Diabetics Health Tips : దసరా వెళ్లిపోయింది... దీపావళి వచ్చేసింది. బంధువులు, స్నేహితులతో వేడుకలు జరిగే సీజన్. పార్టీల్లో స్వీట్లు పంచుకోవడం... కూల్‌డ్రింక్స్ తాగడం కామన్. నలుగురితో ఉన్నప్పుడు... స్వీట్లు తినకుండా ఉంటే బాగోదు కదా అని తింటుంటారు చాలా మంది. ఐతే... డయాబెటిస్ ఉన్నవారికి ఇది సమస్యే. వాళ్లు నిరంతరం బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని చెక్ చేసుకోవడం అవసరం. అందుకోసం డైట్ కంట్రోల్ చేసుకోవాలి. స్వీట్ల వంటి వాటిని చిన్న మొత్తాల్లో మాత్రమే తీసుకోవాలి. లేదంటే... బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అది ఉత్పత్తి తగ్గితే... రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. అలా పెరిగిపోతే... బాడీలో వివిధ విభాగాలు సరిగా పనిచెయ్యవు. అది చాలా రిస్క్‌తో కూడిన వ్యవహారం. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు పండగ సీజన్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
- సంప్రదాయ చివ్డా (Chivda) బదులు... బ్రౌన్ రైస్ పోహాతో చేసుకుంటే మేలు.
- దీపావళికి సరికొత్తగా పప్పుతో చేసిన ఛకాలీ, కడ్బోలీ వంటివి చేసుకోండి.
- షుగర్ ఐటెమ్స్ బదులు... సాల్ట్‌తో చేసిన చిరుతిళ్లు తీసుకోండి. ఫ్లేవర్ కోసం పాలక్, కొత్తిమీర వంటివి యాడ్ చెయ్యండి.
- మైదా, షుగర్ వంటివి వాడకుండా ఉండటం మేలు. వాటి బదులు జొన్నపిండి, రాగిపిండి వంటివి వాడండి.
- బేసిన్ లడ్డూ తినాలనిపిస్తే... దాన్ని చక్కెర బదులు... ఖర్చూరాలు, తేనెతో తయారుచేసుకోండి. అది మీకు మేలు చేస్తుంది.
- లడ్డూలను వేరుశనగ గింజలు, డ్రైఫ్రూట్లతో కూడా చేసుకోవచ్చు.
- పండగ రోజుల్లో నెయ్యి బదులు... కొబ్బరి నూనె లేదా వేరుశనగ నూనె వాడొచ్చు.
ఎంత తినాలి : స్వీట్లు తినవచ్చు కానీ వాటిని చిన్న మొత్తాల్లో మాత్రమే తినాలి. ఒకట్రెండు ముక్కలు స్వీట్లు తిని... మిగతావి ఉప్పుతో చేసిన చిరుతిళ్లు తింటే... మనసుకు హాయిగా ఉంటుంది. ఏవి తిన్నా... భోజనం తర్వాతే తినాలి. అందువల్ల ఎక్కువ తినే అవసరం ఉండదు. అలాగే... సాయంత్రం 6 తర్వాత తింటే మేలు. ఎందుకంటే ఆ సమయం తర్వాత నుంచీ జీర్ణవ్యవస్థ నెమ్మదిస్తుంది. ఫలితంగా షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు.
డయాబెటిస్ ఉన్నవారు కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్‌గా ఉన్నప్పుడు, కంట్రోల్లో ఉన్నప్పుడు... షుగర్, స్వీట్ల వంటివి తినవచ్చు. కంట్రోల్లో లేనప్పుడు మాత్రం షుగర్‌కి దూరంగా ఉండాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health benefits, Telugu news, Tips For Women, Women health