆకులు, బెరళ్ళని నానబెట్టి ఆ రంగులను కూడా వాడొచ్చు.
* పండ్ల తొక్కలను కూడా రంగులుగా మార్చొచ్చు.
* ఒకవేళ వెంటనే ఉపయోగించాలనుకుంటే వాటిని కాస్తా నీటిలో వేసి మరిగించి వాడుకోవచ్చు.
సహజసిద్ధమైన రంగులు కాకుండా కృత్రిమ రంగులు వాడడం వల్ల శరీరంపై మచ్చలు ఏర్పడతాయి. అవి శ్వాస, కాలేయ సంబంధిత సమస్యలను కూబడా తీసుకొస్తాయి.

ఇవి కూడా చదవండి..

Holi 2019 : హోలీని ఇలా మరింత హ్యాపీగా చేసుకోండి..

శరీరంపై పడిన హోలీ రంగులు పోవాలంటే..ఇలా చేయండి..
First published: March 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...