హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Hair Fall Remedies: విపరీతంగా జుట్టు రాలిపోతోందా.. జుట్టు రాలటాన్ని తగ్గించే 4 నేచురల్ రెమెడీస్ ఇవే..!

Hair Fall Remedies: విపరీతంగా జుట్టు రాలిపోతోందా.. జుట్టు రాలటాన్ని తగ్గించే 4 నేచురల్ రెమెడీస్ ఇవే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hair Fall Remedies: వర్షాకాలంలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా వేధిస్తుంది. అధిక తేమ కారణంగా తల చర్మం జిడ్డుగా, జిగటగా మారుతుంది. అప్పుడు కుదుళ్లు బాగా బలహీనంగా తయారై ఊడిపోతాయి. ఈ జుట్టు రాలే సమస్యకు కొన్ని నేచురల్ రెమెడీలతో చెక్ పెట్టొచ్చు. ఆ రెమిడీస్ పై ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

పొడవాటి ఒత్తైన జుట్టు (Hair) ఉండాలని ఆడ మగ భేదం లేకుండా అందరూ కోరుకుంటారు. అయితే వర్షాకాలం, ఎండాకాలం వంటి సీజన్లలో జుట్టుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్రస్తుతం భారతదేశంలో వర్షాకాలం (Monsoon) కొనసాగుతోంది కాబట్టి ఈ సీజన్‌లో కురుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వర్షాకాలంలో తేమ (Moisture) అధికంగా ఉంటుంది. దీనివల్ల అనేక జుట్టు సమస్యలు తలెత్తుతాయి. వర్షాకాలంలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా వేధిస్తుంది. అధిక తేమ కారణంగా తల చర్మం జిడ్డుగా, జిగటగా మారుతుంది. అప్పుడు కుదుళ్లు బాగా బలహీనంగా తయారై ఊడిపోతాయి. ఈ జుట్టు రాలే సమస్యకు కొన్ని నేచురల్ రెమెడీలతో చెక్ పెట్టొచ్చు. ఆ రెమిడీస్ పై ఇప్పుడు తెలుసుకుందాం.

* హాట్ ఆయిల్ మసాజ్

జుట్టు బలంగా ఉండాలంటే తరచుగా జుట్టుకి ఆయిల్ రాయాలని నిపుణులు చెబుతుంటారు. ఆయిల్ మసాజ్ చేస్తే ఇంకా ఎక్కువ ఫలితాలు కనిపిస్తాయి. ఆయిల్‌ను కాస్త వేడి చేసి మాడుకు మసాజ్ చేస్తే రక్తప్రసరణ మరింత మెరుగుపడుతుంది. అప్పుడు కుదుళ్లు మరింత దృఢం అవుతాయి. దీంతో విపరీతంగా జుట్టు రాలే సమస్య దూరమవుతుంది.

హాట్ ఆయిల్ మసాజ్ చేయాలనుకునేవారు మొదటగా ఒక గిన్నెలో కొంచెం నూనె తీసుకోవాలి. దీన్ని వేడి చేయాలి. ఆపై గోరువెచ్చని నూనెతో మీ తలను మునివేళ్లతో చక్కగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా, మీ తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది. అలానే నూనె జుట్టు మూలాల్లోకి ప్రవేశించి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

* మెంతులు, సోపు గింజల హెయిర్ ప్యాక్

మెంతులు, సోపు గింజలు రెండూ కొత్త జుట్టు పెరగడానికి ఎంతో సహాయ పడతాయి. వీటితో హెయిర్ మాస్క్‌ను తయారు చేయడానికి ముందుగా మీరు వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మీ తలకు, జుట్టుకు రాసుకోవాలి. అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. చాలా తక్కువ రోజుల్లో ఎక్కువ ఫలితాలను పొందడానికి వారానికి రెండుసార్లు ఈ హెయిర్ ప్యాక్‌ను తలకు అప్లై చేసుకోవాలి.

* హెర్బల్ హెయిర్ ప్యాక్

కలబంద, కరివేపాకు, ఉసిరి, మెంతులు, మందారంతో హెర్బల్ హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇందుకు ఈ పదార్థాలను మిక్సీలో బాగా గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత దీన్ని తలకు అప్లై చేసి 40 నిమిషాల పాటు ఉంచి, ఆపై కడిగేయాలి. ఈ మిశ్రమం జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. pH బ్యాలెన్స్‌ను కూడా మెయింటెన్ చేస్తుంది. ఫలితాలు త్వరగా కనిపించాలంటే మీరు వారానికి ఒకసారి ఈ పేస్ట్‌ను అప్లై చేయాలి.

ఇది కూడా చదవండి : శోభనం రాత్రి అవి మాత్రం తినకండి.. తింటే ఉత్సాహం మొత్తం నీరుగారిపోయినట్లే.!

పైన పేర్కొన్న నేచురల్ రెమెడీస్ ట్రై చేయడంతోపాటు మీ జీవనశైలి, ఆహారంపై కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. జుట్టు రాలడం సమస్యలను తగ్గించడానికి పోషకాహారం తీసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. అలాగే, యోగా, ప్రాణాయామం డైలీ చేస్తూ ఉంటే ఒత్తిడి వంటి సమస్యలు దూరమవుతాయి. దీంతో జుట్టు రాలడానికి చెక్ పెట్టవచ్చు.

First published:

Tags: Hair fall, Hair Loss, Hair problem tips, Health care

ఉత్తమ కథలు