Holi 2019 : హోలీని ఇలా మరింత హ్యాపీగా చేసుకోండి..

హోలీ పండుగ వచ్చేసింది. ఈ కలర్స్ పండుగను మరింత కలర్‌ఫుల్‌గా చేసుకోవాలి. ఆ హ్యాపీనెస్‌ సంవత్సరమంతా గుర్తుండిపోవాలంటే కొన్ని నియామాలు పాటించండి.. అవేంటంటే..

Amala Ravula | news18-telugu
Updated: March 19, 2019, 11:59 AM IST
Holi 2019 : హోలీని ఇలా మరింత హ్యాపీగా చేసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 19, 2019, 11:59 AM IST
ఆర్గానిక్ కలర్స్ వాడండి: కెమికల్స్‌ కూడిన కలర్స్ ఎవరికైనా మంచిది కాదు. వీటిని పూయడం, చల్లడం వల్ల ఇప్పుడే కాదు భవిష్యత్‌లోనూ ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి వీటి జోలికి వెళ్లకుండా ఆర్గానిక్ కలర్స్‌నే వాడండి. దీంతో పండుగ మరింత ఆనందంగా జరుపుకున్నవారవుతాం. ఆర్గానిక్ కలర్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఒకవేళ అలా కాదనుకుంటే మీరే తయారు చేసుకోండి. ఎన్నో రకాల ఆకులు, పూలని ఆరబెట్టి మిక్సీ పట్టి ఈకలర్స్‌ని చేయొచ్చు. లేదంటే అప్పటికప్పుడే అంటే వాటిని నీటిలో వేసి మరిగించి కూడా కలర్స్ చేసుకోవచ్చు.
స్కిన్, హెయిర్ కేర్ తీసుకోండి : ఆడడం ఆడతాం కానీ, ఆ తర్వాత, జుట్టు, స్కిన్‌కి అంటుకున్న కలర్స్ పోవు. దీంతో చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు తప్పవు కాబట్టి ముందే వాటికి కేర్ తీసుకోవడం చేయాలి. అంటే జుట్టు, చర్మానికి ఆయిల్స్ రాయాలి. బయటికి వెళ్తే సన్‌స్క్రీన్‌లోషన్ రాయాలి.
నీటిని తక్కువగా వాడండి : హోలీ అంటేనే సమ్మర్‌లో వస్తుంది. ఈ సమయంలో నీటికొరత ఉంటుంది. అయినా ఒక్కరోజే అనుకుంటాం. నిజమే కానీ, నీటిని కాస్తా పొదుపుగా వాడడం కూడా మంచిది. చాలా చోట్ల కనీస అవసరాలకు నీరు లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని వనరులను దుర్వినియోగం చేయకుండా ఉండడం మంచిది.

ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించండి : అందరికీ హోలీ ఆడడం ఇష్టం ఉండదు. కలర్స్ రాసుకునేందుకు ఇష్టపడరు. అలాంటివారు చెప్పినప్పుడు పూయకుండా ఉండడం మంచిది. అందరికీ ఒకే అభిప్రాయాలుండవు. ఇలా చేయడం వల్ల వారిని గౌరవించినట్లుగానే ఉంటుంది.
మ్యూజిక్‌తో ఎంజాయ్ చేయండి : హోలీ అనగానే చాలామంది ఎంజాయ్ చేస్తారు. అయితే ఇందుకోసం ఏవో క్లబ్స్‌లో చేరే బదులు.. మీ ఇంట్లోనే మంచి ప్లే లిస్ట్ ఏర్పాటు చేసి అందరితో సరదాగా గడిపితే సరి. పండుగ ఆనందమంతా మీ దగ్గరే ఉంటుంది.
ఇలా కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఈ పండుగను ఎంతో హ్యాపీగా చేసుకోవచ్చు.

First published: March 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...