Happy Holi : హోలీ ఆడుతున్నారా.. ఈ 8 కలర్స్ ఏ ఫీలింగ్‌ని సూచిస్తాయంటే..

హోలీ ఆడేందుకు ప్రతీఒక్కరూ ఆసక్తి చూపిస్తారు. ఎన్నో కలర్స్‌ని తీసుకొచ్చి తమకు నచ్చినవారికి చల్లుతారు. అయితే, ఇలాచల్లే ఒక్కో కలర్ ఒక్కో ఫీలింగ్‌ని తెలియజేస్తాయి అవేంటో మీరూ తెలుసుకోండి..

Amala Ravula | news18-telugu
Updated: March 20, 2019, 3:10 PM IST
Happy Holi : హోలీ ఆడుతున్నారా.. ఈ 8 కలర్స్ ఏ ఫీలింగ్‌ని సూచిస్తాయంటే..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 20, 2019, 3:10 PM IST
హోలీ ఆడేందుకు ప్రతీఒక్కరూ ఆసక్తి చూపిస్తారు. ఎన్నో కలర్స్‌ని తీసుకొచ్చి తమకు నచ్చినవారికి చల్లుతారు. అయితే, ఇలాచల్లే ఒక్కో కలర్ ఒక్కో ఫీలింగ్‌ని తెలియజేస్తాయి అవేంటో మీరూ తెలుసుకోండి..
పింక్ : హోలీ అనగానే చాలామంది ఈ రంగునే ఎక్కువగా చల్లుకుంటారు. రొమాన్స్, ప్రేమ, మృదుత్వం, ప్రశాంతత కోసం సూచకంగా ఈ రంగుని వాడతారు. కాబట్టి మీరు మీరిష్టపడేవారిపై ఈ రంగుని చల్లండి..
ఎల్లో : పింక్ తర్వాత అంతగా చల్లే కలర్ ఏదైనా ఉందంటే అది ఎల్లోనే. ఈ కలర్ హ్యాపీనెస్, ఇతరుల దృష్టిని ఆకర్షించడాన్ని సూచిస్తుంది.

గ్రీన్ : కలర్స్‌లో ఎక్కువగా ఆకర్షించేది గ్రీన్. సహజత్వం, చల్లదనం, సామరస్యం, ఆరోగ్యానికి సూచకంగా ఈ కలర్ ఉంటుంది
బ్లూ : బ్లూ కలర్‌ని కూడా చాలామంది ఇష్టంగా చల్లుతారు. ప్రశాంతత, చల్లదనం, పారవశ్యం వంటి వాటికి ఈ కలర్‌ని సూచకంగా ఈ కలర్‌ని చల్లుతారు.
రెడ్ : చాలామంది వాడే రెడ్ కలర్ కూడా ప్రేమ, రొమాన్స్, మృదుత్వం, ఉత్తేజం, వెచ్చదనానికి చిహ్నంగా ఉంటుంది.


వైట్ : హోలీ కలర్స్‌లో తక్కువగా వాడే ఈ కలర్ స్వచ్ఛత, అమాయకత్వం, శుభ్రత, విశాలత్వానికి చిహ్నాలుగా వాడతారు.పర్పుల్ : రాజసం, సంపద, గౌరవానికి చిహ్నంగా ఈ కలర్ చల్లుతారు.
బ్రౌన్ : బ్రౌన్ కలర్ కూడా వాడతారు. ఈ రంగుని స్థిరత్వం, స్నేహం, నమ్మకం, దు:ఖం, సౌకర్యం, భద్రత వంటి ఫీలింగ్స్‌ని తెలియజేసేవిధంగా ఉంటాయి.
ఈ కలర్స్ వెనుక ఉండే ఫీలింగ్స్‌ని మీరూ ఎదుటివారిపై చల్లి చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి..

హోలీ కోసం ఇంట్లోనే సహజసిద్ధ రంగులు తయారు చేసుకోండి..

Holi 2019 : హోలీని ఇలా మరింత హ్యాపీగా చేసుకోండి..
First published: March 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు