హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Adventurous Trips: ఈ సీజన్‌లో టూర్ ప్లాన్ చేస్తున్నారా..? జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన రోడ్ ట్రిప్స్ ఇవే..

Adventurous Trips: ఈ సీజన్‌లో టూర్ ప్లాన్ చేస్తున్నారా..? జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన రోడ్ ట్రిప్స్ ఇవే..

హై వాన్ పాస్, వియత్నాం (Image: Shutterstock)

హై వాన్ పాస్, వియత్నాం (Image: Shutterstock)

Adventurous Trips: ప్రస్తుత ఫెస్టివల్ సీజన్‌లో చాలామందికి వరుస సెలవులు వచ్చాయి. ఈ హాలిడేస్‌లో టూర్ ప్లాన్ చేసేవారు.. ప్రపంచంలోని కొన్ని బ్యూటిఫుల్ స్పాట్స్‌కు వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు. ముఖ్యంగా జీవితంలో ఒక్కసారైనా రోడ్ ట్రిప్‌ ద్వారా చూడాల్సిన డెస్టినేషన్స్ కొన్ని ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ట్రావెలింగ్ (Travelling) అంటే చాలా మందికి ఇష్టముంటుంది. ప్రయాణం ప్రతి ఒక్కరికీ సరికొత్త అనుభూతినిస్తుంది. ముఖ్యంగా రోడ్ ట్రిప్స్ (Road Trips) ప్లాన్ చేసి టూర్‌ వెళ్లేవారికి జర్నీలో పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. వీరు ప్రయాణంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించవచ్చు. అయితే ప్రస్తుత ఫెస్టివల్ సీజన్‌ (Festival Season)లో చాలామందికి వరుస సెలవులు వచ్చాయి. ఈ హాలిడేస్‌లో టూర్ ప్లాన్ చేసేవారు.. ప్రపంచంలోని కొన్ని బ్యూటిఫుల్ స్పాట్స్‌కు వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు. ముఖ్యంగా జీవితంలో ఒక్కసారైనా రోడ్ ట్రిప్‌ ద్వారా చూడాల్సిన డెస్టినేషన్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.

* నార్త్ కోస్ట్ 500, స్కాట్లాండ్

అడ్వెంచర్స్ లైక్ చేసే వారికి స్కాట్లాండ్‌లోని నార్త్ కోస్ట్ 500 బెస్ట్ ట్రావెలింగ్ డెస్టినేషన్‌. ఈ ప్రాంతంలోని తీర ప్రాంత సీనరీని రోడ్ ట్రిప్ ద్వారా చూసి ఆనందించవచ్చు. ఈ జర్నీ ప్రతి ఒక్కరికీ బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్‌గా జీవిత కాలం గుర్తుంటుంది. 500 మైళ్లు ఉండే స్కాట్లాండ్ ఉత్తర తీరం చూసి ట్రావెలర్స్ ఫిదా అవుతారు.

* హై వాన్ పాస్, వియత్నాం

వియత్నాంలోని హై వాన్ పాస్‌లో రోడ్ ట్రిప్.. ట్రావెలర్స్‌కు జీవితాంతం గుర్తుండిపోయే ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఓసియన్ క్లౌడ్ పాస్ అని పిలిచే ఈ ప్రాంతంలోని నేచురల్ లొకేషన్స్‌ను జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే. ప్రపంచంలోనే ఉత్తమ తీర ప్రాంత రోడ్లు ఇక్కడ ఉంటాయి. అందుకే ఈ ప్రాంతాన్ని డిజర్టెడ్ రిబ్బన్ ఆఫ్ పర్ఫెక్షన్ అంటారు.

* పసిఫిక్ కోస్ట్ హైవే, అమెరికా

అగ్రరాజ్యం అమెరికాలోని పసిఫిక్ కోస్ట్ హైవేను కంపల్సరీగా రోడ్ ట్రిప్ ద్వారా సందర్శించాలి. ట్రావెలర్స్ ఈ ప్రాంత అందాలను సరికొత్తగా ఎక్స్‌ప్లోర్ చేయవచ్చు. 2,500 మైళ్లు ఉండే ఈ హైవేపై జర్నీ అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. మలుపులు తిరిగే రోడ్లు, తీర ప్రాంత వీక్షణ, ఆకర్షణీయమైన ప్రకృతి అందాలు టూరిస్టులను ఆకట్టుకుంటాయి.

ఇది కూడా చదవండి : చిన్న పిల్లలతో ప్రయాణించే తల్లుల కోసం కొన్ని చిట్కాలు

* న్యూజిలాండ్

ఈ దేశం చాలా చిన్నదే కానీ, ఇక్కడి ప్రకృతి అందాలు మాత్రం అనంతం అంటుంటారు ట్రావెలర్స్. టూరిస్టులకు ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం చాలా బాగా నచ్చుతుంది. న్యూజిలాండ్ రోడ్ ట్రిప్‌లో ప్రపంచంలోనే అత్యంత నీట్‌గా ఉండే రోడ్లు, నిశ్శబ్దమైన ప్రదేశాలు, ప్రకృతి అందాలు, సీనరీస్ చూడవచ్చు. ముఖ్యంగా నార్త్ లేదా సౌత్ ఐస్‌ల్యాండ్ వెళ్తే బ్యూటిఫుల్ లొకేషన్స్ చూడొచ్చు.

* కాబోట్ ట్రైల్, కెనడా

కెనడా దేశంలోని కాబోట్ ట్రైల్ ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశం. ఇక్కడ ప్రతి 300 గజాలకు మీరు అత్యద్భుతమైన ప్రకృతి దృశ్యాలను వీక్షించొచ్చు. ఇక్కడ ఉన్న వారసత్వ కట్టడాలను చూసి వింటేజ్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. ఈ ప్రాంతానికి రోడ్ ట్రిప్.. వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ రైడ్ అని ట్రావెలర్స్ ఫీడ్‌బ్యాక్ ఇస్తుంటారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Life Style, Tourism, Travelling

ఉత్తమ కథలు