శరీరంపై పడిన హోలీ రంగులు పోవాలంటే..ఇలా చేయండి..

హోలీ ఎంతో హ్యాపీగా చేసుకుంటాం.. ఆడేటప్పుడు స్కిన్, హెయిర్ కేర్‌ని అంతగా పట్టించుకోం. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే వాటిప్రభావం శరీరం, జుట్టుపై ఎక్కువగా ఉంటుంది. మరి ఆ జాగ్రత్తలు ఏంటో చూద్దామా..

Amala Ravula | news18-telugu
Updated: March 21, 2019, 7:00 AM IST
శరీరంపై పడిన హోలీ రంగులు పోవాలంటే..ఇలా చేయండి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రంగుల పండుగ రానే వచ్చింది. ఈ సమయంలో ప్రతీఒక్కరూ కలర్స్ చల్లుకుంటూ హాయిగా గడిపేస్తారు. దగ్గరివారు, ఇష్టమున్న వారు ఎవరిపైనైనా సరే కలర్స్ పూసి ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటివారు ముందుగానే జాగ్రత్తలు తీసుకోకపోతే ఒంటిపై పడిన రంగులు త్వరగా పోవు, ఒకవేళ ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే కలర్స్ పోగొట్టుకోవడానికి ఏంచేయాలో చూద్దాం.
* హోలీ ఆడేముందు ముఖానికి ఆలీవ్ ఆయిల్ రాసుకోవాలి. లేదా కొబ్బరినూనైనా పర్లేదు.

* కాళ్లు, పాదాలు చేతులకి మొత్తంగా శరీరమంతా కొబ్బరినూనె లేదా వాజిలెన్ రాసుకోవాలి.
* ఆలీవ్ ఆయిల్ రాయడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. కొబ్బరినూనె అయినా పర్లేదు.
* గోర్లకి ముందుగానే ఆల్మండ్ ఆయిల్, విటమిన్ ఆయిల్‌తో మసాజ్ చేయాలి. ఆ తర్వాత ఏదైనా నెయిల్ కలర్‌ని మందంగా అంటే 2 కోటింగ్స్ వేయాలి. దీనివల్ల రంగుల ప్రభావం అంతగా ఉండదు.
* అదేవిధంగా ఎండలో బయటికి వెళ్లి మాట్లాడాలంటే ముందుగా ఖచ్చితంగా సన్‌స్క్రీన్ లోషన్ రాయాలి.
* సన్‌గ్లాసెస్ వాడడం వల్ల కళ్ళపై పెద్దగా ఎఫెక్ట్ పడదు.* మీ స్కాల్ప్ మరీ సెన్సిటీవ్ అనిపిస్తే ముందుగా కొద్దిగా నిమ్మరసాన్ని స్కాల్ప్‌పై అప్లై చేయడం మంచిది. ఎందుకుంటే రంగుల్లోని కెమికల్స్ అంతగా ప్రభావం చూపవు.
రంగులు త్వరగా పోవాలంటే ఇలా చేయండి..
* ఒంటిపై పడిన రంగులు త్వరగా పోవాలంటే కలర్స్ పడిన వెంటనే వాటిని నీటితో కడగాలి. ఎంత ఎక్కువ సమయం తీసుకుంటే అంత ఎక్కువ సమయం అలానే ఉంటాయి.
* గోరువెచ్చని నీటితో కడగడం వల్ల రంగులు ఈజీగా పోతాయి.
* గ్లిజరిన్, సీ సాల్ట్ కలపాలి. ఇందులో కొన్ని చుక్కుల ఏదైనా అరోమా ఆయిల్ వేసి మంచి స్క్రబ్‌లా చేసి రాస్తే వ్రగా కలర్స్ పోతాయి.
* ఏదైనా ఆయిల్ రాస్తే దాంతో ఈజీగా పోతాయి. కిరోసిన్ రాసినా పోతాయి. కానీ అది శరీరానికి అంత మంచిది కాదు.
* క్లీన్ చేసుకున్న వెంటనే మాయిశ్చరైజ్ క్రీమ్ రాయడం మరిచిపోవద్దు.
* హెయిర్‌ని ఖచ్చితంగా మైల్డ్ షాంపుతో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆలీవ్ ఆయిల్, తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇది జుట్టుకి చాలా మంచిది.
అయితే, సహజసిద్ధమైన రంగుల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే మనం కెమికల్స్‌తో కూడిన రంగులు వాడతామో అప్పుడే ఈ ఇబ్బంది. కాబట్టి.. వీలైనంత వరకూ సహజసిద్ధమైన రంగులతో పండుగ చేసుకోండి.

ఇవి కూడా చదవండి..

హోలీ కోసం ఇంట్లోనే సహజసిద్ధ రంగులు తయారు చేసుకోండి..

ఎండలు పెరిగిపోయాయ్.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..

Exam Tips : ఇలా చదివితే సబ్జెక్ట్ గుర్తుంటుంది.. ఎగ్జామ్స్ టైమ్‌లో ఈ 6 టిప్స్ 

అప్పుడు అమ్మాయిలకంటే అబ్బాయిలే ఎక్కువగా తింటారట..
First published: March 21, 2019, 6:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading