Health Tips : వీటిని తింటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు..

ప్రతీకాత్మక చిత్రం

బరువు తగ్గడానికి ఎన్నో మార్గాలు వెతుకుతుంటాం. అయితే, కొన్ని ఆహార పదార్థాలను తినడం వల్ల కూడా బరువు తగ్గుతారు. అవేంటో చూద్దాం..

  • Share this:
కార్బోహైడ్రేట్లు .. ఇవి మన శరీరానికి కావాల్సినంత శక్తిని ఇస్తాయి. అయితే శక్తిని మనం శ్రమరూపంలో ఖర్చు చేయకపోతే.. అదే శక్తి మనకి జబ్బులని తెచ్చిపెడుతుంది. దీని వల్ల ముందుగా బరువు పెరుగుతాం.

చాలామంది నాన్‌వెజ్‌ని ఇష్టంగా తింటారు. వీటిని తీసుకోవడం వరకూ బాగానే ఉంటుంది. అయితే.. ఈ ఆహారాన్ని సక్రమంగా మనం జీర్ణం చేసుకోకపోవడం వల్ల జీవక్రియలు కుంటుపడి బరువు పెరిగి, షుగర్ వంటి సమస్యలు వస్తాయి.

అయితే..బాడీకి ప్రోటీన్స్ అవసరమే.. వాటిన జంతు సంబంధితమైనవిగా కాకుండా వృక్ష సంబంధిత ఫుడ్‌గా తీసుకుంటే మంచిది. అంటే.. డ్రైఫ్రూట్స్, నట్స్ ఎక్కువగా తినాలి. అదేవిధంగా పెసర్లు, అలసందలు, మొక్కజొన్నలు తీసుకోవాలి. ఇందులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థ సమస్యలు రాకపోవడమే కాకుండా బరువు తగ్గుతాం... చురుగ్గా కూడా ఉంటాం.
కాబట్టి.. రెగ్యులర్‌గా ఈ ప్రోటీన్ ఫుడ్‌ని తీసుకోండి.

ఈ వీడియో కూడా చూడండి..
First published: