Health Tips : యోగర్ట్ ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత్త..

ప్రతీకాత్మక చిత్రం

మార్కెట్లో దొరికే డెయిరీ ప్రొడక్ట్స్‌లో ఒకటైన యోగర్ట్‌లో చక్కెర నిల్వలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఊబకాయ సమస్య చుట్టుముడుతుందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి..

  • Share this:
మార్కెట్లో దొరికే యోగర్ట్‌ని చాలామంది ఇష్టంగా తీసుకుంటారు. స్వీట్స్‌‌ల్లోనూ ఎక్కువగా వాడుతుంటారు. అంతటితో ఆగక పిల్లలకి కూడా తినిపిస్తారు. కానీ.. జాగ్రత్త.. మార్కెట్లో దొరికే డెయిరీ ప్రొడక్ట్స్‌లో ఒకటైన యోగర్ట్‌లో చక్కెర నిల్వలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఊబకాయ సమస్య చుట్టుముడుతుందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.. యోగర్ట్ అంటే పెరుగు అనే భావనతో చాలామంది ఈ ప్రొడక్ట్‌ని తీసుకుంటుంటారు. కానీ.. నిల్వఉంచే ప్రాసెస్‌లో ఇందులో కొన్ని పదార్థాలు కలుస్తాయి. దాంతో.. వీటిలో చక్కెర నిల్వలు ఎక్కువగా పెరుగుతాయి.

బ్రిటన్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో.. మార్కెట్లో లభించే యోగర్ట్‌లో ఉండే చక్కెర నిల్వలశాతం పిల్లల్లో అధికప్రభావం చూపుతాయని తేలింది. దీనివల్ల చిన్నతనంలోనే పిల్లలు ఊబకాయులుగా మారుతున్నారని తేలింది. కేవలం అధికబరువే కాదు.. ఈకారణంగా దంతక్షయం కూడా వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇక్కడ బాధపడాల్సిన విషయమేంటంటే.. సాఫ్ట్ డ్రింక్‌లు, పండ్ల రసాల్లో చక్కెర నిల్వలు ఉన్నట్లు చాలామందికి తెలుసు. కానీ.. యోగర్ట్‌లోనూ చక్కెర నిల్వలు ఎక్కువున్నాయని తెలియకపోవడంతో చాలామంది వారి రెగ్యులర్ డైట్‌లో దీన్ని చేర్చుకుంటున్నారు. సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు.
-శాస్త్రవేత్త జె.బెర్నడెట్ మూర్


ఆర్గానిక్‌గా దొరికే యోగర్ట్‌లోనూ షుగర్ కంటెంట్స్ ఉండడం కలవరపెడుతున్న విషయం. 100గ్రాముల యోగర్ట్‌లో దాదాపు 13.1 గ్రాముల షుగర్ కంటెంట్ ఉంటోంది.
ఈ విషయంలో ప్రజల ఆలోచనా విధానం మార్చడం ఓ సవాలుతో కూడుకున్నది. స్వీట్స్‌పై ఉన్న అవగాహనతో వాటికి దూరంగా ఉన్నవారు.. యోగర్ట్‌ను మాత్రం రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటున్నారు. ఈ విషయంపై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించాలి -పరిశోధకులు అనాబెల్లి హార్టి

తరచూ యోగర్ట్ తీసుకునేవారిలో ఆరోగ్య సమస్యలు, ఊబకాయ సమస్యలు అధికంగా ఉంటాయని ఆమె తెలిపారు.

ఈ వీడియో కూడా చూడండి..

First published: