హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health : 30 రోజులు మద్యం మానేస్తే... మీ బాడీలో వచ్చే మార్పులు ఇవీ...

Health : 30 రోజులు మద్యం మానేస్తే... మీ బాడీలో వచ్చే మార్పులు ఇవీ...

నవంబర్‌ నెలలో రూ.2,567 కోట్ల విలువైన మద్యం అమ్ముడయితే ఈ మూడు రోజుల్లో 860 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎక్సైజ్ శాఖకు ఏ రేంజ్‌కు కలిసొచ్చాయో అర్థం చేసుకోవచ్చు.

నవంబర్‌ నెలలో రూ.2,567 కోట్ల విలువైన మద్యం అమ్ముడయితే ఈ మూడు రోజుల్లో 860 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎక్సైజ్ శాఖకు ఏ రేంజ్‌కు కలిసొచ్చాయో అర్థం చేసుకోవచ్చు.

Health : ఎవరెస్ట్ శిఖరమైనా ఎక్కుతారు గానీ... మద్యం మానేయమంటే మానలేరు చాలా మంది. మద్యం తాగితే అన్నీ నష్టాలే. దాన్ని మానేస్తే ఎన్నో లాభాలు కూడా. అవేంటో తెలుసుకుందాం.

4ealth : మన దేశంలో కష్టానికీ, మద్యానికీ విడదీయరాని బంధం ఉంది. రోజంతా కష్టపడే చాలా మంది... సాయంత్రం కాగానే... మద్యం బాటిల్ ఎత్తేస్తారు. సంపాదించిన కాస్త సొమ్మునూ మద్యానికి వాడేస్తారు. ఫలితంగా తాత్కాలిక కిక్కు... దీర్ఘకాలిక సమస్యల్ని తెచ్చుకుంటారు. ఐతే... మద్యం తాగడం మానేస్తే కలిగే ప్రయోజనాలు, మద్యం మానేస్తే ఎంత మేలో తెలియకపోవడం వల్లే చాలా మంది మద్యం తాగుతూ ఉంటారు. దీనిపై జరిపిన పరిశోధనల్లో అద్భుత ఫలితాలొచ్చాయి. ఒక్క నెల పాటూ మద్యం మానేసినా చాలు... గుండె, లివర్, బాడీ అన్నీ ఆరోగ్యవంతంగా మారతాయి. నెల తర్వాత మళ్లీ మద్యం తాగడం మొదలుపెడితే... మళ్లీ అన్నీ పాడైపోతూ ఉంటాయి. అమెరికాలో చలి వల్ల అక్కడి ప్రజలు మద్యం తాగకుండా ఉండలేరు. అందువల్ల అక్కడి డాక్టర్లు మహిళలైతే రోజుకు ఒక డ్రింక్, మగాళ్లైతే రోజుకు రెండు డ్రింక్స్ మాత్రమే మద్యం తాగాలని సూచించారు. మద్యం తాగితే రకరకాల కాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. చాలా మంది జనవరి రాగానే మద్యం మానేయాలని ఫిక్స్ అవుతారు. ఓ వారం తిరగ్గానే మళ్లీ పెగ్గు దిగిపోతుంది. కానీ... ఓ నెల మద్యం మానేస్తే కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

1. లివర్ మెరుగవుతుంది : మనం మద్యం తాగితే... లివర్ పాడైపోవడం గ్యారెంటీ. కానీ మన బాడీలో లివర్ అత్యంత ముఖ్యమైన అవయవం. అది పాడైతే... దాదాపు 700 రకాల అవయవాలు సరిగా పనిచేయవు. అదే మద్యం తాగడం కనీసం నెలపాటూ మానేస్తే... లివర్ తిరిగి మెరుగవుతుంది. దానిలో లోపాల్ని అదే సరిచేసుకుంటుంది. అలాగే బాడీలో విష వ్యర్థాల్ని లివర్ బయటకు పంపుతుంది. చెడు కొవ్వుల్ని కరిగించేస్తుంది. అధికంగా ఉండే హార్మోనులను తగ్గిస్తుంది. ఇలా ఎన్నో మంచి పనులు చేసే లివర్ బాగుండాలంటే... మద్యం తాగడం మానేయాలి.

2. గుండెకు రక్షణ : మద్యం తాగడం వల్ల మన శరీరంలో.... ఫ్రీ రాడికల్స్ ఎక్కువవుతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇవి ఎక్కువయ్యే కొద్దీ గుండెకు ప్రమాదమే. ఇవి ధమనుల్లో గూడుకట్టుకొని... రక్త సరఫరాను అడ్డుకుంటాయి. ఫలితంగా గుండెకు ఏదో ఒక రోజు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి... గుండె పోటు వస్తుంది. ప్రాణం పోయే ప్రమాదం తలెత్తుతుంది. అదే మద్యం మానేస్తే... ఈ కొవ్వులన్నీ క్రమంగా కరిగిపోతాయి. అలా కరిగేలా లివర్ చేస్తుంది. ఫలితంగా గుండెకు రక్త సరఫరా చక్కగా అవుతుంది. గుండె హాయిగా ఉంటుంది. 40 ఏళ్లు దాటిన వాళ్లు గుండెను కాపాడుకునేందుకు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అమెరికన్లలా భారతీయులు, చైనీయులు మద్యం తాగితే... అడ్డమైన రోగాలూ రావడం ఖాయమని... పరిశోధనల్లో తేలింది.

3. కాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ : మద్యం తాగితే... తల, మెడకు సంబంధించిన కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే... ఎసోఫాజియల్, లివర్, బ్రెస్ట్ (రొమ్ము కాన్సర్), కొలొరెక్టల్ కాన్సర్లు కూడా సోకే ప్రమాదం ఉందని పరిశోధనలు తేల్చాయి. ఇన్ని రకాల కాన్సర్లలో ఏ ఒక్కటి సోకినా... ప్రాణాలకే ప్రమాదం. ట్రీట్‌మెంట్‌కే లక్షలు వదిలిపోతాయి. అందువల్ల మద్యం తాగడం మానేస్తే... కాన్సర్లు వ్యాపించే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది.

4. బరువు తగ్గుతారు : మద్యం తాగేవారు కంట్రోల్ లేకుండా తాగుతారు. పైగా మంచింగ్ పేరుతో... కొవ్వు ఉండే స్నాక్స్ తింటారు. ఇవన్నీ బాడీలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి, పొట్ట ఇతరత్రా శరీర భాగాల్లో కొవ్వును కూడబెడతాయి. ఇక బరువు పెరగకుండా ఎలా ఉంటారు. మద్యాన్ని ఓ నెల మానేసి చూసుకుంటే కచ్చితంగా బరువు తగ్గినట్లు రుజువవుతుంది.

5. బ్రెయిన్ బాగా పనిచేస్తుంది : మద్యం తాగితే ఆ ప్రభావం మెదడుపై బాగా పడుతుంది. మెమరీ లాస్ ఏర్పడుతుంది. అదే మద్యానికి దూరంగా ఉంటే... బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. కొత్త కణాలు పుట్టుకొస్తాయి. అన్నీ లాభాలే. నెలే కాదు... 3 నెలలపాటూ మద్యాన్ని తాగడం మానేస్తే... అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయంటున్నారు డాక్టర్లు.

First published:

Tags: Health, Health Tips, Tips For Women

ఉత్తమ కథలు