Himalayan Faran: హిమాలయ ఫరాన్... ఆయుర్వేదంలో దివ్యౌషధం

Health : హిమాలయ ఫరాన్... ఆయుర్వేదంలో దివ్యౌషధం

Himalayan Faran : మీకు ఆయుర్వేదంలో వాడే ఔషధాల్లో ఎన్ని తెలుసు. బహుశా ఫరాన్ తెలియకపోయి ఉండొచ్చు. దాని ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

 • Share this:
  Himalayan Faran : హిమం (మంచు)ను కలిగివున్న ఆలయాలుగా మన హిమాలయాలకు పేరు. వాటిని ఆలయాలతో ఎందుకు పోల్చారంటే... అక్కడ అద్భుతమైన ఔషధాలు ఎన్నో ఉన్నాయి. పర్వత సానువుల్లో తిరిగే చాలా మంది ఆ మొక్కలు, పువ్వులు, ఆకులు, మూలికలు, గింజలు, విత్తనాల్ని సేకరించి... మందుల కంపెనీలకు అమ్ముతున్నారు. వాటి ద్వారా మందులు, క్రీములు తయారుచేస్తున్న ఫార్మా కపెనీలు... వాటిని మనకు అమ్ముతున్నాయి. ఐతే... ఆ మూలికల్ని, ఆకుల్ని మనమే డైరెక్టుగా వాడుకుంటే మనకు ఇంకా ఎక్కవ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాంటి అరుదైన వాటిలో ఫరాన్ ఒకటి. ఇది ఉల్లిపాయల జాతికి చెందిన మొక్క. ఉత్తరాఖండ్‌లోని ఆల్పైన్ పచ్చిక మైదానాల్లో ఈ మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి.

  పర్వత ప్రాంతాల్లో ఈ మొక్కను కూరల్లో వేసుకుంటారు. ఇది మంచి రుచి ఇవ్వడమే కాదు... ఇందులోని ఔషధ గుణాలు... ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ మొక్కను జూన్ నుంచీ అక్టోబర్ వరకూ సాగుచేస్తారు. ఆ తర్వాత మొక్కల్ని ఎండబెట్టి... కట్ చేసి... మిగతా కాలం అంతా అందుబాటులో ఉంచుతారు. ఈ మొక్కలు డయాబెటిస్‌ను తగ్గించడమే కాదు... బైల్ రుగ్మతలను కూడా నివారిస్తాయి. రక్తాన్ని శుభ్రపరుస్తాయి. ఇలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

  ఫరాన్‌లో 100కు పైగా రకాలున్నాయంటే నమ్మగలరా? అన్నీ ఇండియాలో లేవు. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు జాతుల ఫరాన్లు ఉన్నాయి. అన్నింటిలోనూ ఔషధ గుణాలు ఉండటం విశేషం. ఐతే... ఉత్తరాఖండ్‌లో పెరిగే మొక్కల టేస్ట్, ఫ్లేవర్ డిఫరెంట్‌గా ఉంటుంది. అక్కడి మట్టి, వాతావరణం వల్ల అవి మంచి రుచితో, ఎక్కువ ఔషధ గుణాలతో ఉంటున్నాయి.

  ఆరోగ్య ప్రయోజనాలు -
  1. Relieves indigestion - మలబద్ధకానికి చెక్ పెడుతుంది. రెగ్యులర్‌గా ఈ మొక్క ఆకులు తింటూ ఉంటే... అజీర్తి సమస్యే ఉండదు. పొట్టలో ఆహారం చక్కగా ముక్కలై... ఈజీగా డైజెస్ట్ అవుతుంది.

  2. Purifies blood - మన శరీరంలోని వ్యర్థాల్ని తరిమేసి... రక్తాన్ని శుద్ధి చెయ్యడంలో ఈ మొక్క బాగా పనిచేస్తోంది. రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. శరీరమంతా పాకేలా చేస్తుంది.

  3. Boosts immunity - కొంతమందికి రోగాలు వస్తే త్వరగా నయం కావు. కారణం వారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటమే. అలాంటివాళ్లు ఈ మొక్కను తింటే... ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ మొక్క మన బాడీలోకి బ్యాక్టీరియా, వైరస్, క్రిములు, ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది.

  4. Soothes cough and cold - జలుబు, దగ్గు బాగా వస్తుంటే... వాళ్లు కచ్చితంగా ఈ మొక్కను వాడితే మేలు. సీజనల్ వ్యాధుల్ని తరిమేసే శక్తి ఈ ఫరాన్‌కి ఉంది.

  5. Helpful in Asthma - ఆస్తమా వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ మొక్క ఉపయోగపడుతుందని పరిశోధనల్లో తేలింది. జాండీస్ కూడా దీని వల్ల నయమవుతోంది.

  ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఈ ఫరాన్ లభిస్తోంది. 50 గ్రాముల ప్యాకెట్ ధర రూ.80 దాకా ఉంటోంది.
  Published by:Krishna Kumar N
  First published: